E-Paper
Advertisement

Discontinued Cars in India: ఆల్టో 800 TO రెనాల్ట్ క్విడ్.. 2025లో డిస్ కంటిన్యూ అయిన కార్లు ఇవే!

Discontinued Cars in India: ఆల్టో 800 TO రెనాల్ట్ క్విడ్.. 2025లో డిస్ కంటిన్యూ అయిన కార్లు ఇవే!
Advertisement

Discontinued Cars in India 2025: ప్రతి ఏటా ఆటో మేకర్లు సరికొత్త కార్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తమ పోర్ట్‌ ఫోలియోలను రీఫ్రెష్ చేస్తున్నారు.  2025 కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆయా బ్రాండ్లు లేటెస్ట్ డిజైన్‌లు, సరికొత్త టెక్నాలజీ, కాలుష్య కారకాల తగ్గింపు లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పలు కార్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. 2025లో అలా నిలిపివేసిన కొన్ని కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఆల్టో 800

దేశీయ కార్ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కారు మారుతి సుజుకి ఆల్టో 800. తక్కువ ధర, ఈజీ మెయింటెనెన్స్, మంచి మైలేజ్ కారణంగా లక్షలాది మంది మధ్య తరగతి ప్రజలకు ఈ కారును కొనుగోలు చేశారు. అయితే, ఆల్టో 800 ఉత్పత్తిని 2025లో నిలిపివేసింది కంపెనీ.  BS6 నిబంధనల్లో భాగంగా పొల్యూషన్ కంట్రోల్, 6 ఎయిర్‌ బ్యాగ్స్ రూల్స్ ప్రకారం కారులో పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకే, దాని ఉత్పత్తి నిలిపివేయడం మంచిదని కంపెనీ నిర్ణయించింది.

⦿ హ్యుందాయ్ ఆరా డీజిల్

Advertisement

ఆరా డీజిల్ వేరియంట్ టాక్సీ, లాంగ్ డ్రైవింగ్ కు అనుగుణంగా ఉండేది.  దాని పనితీరు, మంచి మైలేజ్ యూజర్లు బాగా ఆకట్టుకుంటుంది. అయితే, చిన్న డీజిల్ ఇంజిన్లకు డిమాండ్ తగ్గడం, BS6 నిబంధనల కారణంగా డీజిల్ ఇంజిన్ అప్‌గ్రేడ్‌లు ఖరీదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరా డీజిల్ వేరియంట్‌ను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. పాత వాహనాలు మాత్రం రోడ్ల మీద కనిపిస్తున్నాయి.

⦿ హోండా అమేజ్ డీజిల్

హోండా అమేజ్ డీజిల్ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. CVT ఆటోమేటిక్ డీజిల్ ఆప్షన్ కు బాగా ప్రసిద్ధి చెందింది. అయితే, దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తిని హోండా నిలిపివేసింది. BS6 నిబంధనల కారణంగా ఇంజిన్ అప్‌గ్రేడ్‌లు చాలా ఖర్చు అవుతాయి. ఈ కారణంగానే అమేజ్ డీజిల్ తయారీని నిలిపివేసింది.

⦿ మహీంద్రా KUV100 NXT

Advertisement

మహీంద్రా దీనిని మైక్రో SUVగా విడుదల చేసింది. ఇది SUV హైట్, సిటీకి అనుకూలమైన హ్యాచ్‌ బ్యాక్ పరిమాణాన్ని కలిగి ఉండేది. నెక్సాన్, పంచ్, మాగ్నైట్ లాంటి కార్లు దీనికి గట్టి పోటీ ఇచ్చాయి.  మహీంద్రా ఇప్పుడు EVలు, పెద్ద SUVలపై ఫోకస్పెట్టింది. దీని 6 సీటర్ వెర్షన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఇంటీరియర్ క్వాలిటీ, ఫీచర్లు అంతగా ఆకట్టుకోలేదు.

⦿ నిస్సాన్ కిక్స్

నిస్సాన్ కిక్స్  చూడ్డానికి స్టైలిష్ గా ఉండేది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా దృఢంగా ఉండేది.  కానీ ఈ SUV మార్కెటింగ్,  డీలర్ నెట్‌వర్క్ లేకపోవడంతో మార్కెట్లో దాని అమ్మకాలను పరిమితం చేసింది. అదే సమయంలో క్రెటా, సెల్టోస్ పోటీ నుంచి తట్టుకోలేకపోయింది. నిస్సాన్ ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేందుకు మాగ్నైట్ EV లాంటి కొత్త కార్లను తీసుకువస్తోంది.

⦿ రెనాల్ట్ క్విడ్ 1.0 AMT

క్విడ్ 1.0 AMT చిన్న కార్ల విభాగంలో SUV డిజైన్, AMT ఆటోమేటిక్‌ను అందించిన మొదటి కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. EV కార్లకు పెరుగుతున్న డిమాండ్, టాటా టియాగో EV లాంటి వాటితో గట్టి పోటీ ఉత్పత్తి నిలిపివేతకు కారణం అయ్యింది. ఈ విభాగంలో కొత్త టెక్నాలజీ, ఫీచర్ల కోసం డిమాండ్ పెరిగింది. ఫలితంగా దాని నిలిపివేయాల్సి వచ్చింది.

Read Also: ఒక్క ఛార్జ్ తో 250 కిలో మీటర్లు.. ఓలా నుంచి అదిరిపోయే ఈవీ వచ్చేసింది!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×