E-Paper
Advertisement

Maruti e-vitara Car: మారుతి సుజుకి ఈ-విటారా వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Maruti e-vitara Car: మారుతి సుజుకి ఈ-విటారా వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Maruti Suzuki e-Vitara: ఆటో దిగ్గజం మారుతి సుజుకి తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ-విటారా(Maruti Suzuki e-Vitara). తాజాగా దేశీయ మార్కెట్లోకి అట్టహాసంగా లాంచ్ చేసింది. ఈ కారు మారుతి సుజుకి భారత్ లోనే తయారు చేసింది.  గుజరాత్ లోని హాన్సల్పూర్ ప్లాంట్‌ లో రెడీ అయ్యింది. ఇక్కడి నుంచి యూరప్, జపాన్ లాంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ విటారాను జూన్ 2025లో యూకేలో లాంచ్ చేశారు. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోనూ ప్రారంభించారు.

ఈ ఎలక్ట్రిక్ SUV మారుతి సుజుకి హార్టెక్ ఆర్కిటెక్చర్, ‘హార్టెక్ట్-ఇ’ ప్లాట్ ఫారమ్ మీద డెవలప్ చేసిన వెర్షన్. ఇది 61-kWh, 49-kWh బ్యాటరీ ప్యాక్స్ లో అందుబాటులోకి వస్తుంది. ఇది ఫ్లాట్ ఫ్లోర్,  రీన్ఫోర్స్ డ్ హై వోల్టేజ్ సేఫ్టీ స్ట్రక్చర్, తేలికైన నిర్మాణం, డ్యూయల్ మోటార్ లే అవుట్ కోసం రెండు ఇ యాక్సిల్స్‌ ను ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఈ-విటారా

Advertisement

⦿ 49 kWh బ్యాటరీ ప్యాక్: ఇది 142 hp (106 kW) పవర్ ను కలిగి ఉంటుంది. 192.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఛార్జ్ తో 450 కి.మీ రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 160 కిలో మీటర్లు ఉంటుంది. 9.5 సెకన్లలో 0-100 కి. మీ వేగాన్ని అందుకుంటుంది.

⦿ 61 kWh బ్యాటరీ ప్యాక్: ఇది 172 hp (128 kW) పవర్ ను కలిగి ఉంటుంది. 192.5 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఛార్జ్ తో 543 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 160 కి.మీని కలిగి ఉంటుంది.  8.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Advertisement

⦿ ఈ-విటారా  ఫీచర్స్ (Features): డ్యూయల్ డిజిటల్ డిస్‌ ప్లే లు, ఇన్ఫోటైన్‌మెంట్ + ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌ లెస్ చార్జర్, ఇన్ఫినిటీ బై హార్మన్ సౌండ్ సిస్టమ్, సుజుకి కనెక్టెడ్ కార్ టెక్, V2X, V2L (వెహికల్-టు-ఎవరీథింగ్) ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ ఈ-విటారా సేఫ్టీ (Safety): ఈ కారు 7 ఎయిర్‌ బ్యాగ్స్ కలిగి ఉంటుంది. ABS with EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ తో వస్తుంది.

⦿ ఈ-విటారా  చార్జింగ్ (Charging): హోమ్ AC చార్జింగ్, ఫాస్ట్ DC చార్జింగ్, పోర్టబుల్ చార్జర్, మారుతి సుజుకి యాప్ ద్వారా చార్జింగ్ స్టేషన్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. .

⦿ ఈ-విటారా కలర్ ఆప్షన్లు (Colors): 11 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఆప్యులెంట్ రెడ్ సహా 11 రంగులను కలిగి ఉంటుంది. డ్యూయల్-టోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

⦿  ఈ-విటారా ధర: భారతదేశంలో ఈ కారు ధర రూ.17 లక్షల నుంచి రూ. 22.50 లక్షల వరకు ఉండవచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వేరియంట్లు (Delta, Zeta, Alpha), బ్యాటరీ సైజ్ ఆధారంగా మారుతుంది. దీని ధర త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది.

ఈ-విటారా వేరియంట్లు (Variants)

Delta: బేసిక్ మోడల్, 49 kWh బ్యాటరీ.

Zeta: మిడ్-స్పెక్, అదనపు ఫీచర్లు.

Alpha: టాప్ మోడల్, 61 kWh బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లు ఉంటాయి.

ఈ-విటారా డిజైన్ బట్‌చ్ (rugged) స్టైల్‌ లో ఉంటుంది, డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ తో వస్తుంది. ఇది ఫ్యామిలీ SUVగా బాగా సరిపోతుంది.

పోటీ వేటితో అంటే?

SUV విభాగంలో అందుబాటులోకి వస్తున్న ఈ కారు, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, MG ZS EVకి గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఇది ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్ విభాగంలో మారుతి సుజుకి మైల్ స్టోన్ గా నిలువబోతోంది.

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×