E-Paper
Advertisement

Maruti Cars Offers : మారుతి కార్లపై రూ.1.3 లక్షల తగ్గింపు, ఎప్పటి వరకు అంటే?

Maruti Cars Offers : మారుతి కార్లపై రూ.1.3 లక్షల తగ్గింపు, ఎప్పటి వరకు అంటే?
Advertisement

మారుతి సుజుకి కూడా జనవరి 2026లో తన కార్ల మీద భారీగా తగ్గింపు అందిస్తుంది. ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, XL6, జిమ్నీ, ఇన్విక్టోతో సహా మొత్తం ప్రీమియం లైనప్‌పై డిస్కౌంట్లు, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.  కస్టమర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్,స్క్రాపేజ్ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఇస్తుంది. వేరియంట్, ప్యూయెల్ టైప్, డ్రైవ్‌ ట్రెయిన్‌ను బట్టి డిస్కౌంట్లు మారుతున్నాయి. పవర్ పుల్ హైబ్రిడ్, IMT ట్రిమ్‌ల మీద ఎక్కువ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో ఏ కారుపై ఎంత తగ్గింపు ఉందనే ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్విక్టోపై రూ. 1.30 లక్షల వరకు..

మారుతి ఇన్విక్టో ప్రీమియం MPV అన్ని వేరియంట్లు రూ. 1.30 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. వీటిలో రూ. లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 1.15 లక్షల స్క్రాపేజ్ బోనస్, రూ. 15,000 కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. ఇన్విక్టో  టయోటా ఇన్నోవా హైక్రాస్ తో పోటీ పడుతుంది. దీని ధర రూ. 24.97 లక్షల నుంచి రూ. 28.61 లక్షల వరకు ఉంటుంది.

గ్రాండ్ విటారాపై రూ. 1.25 లక్షల వరకు..

Advertisement

గ్రాండ్ విటారా ఈ నెలలో భారీగా డిస్కౌంట్లను పొందుతుంది. ముఖ్యంగా దాని పవర్ ఫుల్ హైబ్రిడ్ వేరియంట్లపై, మొత్తం ప్రయోజనాలు రూ. 1.25 లక్షల వరకు ఉంటాయి. మైల్డ్ హైబ్రిడ్ డెల్టా, జీటా, ఆల్ఫా ట్రిమ్‌లు రూ. 80,000 వరకు డిస్కౌంట్లను కలిగి ఉన్నాయి. CNG వెర్షన్‌లు రూ. 45,000 వరకు ప్రయోజనాలను పొందుతాయి. గ్రాండ్ విటారా..  హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, VW టైగన్, టాటా సియెర్రాతో పోటీ పడుతోంది.

బాలెనోపై రూ. 45,000 వరకు..

బాలెనోపై రూ. 45,000 వరకు  డిస్కౌంట్లు అందిస్తుంది మారుతి.  గరిష్ట డిస్కౌంట్ బాలెనో AMT వేరియంట్‌లపై ఉండగా, CNG మరియు పెట్రోల్-మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 40,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. బాలెనో ప్రస్తుతం రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షల మధ్య ధరను కలిగి ఉంది.

ఇగ్నిస్‌పై రూ.45,000 వరకు..

Advertisement

అత్యంత సరసమైన నెక్సా మోడల్, మారుతి ఇగ్నిస్ రూ.45,000 వరకు డిస్కౌంట్ పొందుతోంది. దాని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్‌లపై రూ.40,000 వరకు ప్రయోజనాలను పొందుతుంది. దీని ధర రూ.5.35 లక్షల నుంచి రూ.7.42 లక్షల వరకు ఉంటుంది.

సియాజ్పై రూ.40,000 వరకు..

ఈ  మిడ్‌సైజ్ సెడాన్ అన్ని వేరియంట్‌లపై రూ.40,000 వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సియాజ్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌ వ్యాగన్ వర్టస్‌ తో పోటీ పడుతోంది.

XL6పై రూ. 35,000 వరకు..

XL6 పెట్రోల్, CNG వేరియంట్లు  రూ. 35,000 వరకు డిస్కౌంట్లు పొందుతున్నాయి. రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 25,000 స్క్రాపేజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. 6 సీట్ల MPV అయిన XL6, మారుతి ఎర్టిగా ప్రీమియం వెర్షన్. దీని ధర రూ. 11.52 లక్షల నుంచి రూ. 14.32 లక్షల మధ్య ఉంటుంది.

ఇక ఇతర మోడల్స్ విషయానికి వస్తే మారుతి సుజుకి ఫ్రాంక్స్ పై రూ. 30,000, జిమ్నీపై రూ. 25,000 వరకు తగ్గింపు అందిస్తుంది.

Read Also: హ్యుందాయ్ జనవరి డిస్కౌంట్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×