E-Paper
Advertisement

Low Selling Cars Jan 2026: కియా To మహీంద్రా.. అమ్మకాల్లో సత్తా చాటని కార్లు ఇవే!

Low Selling Cars Jan 2026: కియా To మహీంద్రా..  అమ్మకాల్లో సత్తా చాటని కార్లు ఇవే!
Advertisement

Low Selling Cars Jan 2026 In India: 2025 ఇయర్ ఎండింగ్, 2026 స్టార్టింగ్ నివేదికల ప్రకారం దేశంలో తక్కువగా అమ్ముడవుతున్న కార్ల లిస్టులో ఎక్కువగా హై-ఎండ్ ప్రీమియం, ఇంపోర్టెడ్, నిచ్ మోడళ్లు ఉన్నాయి. తక్కువ యూనిట్లు అమ్ముడైన కార్లలో EV9, గోల్ఫ్ GTI, ఫోర్స్ సిటీ లైన్, మహీంద్రా మరాజో, రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ లాంటి జీప్ మోడళ్లు ఉన్నాయి.  ప్రీమియం EVలు, పెద్ద, ఇంపోర్ట్ చేసుకున్నSUVలు ఎక్కువ ధరల కారణంగా అమ్మకాల్లో సత్తా చాటలేకపోతున్నాయి.

తక్కువ అమ్మకాలున్న కీలక మోడల్స్  

⦿ కియా EV9: కియాకు సంబంధించి పలు కార్లు అమ్మకాల్లో సత్తా చాటుతున్న, కియా EV9 అమ్మకాలు అంతగా లేవు. రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే ఎలక్ట్రిక్ SUV సింగిల్ యూనిట్ అమ్మకాలను కనబరిచింది.

Advertisement

⦿ వోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్ GTI: అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు ఇండియన్ మార్కెట్లో అధిక ధరల స్థానం అంతగా అమ్మకాలు జరుపుకోవడం లేదు.

⦿ జీప్ రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ:  ఈ జీప్ లు ఇండియాలోనే రెడీ అవుతున్నా, లగ్జరీ ప్రత్యర్థులతో పోలిస్తే తక్కువ అమ్మకాలను కలిగి ఉన్నాయి.

Advertisement

⦿ మహీంద్రా మరాజో: ఈ మోడల్ కు సంబంధించి 2025 వరకు అమ్మకాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, కొత్త ఏడాదిలో ఈ MPV తక్కువ డిమాండ్‌ను కలిగి ఉంది.

⦿ ఫోర్స్ మోటార్స్: ఈ కంపెనీకి చెందిన కార్లకు కూడా అనుకున్న స్థాయిలో వినియోగదారుల నుంచి ఆదరణ కనిపించడం లేదు. అమ్మకాల పరంగా చాలా వెనుకబడి ఉంది.

Read Also: టాటా ఆల్ట్రోజ్ CNG మైలేజ్ టెస్ట్, బాబోయ్.. అంతదూరం వెళ్లొచ్చా?

తక్కువ అమ్మకాలకు కారణాలు ఏంటి?  

⦿ అధిక ధర: పలు బ్రాండ్లకు చెందిన కార్లు అమ్మకాల్లో సత్తా చాటకపోవడానికి ముఖ్యమైన కారణం ఎక్కువ ధర. రూ. 20-30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం, దిగుమతి చేసుకున్న మోడళ్లకు ఇండియాలో పరిమిత మార్కెట్ డిమాండ్ ఉంది.

⦿ నిచ్ విభాగాలు: గోల్ఫ్ GTI, 3 వరుస SUVలు నిర్దిష్టమైన, నాన్ మాస్ మార్కెట్ ఆకర్షణను కలిగి ఉన్నాయి. అందుకే ఎక్కువగా అమ్ముడు కావడం లేదు.

⦿ అప్ డేట్స్ లేకపోవడం: మరాజ్జో లాంటి మోడల్స్ తరచుగా పాత డిజైన్, ఫీచర్ల కారణంగా తక్కువ అమ్మకాలను కొనసాగిస్తున్నాయి.

మొత్తంగా ఈ లిస్టులోని కొన్ని మోడళ్లు తక్కువ అమ్మకాలను కొనసాగిస్తున్నాయి.  జనవరి 2026లో కొత్తగా విడుదలైన  న్యూ రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ గ్రావైట్,  టయోటా అర్బన్ క్రూయిజర్ EV, మారుతి ఇ విటారా లాంటి ఎలక్ట్రిక్ వాహనాలు ఆయా విభాగాలలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Read Also:  రోల్స్ రాయిస్ కార్లకు ఎందుకు అంత ధర.. అల్టిమేట్ లగ్జరీ వెనుక రహస్యం ఇదే!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×