E-Paper
Advertisement

Kinetic DX: 1984 కైనెటిక్ DX రీ-ఎంట్రీ.. ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్ లో!

Kinetic DX: 1984 కైనెటిక్ DX రీ-ఎంట్రీ..  ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్ లో!
Advertisement

kinetic dx 1984 vs 2025: 1980లలో ఓ రేంజ్ లో పాపులర్ అయిన కైనెటిక్ డిఎక్స్ స్కూటర్ ఇప్పుడు కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. 1984లో వచ్చిన 2-స్ట్రోక్ పెట్రోల్ స్కూటర్‌ ను ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా 2025లో పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ గా మార్చారు. పాత మోడల్‌ కి ఉన్న గుర్తింపును కొనసాగిస్తూ, కొత్త టెక్నాలజీని జోడించి స్కూటర్ ను రూపొందించారు.

కొత్త కైనెటిక్ ధర ఎంత అంటే?

కొత్త 2025 కైనెటిక్ డిఎక్స్ ధర సుమారు రూ. 1.11 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్  కావడంతో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులకు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఆకట్టుకుంటుంది. పాత మోడల్‌ లో ఉన్న ఆల్ మెటల్ బాడీ స్టైల్‌ను కొనసాగిస్తూ, దీనికి రిట్రో లుక్ ఇచ్చారు. అదే సమయంలో LED లైటింగ్, డిజిటల్ ఫీచర్లు వంటి ఆధునిక అంశాలు కూడా యాడ్ చేశారు.

పవర్‌ ట్రెయిన్ గురించి..

Advertisement

1984 మోడల్‌ లో 98cc సామర్థ్యం కలిగిన 2-స్ట్రోక్ ఇంజిన్ ఉండేది. ఇది సుమారు 7.8 PS పవర్ ఇస్తూ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్‌ తో వచ్చేది. అయితే, 2025 మోడల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో 2.6kWh LFP బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.ఇది సుమారు 4.8kW శక్తిని ఇస్తుంది. అప్పటి పెట్రోల్ ఇంజిన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌ కు మారడం ఈ స్కూటర్‌ వచ్చిన కీలక మార్పుగా చెప్పుకోవచ్చు.

పనితీరు పరంగా చూస్తే.. పాత మోడల్ వేగం, శబ్దం, పవర్‌ కి పాపులర్ అయ్యింది. కానీ, కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రం శబ్దం లేకుండా సాఫ్ట్‌ గా నడుస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 102 నుంచి 116 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది సిటీ ప్రయాణాలకు సరిపడే రేంజ్‌గా చెప్పుకోవచ్చు.

డిజైన్ లోనూ కీలక మార్పులు

Advertisement

డిజైన్‌ లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. పాత స్కూటర్‌ లో వెనుక భాగంలో స్పేర్ వీల్ ఉండేది. కొత్త మోడల్‌లో దాని స్థానంలో గ్రాబ్ రైల్‌ ను అందించారు. అలాగే చిన్న వీల్స్ బదులుగా 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ వాడటం వల్ల స్టేబిలిటీ మెరుగైంది. ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ ఉండటం వల్ల కూర్చునే విధానం కూడా సౌకర్యంగా ఉంటుంది. టెక్నాలజీ పరంగా కొత్త కైనెటిక్ డిఎక్స్ మరింత ముందుంది. ఇందులో 8.8 ఇంచ్ డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉండటం వల్ల వాడకం మరింత సులభమైంది.

రెండు వేరియంట్లలో అందుబాటులో..

ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి DX కాగా, మరొకటి DX+. వీటి ధరలు రూ. 1.11 లక్షల నుంచి రూ. 1.18 లక్షల వరకు ఉంటాయి.  పాతకాలపు డిజైన్‌ ను తొలగించకుండా, ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో కొత్తగా వచ్చిన ఈ కైనెటిక్ డిఎక్స్ స్కూటర్, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే కొత్త తరానికి సరిపోయేలా రూపొందించబడింది.

Read Also: బైక్ దొంగలను భయపెట్టే అలారం లాక్, ఎలా పని చేస్తుందో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×