E-Paper
Advertisement

బైక్ దొంగలను భయపెట్టే అలారం లాక్, ఎలా పని చేస్తుందో తెలుసా?

బైక్ దొంగలను భయపెట్టే అలారం లాక్, ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement

Anti-Theft Bike Lock Guide: ఈ రోజుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. సిటీలతో పాటు టౌన్లలోనూ బయటపెట్టిన బైక్ లను మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బైక్ దొంగలను భయపెట్టే కొత్త అలారం లాక్ లు అందుబాటులోకి వచ్చాయి. బైక్, స్కూటర్ భద్రత కోసం ఈ డిస్క్ లాక్‌లు చాలా ఉపయోగకరంగా మారాయి. ముఖ్యంగా అల్యూమినియం బాడీతో వచ్చే అలారం డిస్క్ లాక్‌లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ లాక్‌లు కేవలం వెహికల్ ను లాక్ చేయడమే కాకుండా, దొంగతనాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ డిస్క్ లాక్ ఎలా పని చేస్తుందంటే?

ఈ డిస్క్ లాక్‌ను ఉపయోగించడం చాలా సులభం. బైక్ ముందు లేదంటే వెనుక డిస్క్ బ్రేక్‌ కు లాక్‌ ను ఫిక్స్ చేయాలి. లాక్ సిలిండర్‌ను క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్‌ గా లాక్ అవుతుంది. ప్రత్యేకంగా కీతోనే మళ్లీ ఓపెన్ చేయాలి. దీనిలో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ వల్ల వాహనాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగుతుంది. ఈ లాక్‌లో ముఖ్యమైన ఫీచర్ 110 డెసిబెల్స్ సౌండ్ తో వచ్చే అలారం. ఎవరు వాహనాన్ని కదిలించినా, లాక్‌ ను తీసేందుకు ప్రయత్నించినా,  ఈ అలారం గట్టిగా మోగి చుట్టుపక్కల వారిని అలర్ట్ చేస్తుంది. దొంగలు వెంటనే అక్కడి నుంచి పారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

డిస్క్ అలారం లాక్ ప్రత్యేకతలు

Advertisement

ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. వర్షం, దుమ్ము లాంటి పరిస్థితుల్లో కూడా ఇది సరిగ్గా పనిచేస్తుంది. ప్రత్యేక సీలింగ్ టెక్నాలజీతో తయారు చేసినందున మెకానిజం సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి వాతావరణంలోనైనా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ డిస్క్ లాక్ 7mm వరకు మందం ఉన్న డిస్క్ బ్రేక్‌లకు సరిపోతుంది. కాబట్టి ఇది ఎక్కువ భాగం బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సైకిళ్లకు అనువుగా ఉంటుంది. బలమైన అల్యూమినియం నిర్మాణం వల్ల దీన్ని పగలగొట్టడం కూడా కష్టమే.

ధర ఎంత ఉంటుందంటే?

ధర విషయానికి వస్తే, ఈ రకం అలారం డిస్క్ లాక్‌లు సాధారణంగా రూ.300 నుంచి రూ.800 మధ్యలో లభిస్తాయి. బ్రాండ్, క్వాలిటీ ఆధారంగా ధర మారవచ్చు. కొంతమంది ప్రీమియం మోడల్స్ రూ.1000 వరకు ఉండొచ్చు. ఈ లాక్‌ లు ఆన్‌ లైన్ షాపింగ్ సైట్లలో సులభంగా లభిస్తాయి. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి లాంటి ఈ కామర్స్ సైట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. సమీపంలోని ఆటోమొబైల్ యాక్సెసరీస్ షాపుల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి.  తక్కువ ధరలో ఎక్కువ భద్రతను అందించే ఈ డిస్క్ లాక్‌లు బైక్ యజమానులకు మంచి ఎంపిక. రోజువారీగా వాహనాన్ని బయట పార్క్ చేసే వారు తప్పనిసరిగా ఇలాంటి సెక్యూరిటీ యాక్సెసరీలను ఉపయోగించడం మంచిది.

Advertisement

Read Also: హ్యుందాయ్ నుంచి కళ్లు చెదిరే ఫ్యూచరిస్టిక్ కార్లు, డిజైన్‌ చూస్తే మతిపోవాల్సిందే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×