E-Paper
Advertisement

MG Majestor: కళ్లు చెదిరి లుక్, అదిరిపోయే ఇంజిన్ పర్ఫార్మెన్స్.. మార్కెట్ లోకి ఎంజీ మెజెస్టర్‌!

MG Majestor: కళ్లు చెదిరి లుక్, అదిరిపోయే ఇంజిన్ పర్ఫార్మెన్స్.. మార్కెట్ లోకి ఎంజీ మెజెస్టర్‌!
Advertisement

MG Majestor  Launch: ప్రముఖ ఆటో మోబైల్ కంపెనీ ఎంజీ నుంచి మరో ప్లాగ్ షిప్ SUV విడుదలకానుంది. ఫిబ్రవరి 12, 2026న ఈ కారు అట్టహాసంగా లాంచ్ కానుంది. మెజెస్టర్‌ SUVని తొలిసారి ఆటో ఎక్స్‌ పో 2025లో కంపెనీ ప్రదర్శించింది. చాలా రోజులుగా ఈ కారును ఇండియన్ రోడ్స్ కంపెనీ మీద టెస్ట్ చేస్తోంది. రేపు విడుదల కాబోతోంది.

MG Majestor డిజైన్ ఎలా ఉందంటే?

ఎంజీ మెజెస్టర్‌ Maxus D90 SUV మాదిరిగా ఆకట్టుకుంటుంది. ది గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్స్‌ తో కూడిన పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంది. గ్రిల్ పక్కన LED హెడ్‌ లైట్స్ ఉన్నాయి. అందమైన  LED డేటైమ్ రన్నింగ్ లాంప్‌లు ఉన్నాయి. ముందు బంపర్ దిగువ భాగం మధ్యలో నల్లటి క్లాడింగ్ ఉంది. వీల్ ఆర్చ్‌ లు, మెజెస్టర్ ప్రొఫైల్ కింది భాగంలో బాడీ క్లాడింగ్ కొనసాగుతుంది. SUV గ్లోస్టర్‌ లా కనిపించే డ్యూయల్ టోన్ 19 ఇంచుల అల్లాయ్ వీల్స్‌ ను కలిగి ఉంటుంది. ఇందులో బ్లాక్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, కనెక్ట్ చేయబడిన LED టెయిల్ లైట్లు, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ తో కూడిన బ్లాక్ బంపర్, రెండు వైపులా ఎగ్జాస్ట్ టిప్స్ ఉంటాయి.

MG మెజెస్టర్ ఫీచర్లు

Advertisement

ఆటో ఎక్స్‌ పోలో మెజెస్టర్ క్యాబిన్ వివరాలు బయటకు రానప్పటికీ, ఇది Maxus D90 లాగా కనిపించే టెస్ట్ మ్యూల్‌ లో కనిపించింది. ఇండియా స్పెక్ మెజెస్టర్ 12.3 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్, అదే పరిమాణ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, కాలమ్ మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్ స్టాంక్‌ తో 3 స్పోక్ స్టీరింగ్ వీల్‌ ను పొందే అవకాశం ఉంది.  మెజెస్టర్‌ను గ్లోస్టర్ కు పైస్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 వరుసల SUV కంటే ఇది మరికొన్ని ఫీచర్లను పొందే అవకాశం ఉంది. గ్లోస్టర్ పనోరమిక్ సన్‌ రూఫ్, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, 12 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌ గేట్, హీటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లను పొందుతుంది. డ్రైవర్ సీటు కోసం అదనపు మసాజ్ ఫంక్షన్‌ ఉంటుంది.

MG మెజెస్టర్ పవర్‌ ట్రెయిన్

MG మెజెస్టర్ 2-లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 216hp పవర్, 479Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో యాడ్ చేయబడి ఉంటుంది. ఇది అన్ని వీల్స్ కు పవర్ ను పంపుతుంది. చైనా స్పెక్ మాక్సస్ D90లోని అదే ఇంజిన్, అదే పవర్ ను పొందుతుంది.

MG మెజెస్టర్ ధర గురించి..

Advertisement

MG మెజెస్టర్ ధర గ్లోస్టర్ కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీని ధర రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు విడుదల అయ్యాక ఇండియాలో టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్‌ తో పోటీ పడనుంది.

Read Also: మారుతి To టాటా.. ఫిబ్రవరి ట్రెండింగ్ కార్లు ఇవే!

Related News

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×