E-Paper
Advertisement

Maruti Cervo 2026: మారుతి నుంచి క్రేజీ కారు, వామ్మో.. అంత మైలేజ్ ఇస్తుందా?

Maruti Cervo 2026: మారుతి నుంచి క్రేజీ కారు, వామ్మో.. అంత మైలేజ్ ఇస్తుందా?
Advertisement

Maruti Cervo 2026 Launched: మారుతి సుజుకి నుంచి మరో క్రేజీ కారు మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ, బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాచ్‌ బ్యాక్‌ గా మారుతి సెర్వో 2026  పరిచయం  అయ్యింది. ఈ కారు తక్కువ ధరలో ఎక్కువ మైలేజీతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోబోతోంది. లేటెస్ట్ స్టైలింగ్, ఈజీ EMI ప్లాన్స్ తో మారుతి సుజుకి ఈ కారును విడుదల చేసింది.  పెరుగుతున్న ఇంధన ఖర్చులు, సిటీ ట్రాఫిక్ నేపథ్యంలో చిన్న కార్లకు డిమాండ్‌ పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా సెర్వో 2026 రూపొందించింది మారుతి సుజుకి కంపెనీ.

మారుతి సెర్వో 2026 డిజైన్

మారుతి సెర్వో 2026 డిజైన్ చూడ్డాని అద్భుతంగా ఉంటుంది. లేటెస్ట్ డిజైన్ తో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ కాంపాక్ట్ కొలతలు రద్దీగా ఉండే సిటీ రోడ్స్ కు అనుగుణంగా ఉంటాయి. అదిరిపోయే స్టైలింగ్ మంచి లుక్ తో అలరిస్తుంది. ముందు భాగంలో స్లిమ్ గ్రిల్, స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ ల్యాంప్‌లు, ఏరోడైనమిక్స్‌ ను మెరుగుపరిచే క్లీన్ బంపర్ డిజైన్ ఉన్నాయి. చిన్న వీల్‌ బేస్ సులభంగా పార్క్ చేసేలా ఉంటాయి. బాడీ కలర్, వీల్ కవర్లు ఫ్రెష్ లుక్ ను కలిగిస్తాయి. ఎంట్రీ లెవల్ కారు అయినప్పటికీ, సెర్వో మంచి రూపంతో ఆకట్టుకుంటుంది.

స్మార్ట్ ఫీచర్లు, ఫంక్షనల్ ఇంటీరియర్ క్యాబిన్

Advertisement

మారుతి సెర్వో 2026 ఇంటీరియర్ లోపల చాలా బాగుటుంది. క్యాబిన్ లే అవుట్ ఎర్గోనామిక్‌ గా ఉంటుంది, రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. చిన్న సీట్లు మిడ్ రేంజ్ ప్రయాణాలకు బాగా కుషన్ చేయబడ్డాయి. ట్రాఫిక్‌లో కూడా సౌకర్యాన్ని అందిస్తాయి. డ్యాష్‌ బోర్డ్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. విశాలమైన హెడ్‌ రూమ్, లెగ్‌ రూమ్ కారును చిన్న ఫ్యామిలీకి అనుకూలంగా మార్చుతాయి. ఇందులో బూట్ స్పేస్ బాగుంటుంది. రోజువారీ షాపింగ్, ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీతో కూడిన టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ టాప్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది మ్యూజిక్ స్ట్రీమింగ్, నావిగేషన్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. USB ఛార్జింగ్ పోర్ట్‌ లు, మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది.

మారుతి సెర్వో 2026 ఇంజిన్, మైలేజ్

మారుతి సెర్వో 2026లో పవర్ ఫుల్ ఇంజిన్ ఉంటుంది. ఆప్టిమైజ్ చేసిన చిన్న డిస్‌ప్లేస్‌మెంట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.  మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ప్రామాణికంగా రానుంది. తక్కువ మెయింటెన్స్, సులభమైన సర్వీసింగ్‌ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారులో అత్యంత కీలకమైన విషయం మైలేజ్. ఇది లీటర్ కు ఏకంగా 32 కిలో మీటర్లు ప్రయాణించనుంది. గంటకు 130 కి.మీ టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.  2026లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే ఎంట్రీ కార్లలో ఇది టాప్ లో ఉండబోతోంది. ఈ కారు రన్నింగ్ ఖర్చులను భారీగా తగ్గిస్తుంది.

మారుతి సెర్వో 2026 సేఫ్టీ ఫీచర్లు

Advertisement

ఈ కారు సరసమైన పొజిషనింగ్ ఉన్నప్పటికీ, మారుతి సెర్వో 2026లో భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. రీన్ఫోర్స్డ్ బాడీ స్ట్రక్చర్ క్రాష్ సేఫ్టీని కలిగి ఉంటుంది. ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, సీట్‌ బెల్ట్ రిమైండర్‌ లాంటి ఫీచర్లు సురక్షితమైన డ్రైవింగ్‌కు ఉపయోగపడుతాయి.

మారుతి సెర్వో 2026  ధర  

మారుతి సెర్వో 2026 ధర రూ. 4.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు నెలకు రూ. 8,999  EMI ప్లాన్ తో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

Read Also:  రూ. 12 లక్షల లోపు మంచి బూట్ స్పేస్‌ కార్లు.. వెకేషన్స్ కు వెరీ బెస్ట్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×