Actor Dileep Rape Case: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ (Dileep )గతం ఎనిమిది సంవత్సరాలుగా అత్యాచార కేసులో దోషిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో భాగంగా నటుడు దిలీప్ కు పెద్ద ఊరట లభించింది. ఈ అత్యాచార కేసులో ఈయనని నిర్దోషిగా భావిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈయనకు ఊరట లభించిందని చెప్పాలి. ఫిబ్రవరి 17 2017 వ సంవత్సరంలో స్టార్ హీరోయిన్ పై కారులో అత్యాచారం జరిగింది అంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగాను పలువురి పై కేసులో నమోదు అయ్యాయి. ఇలా తనపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలను చిత్రీకరించి తనకు డబ్బులు ఇవ్వాలి అంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా నటి పలువురిపై కేసు నమోదు చేశారు.
ఇక ఈ కేసులో నటుడు దిలీప్ పై ఎనిమిదవ నిందితుడిగా కేసు నమోదు చేయబడినది. ఈ కేసు విషయంలో తాజాగా తమిళనాడులో ఎర్నాకులం జిల్లా కోర్టు ఈయనని నిర్దోషిగా తీర్పును ఇవ్వడంతో ఈ కేసు నుంచి నటుడు దిలీప్ పూర్తిగా బయటపడ్డారని చెప్పాలి. సినీ దర్శకులు బాలచందర్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఈయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులపాటు విచారణ జరిపిన అనంతరం కోర్టు దిలీప్ ను నిర్దోషిగా భావించి ఉత్తర్వులు వెల్లడించారు.విచారణలో ఉన్న 10 మంది నిందితులపై కోర్టు తీర్పు వెల్లడించింది.
తెలుగు తమిళ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఒక స్టార్ హీరోయిన్ పట్ల 2017 ఫిబ్రవరి 17 రాత్రి కిడ్నాప్ ప్రయత్నాలు చేశారని, అత్యాచారం కూడా చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా నటుడు దిలీప్ పేరును కూడా పొందుపరచడంతో ఈయనని జూలై 10, 2017న దిలీప్‌ను అరెస్టు చేశారు. అక్టోబర్ 3, 2017న దిలీప్‌కు బెయిల్ మంజూరు చేసింది. అప్పటినుంచి ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది.2019లో, దిలీప్ సీబీఐ దర్యాప్తు కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు, కానీ ఆ పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టి వేసింది. 2019లో, సుప్రీంకోర్టు ఆరు నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
నిర్దోషిగా నటుడు దిలీప్…
ఈ కేసులో భాగంగా నిందితులతో పాటు ప్రాసిక్యూషన్ వారు తరచూ కోర్టులో పిటిషన్లను దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ ఆలస్యం అవుతూ వచ్చింది.చివరికి విచారణ జనవరి 2020లో మాత్రమే ప్రారంభమైంది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా కోవిడ్-19 రావడంతో ఈ కేసు విచారణ పూర్తిగా వాయిదా వేశారు. ఇలా ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ నేడు మరోసారి విచారణకు రావడంతో ఈ విచారణలో భాగంగా దిలీప్ కుమార్ కు పూర్తిగా ఉపశమనం లభించింది. ఇలా నటిపై అత్యాచార కేసులో భాగంగా ఈయన నిర్దోషి అని రావడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Brahmanandam: బ్రహ్మానందంకు జీవితకాల పురస్కారం..జీవిత వ్యర్థం అంటూ!