E-Paper
Advertisement

Naa Anveshana: ట్రావెలింగ్ ఆపేస్తున్నా.. ఇకపై మీకోసం కాదు నాకోసం!

Naa Anveshana: ట్రావెలింగ్ ఆపేస్తున్నా.. ఇకపై మీకోసం కాదు నాకోసం!
Advertisement

Naa Anveshana: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ గా పేరు దక్కించుకున్న నా అన్వేషణ అన్వేష్ దేశాలు చుట్టేస్తూ.. అక్కడ విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ వంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా 70 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈయన.. ఇటీవల తనకు సంబంధంలేని విషయాలలో తలదూర్చి భారీగా ఫాలోవర్స్ ను కోల్పోవడమే కాకుండా పోలీస్ కేస్ అంటూ ఇబ్బందుల్లో పడ్డారు.

అయితే అలాంటి అన్వేష్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మీకోసం కాదు నాకోసం అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ట్రావెల్లర్ గా పేరు దక్కించుకున్న అన్వేష్ తాజాగా మాట్లాడుతూ.. ఇకపై నేను ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే 130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. ప్రస్తుతం నా దగ్గర 8కోట్లు ఉన్నాయి. వీటితో మీకోసం కాదు ఇకపై నాకోసం మిగిలిన దేశాలు తిరుగుతాను. ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యలపై పోరాడుతాను” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం అన్వేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచం తిరగడమే పనిగా పెట్టుకున్నాడేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

Advertisement

ALSO READ:Manchu Family: మంచు ఇంట మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఉద్యోగులకు బట్టలు, డబ్బు పంపిణీ.

నోటిదూలతో ఫాలోవర్స్ ను కోల్పోయిన అన్వేష్..

ప్రముఖ నటుడు శివాజీ గత ఏడాది డిసెంబర్లో హీరోయిన్స్ వస్త్రధారణ పై కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈయన కామెంట్లకు చాలామంది మద్దతుగా నిలిచారు. కానీ అన్వేష్ మాత్రం ఈ విషయంపై తలదూర్చి ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాదు గరికపాటిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన గరికపాటి టీం ఆయనపై విమర్శలు గుప్పిస్తూ చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఇండియాని కూడా దూషిస్తూ కామెంట్లు చేయడంతో చాలామంది ఈయనపై విమర్శలు గుప్పించారు. పైగా 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ అన్ ఫాలో కొట్టారు. అయినా కూడా ఇతడి నోటి దూల ఆగడం లేదు. దీంతో రంగంలోకి దిగిన కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసు కూడా ఫైల్ చేయించింది.

అన్వేష్ అరెస్టుకి సర్వం సిద్ధం..

Advertisement

ఇకపోతే అన్వేష్ ఇండియాలోకి అడుగుపెట్టగానే అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా అతడి వివాదాస్పద వీడియోలు నెటిజన్ లకి కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇతడిని ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×