E-Paper
Advertisement

Best Mileage Cars Petrol: సెలెరియో TO నెక్సాన్.. సూపర్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!

Best Mileage Cars Petrol: సెలెరియో TO  నెక్సాన్.. సూపర్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!
Advertisement

Best Mileage Cars Petrol In India 2026: కారు కొనే ముందు చాలా మంది మంచి లుక్ ఉందా?  చక్కటి ఫీచర్లతో వస్తుందా? అని చూడటంతో పాటు ఎక్కువ మైలేజ్ ఏ కార్లు ఇస్తాయి? అని ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల్లో తక్కువ ఖర్చు అయ్యే కార్ల కొనుగోలుకే ఎక్కువ మొగ్గు చూప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్ లోమంచి మైలేజ్ అందించే కార్లు ఏవి? అవి లీటర్ కు ఎంత మైలేజ్ ఇస్తాయి? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి సెలెరియో- 26.68 కి.మీ

ప్రస్తుతం దేశీ మార్కెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లలో మారుతి సుజుకి సెలెరియో ఒకటి. గత రెండేళ్లుగా ఈ కారు మంచి సేల్స్ కనబరుస్తుంది. అదే సమయంలో ఈజీ హ్యాండ్లింగ్, కాంపాక్ట్ డిజైన్, సౌకర్యవంతమైన రైడ్ కారుకు ప్లస్ పాయింట్స్. ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. ఈ కారు లీటర్ కు 26.68 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ. 5.36 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ మారుతి సుజుకి ఆల్టో K10- 24.39 కి.మీ

Advertisement

ఈ కారు ఎంట్రీ లెవల్ కార్ సెగ్మెంట్‌లో ముందంజలో ఉంటుంది. ఈ కారు ఎక్కువగా అమ్ముడు పోవడానికి కారణం మైలేజ్. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 24.39 మైలేజ్ ఇస్తుంది. 2 ఎయిర్‌ బ్యాగ్‌లు, సీటింగ్ కెపాసిటీ 5 ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో– 25.3 కి.మీ

2019లో విడుదల అయిన మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో టాల్ బాయ్ డిజైన్‌ తో బాగా ఆకట్టకుంటుంది. మారుతి నుంచి మైక్రో SUVగా మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ప్రైమరీ హ్యాచ్‌ బ్యాక్ అయిన ఈ కారు, దాని మైలేజ్ కారణంగా దేశంలో బెస్ట్ కార్లలో ఒకటిగా గుర్తింపు తచ్చుకుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉన్న మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో లీటర్ పెట్రోల్ కు ఏకంగా 25.3 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది.ఈ కారణంగా అత్యంత బెస్ట్ కార్లలో ఒకటిగా మిగిలిపోయింది. అంతేకాకుండా, ఇది AMT సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. దాని మైలేజీకి మించి, ఎస్ ప్రెస్సో  కాంపాక్ట్ కొలతలు,మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. SUV లాంటి ఫీల్ ను కలిగిస్తుంది. ఈ కారు కీ స్పెసిఫికేషన్లు చూస్తే, 1.0 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT (ఆటోమేటిక్) ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది. రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. సీటింగ్ సామర్థ్యం 5.  దీని ధర రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Advertisement

Read Also:  ఇక ఈవీ కార్లకు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హ్యుందాయ్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×