E-Paper
Advertisement

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!
Advertisement

Kia Syros EV vs Kia Syros ICE: కియా రీసెంట్ గా భారత మార్కెట్లో సైరోస్ EVని పరిచయం చేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో సైరోస్ ICE అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రావడంతో కొనుగోలుదారులు ఏ మోడల్‌ ను తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. డిజైన్, ఫీచర్లు, పనితీరు, ధర పరంగా ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న కీలకమైన తేడాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ధరలో తేడా ఎంత?

కియా సైరోస్ ICE ధర ప్రస్తుతం రూ.8.42 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంది. మరోవైపు, సైరోస్ EV ధర అధికారికంగా ప్రకటించకపోయినా రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఎలక్ట్రిక్ వెర్షన్ ధర పెట్రోల్, డీజిల్ మోడళ్ల కంటే సుమారు రూ.4–5 లక్షలు ఎక్కువగా ఉండొచ్చు.

డిజైన్‌ గురించి..

Advertisement

రెండు మోడళ్ల లుక్ దాదాపు ఒకేలా ఉంటుంది. ముందు భాగంలో స్టైలిష్ LED హెడ్‌ ల్యాంప్స్, ఫ్లాట్ బోనెట్, బోల్డ్ బంపర్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ ఆకట్టుకుంటాయి. అయితే EVలో మాత్రమే ముందు ఎడమ వైపు చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అంతేకాదు,  ఏరో అల్లాయ్ వీల్స్ కూడా EVకే లభిస్తాయి. మిగతా బాడీ డిజైన్, వెనుక భాగం, టెయిల్‌ల్యాంప్స్ రెండింటిలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి.

ఇంటీరియర్ గురించి..

క్యాబిన్ లేఅవుట్ రెండు మోడళ్లలో దాదాపు ఒకేలా ఉన్నా కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. EVలో మూడు స్పోక్ స్టీరింగ్ వీల్, కాలమ్ మౌంటెడ్ గేర్ సెలెక్టర్ ఉంటాయి. ICEలో సాధారణ గేర్ లివర్‌ తో రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. రెండు మోడళ్లలో కూడా 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ ప్లే లాంటి అత్యాధునిక సెటప్ ను కలిగి ఉంటుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?   

Advertisement

పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ప్రీమియం ఫీచర్లు రెండు మోడళ్లలోనూ ఉన్నాయి. అయితే EVలో మాత్రమే 64 కలర్స్ అంబియంట్ లైటింగ్, డిజిటల్ కీ, V2L  ఫీచర్, 360 డిగ్రీ కెమెరా లాంటి అడిషనల్ సదుపాయాలు ఉన్నాయి.

భద్రత గురించి..

భద్రత విషయంలో కూడా రెండు SUVలు మంచి ప్యాకేజీని అందిస్తున్నాయి. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ESC, పార్కింగ్ సెన్సార్లు, లెవెల్ 2 ADAS, TPMS లాంటి ఫీచర్లు రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా రెండూ మంచి ఆప్షన్స్ గా ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్

సైరోస్ EVలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 42 kWh బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 443 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. 51.4 kWh బ్యాటరీతో 526 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ICE వెర్షన్‌ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ స్పోర్టీ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తే, డీజిల్ ఇంజిన్ ఎక్కువ మైలేజీ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

ఏది కొంటే బెస్ట్?   

రోజువారీ ప్రయాణం ఎక్కువగా సిటీలోనే ఉండి, ఇంధన ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే, ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ కోనుగోలు చేయడం మంచిది. అయితే, తక్కువ బడ్జెట్‌ లో, సుదూర ప్రయాణాలు ఎక్కువగా చేసే వారు  కియా సైరోస్ ICE కొనుగోలు చేయడం మంచిది.

Read Also: భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×