E-Paper
Advertisement

Cars Under Rs 12 lakh: రూ. 12 లక్షల లోపు మంచి బూట్ స్పేస్‌ కార్లు.. వెకేషన్స్ కు వెరీ బెస్ట్!

Cars Under Rs 12 lakh: రూ. 12 లక్షల లోపు మంచి బూట్ స్పేస్‌ కార్లు.. వెకేషన్స్ కు వెరీ బెస్ట్!
Advertisement

చాలా మంది వీకెండ్స్ లో, హాలీడేస్ లో లాంగ్ డ్రైవ్ లు, వెకేషన్లకు వెళ్తుంటారు. వారు పెద్ద బూట్ స్పేస్ ఉన్న కార్లను ఎక్కువగా ఇష్టపడుతారు. ప్రస్తుతం మంచి బూట్ స్పేస్ కలిగిన పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ. 12 లక్షల లోపు అదిరిపోయే కార్లు ఉన్నాయి. ఇవి మంచి లగేజీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అంతేకాదు, ఖరీదైన వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి కూడా. ఇంతకీ ఆ కార్లు ఏవి? ఎంత బూట్ స్పేస్ ను కలిగి ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ స్కోడా స్లావియా

స్కోడా ఎప్పుడూ మంచి బూట్ స్పేస్ కు ప్రాధాన్యత ఇస్తుంది.  స్కోడా స్లావియా కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఈ కారు 521 లీటర్ బూట్‌ ను కలిగి ఉంటుంది. ఎక్కువ బ్రీఫ్ కేసులను ఈజీగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ రోడ్ ధర మరికాస్త ఎక్కువగా ఉంటుంది.

⦿ హ్యుందాయ్ వెర్నా

Advertisement

హ్యుందాయ్ వెర్నా కూడా మంచి బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. ఈ కారు 528 లీటర్ బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది. ఇది లపు కాంపాక్ట్ SUVలు అందించే దాని కంటే ఎక్కువ స్పేస్ ను కలిగి ఉంటుంది. స్మూత్ రైడ్ క్వాలిటీ, అద్భుతమైన హైవే రైడింగ్ కు ఈ కారు అనుగుణంగా ఉంటుంది. అదే సమయంలో లగేజీ స్పేస్ లోనూ ఎలాంటి రాజీ లేకుండా ఉంటుంది. ఈ కారు ధర రూ.  10.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ MG హెక్టర్

ఈ కారు సూపర్ బోల్డ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. విశాలమైన క్యాబిన్ ను కలిగి ఉంటుంది. అదే సమయంలో 588 లీటర్ బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది. ఇది పెద్ద కుటుంబాలకు, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 11.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ టాటా సియెర్రా

Advertisement

టాటా సియెర్రా కూడా పెద్ద బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. ఈ కారు 622 లీటర్ బూట్ స్థలాన్నికలిగి ఉంటుంది. టాటా మోటార్స్ మంచి స్పేస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇది రోడ్ ట్రిప్‌లు, విమానాశ్రయ ప్రయాణాలు, కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉంటుంది.  దీని ధర సుమారు రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Read Also: టాటా పంచ్ vs టాటా నెక్సాన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

⦿ వోక్స్‌ వ్యాగన్ వర్టస్

వోక్స్‌ వ్యాగన్ వర్టస్ మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరయెన్స్ ను అందిస్తుంది. ఇది 521 లీటర్ బూట్‌ స్పేస్ ను కలిగి ఉంటుంది.  ప్రీమియం సెడాన్ అనుభవాన్ని అందిస్తూనే, లగేజీకి తగినంత స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు దాదాపు రూ. 11 లక్షల నుండి  ప్రారంభం అవుతుంది.

Read Also:  కొత్త రెనాల్ట్ డస్టర్ వచ్చేస్తోంది, బాబోయ్ ఇన్ని ఫీచర్లు ఉన్నాయా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×