E-Paper
Advertisement

OLA Roadster EV: ఒక్క ఛార్జ్ తో 250 కిలో మీటర్లు.. ఓలా నుంచి అదిరిపోయే ఈవీ వచ్చేసింది!

OLA Roadster EV: ఒక్క ఛార్జ్ తో 250 కిలో మీటర్లు..  ఓలా నుంచి అదిరిపోయే ఈవీ వచ్చేసింది!
Advertisement

OLA Roadster EV 2026: దేశీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త స్కూటర్లు, బైకులు అందుబాటులోకి తీసుకొస్తోంది. రీసెంట్ గా తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ను అందించే ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రోడ్‌స్టర్ EV పేరుతో ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. దీనిని నియో కమ్యూటర్ స్టైల్ లో డిజైన్ చేసింది. ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఇది సిటీతో పాటు హైవే రైడింగ్ కు అనుగుణంగా ఉంటంది. ఎకో ఫ్రెండ్లీ, లో మెయింటెనెన్స్ ను కలిగి ఉంటుంది.  ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఓలా రోడ్‌స్టర్ EV ధరలు

రోడ్‌స్టర్ EV ప్రస్తుతం మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 3.5 kWh వేరియంట్ ధర రూ. 1,04,999గా కంపెనీ నిర్ణయించింది. 4.5 kWh వేరియంట్ ధర రూ. 1,29,999గా ఫిక్స్ చేసింది. మూడో వేరియంట్ 6 kWh ధర రూ. 1,39,999 గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా నగరాలు, సబ్సిడీల ఆధారంగా ఆన్ రోడ్ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.46 లక్షల వరకు ఉంటుంది.

ఓలా రోడ్‌స్టర్ EV ఛార్జింగ్, రేంజ్ వివరాలు

Advertisement

ఓలా రోడ్‌స్టర్ EV IDC సర్టిఫైడ్ ప్రకారం ఒక్క ఛార్జ్ తో 151 కిలో మీటర్ల నుంచి 248 కిలో మీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ఒరిజినల్ గా 120 కిలో మీటర్ల నుంచి 200 కిలో మీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఎకో మోడ్‌ లో మాక్సిమమ్ రేంజ్ ను అందిస్తుంది. ఛార్జింగ్ టైమ్ విషయానికి వస్తే స్టాండర్డ్ హోమ్ ఛార్జర్‌ తో 0-80 శాత వరరకు 4.6 నుంచి 7.9 గంటలు పడుతుంది.  ఫుల్ ఛార్జ్ కోసం 6-10 గంటలు పడుతుంది. Ola హైపర్‌ ఛార్జర్ నెట్‌ వర్క్ తో ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. ఇక్కడ 0-80 శాతం ఛార్జింగ్ పొందేందుకు కేవలం 4 గంటల సమయం పడుతుంది.

ఓలా రోడ్‌స్టర్ EV  ఫీచర్లు

ఓలా రోడ్‌స్టర్ EV నియో కమ్యూటర్ స్టైల్ లో ఉంటుంది. రౌండ్ LED హెడ్‌ లైట్, స్లిమ్ సీట్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సింగిల్ ఛానల్ ABS, డిస్క్ బ్రేక్స్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.  రిజెనరేటివ్ బ్రేకింగ్, IP65 రేటెడ్ బ్యాటరీ, లో వెయిట్,  ఈజీ హ్యాండ్లింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.  ఈ బైక్ మొత్తం 6 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. స్మూత్, సైలెంట్ రైడ్, ఇన్‌స్టంట్ టార్క్ అందిస్తుంది. సిటీలో అజైల్, హైవేలో స్టేబుల్ మోడ్స్ బెస్ట్.

ఓలా రోడ్‌స్టర్ EV  అనుకూల, ప్రతికూల అంశాలు  

Advertisement

లో కాస్ట్, హై రేంజ్ కలిగి ఉంటుంది. ఫాస్ట్ యాక్సలరేషన్, మోడర్న్ ఫీచర్లు ఉంటాయి. లో రన్నింగ్ కాస్ట్ ఉంటుంది.  మంచి బిల్డ్ క్వాలిటీ, వారంటీ ఉంటుంది. ఎక్కువ ఛార్జింగ్ సమయం మైనస్ గా చెప్పుకోవచ్చు. ఈ ధర రేంజ్‌లో ఇంత రేంజ్ ఇవ్వడం ఓలా ప్లస్ పాయింట్. ఈ బైక్ Ather 450X, Bajaj Chetakతో పోటీ పడుతుంది.

Read Also: సూపర్ లుక్, వావ్ అనిపించే ఫీచర్లు, ఆకట్టుకుంటున్న కొత్త టీవీఎస్ జెస్ట్ 110!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×