E-Paper
Advertisement

స్టైలిష్ లుక్, క్రేజీ ఫీచర్స్.. మారుతి బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది!

స్టైలిష్ లుక్, క్రేజీ ఫీచర్స్.. మారుతి బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది!
Advertisement

Maruti Brezza Facelift Coming Soon: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్ త్వరలో మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. పెద్దగా డిజైన్ మార్పులు లేకపోయినా, కొత్త ఫీచర్లు, న్యూ టెక్నాలజీపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో పోటీ మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఫీచర్లు, సౌకర్యాలతో పాటు బ్రాండ్ వాల్యూను చూస్తున్నారు. అందుకే, ఈ ఫేస్‌ లిఫ్ట్ మోడల్‌ లో కొన్ని ముఖ్యమైన అప్‌ గ్రేడ్స్ చేస్తోంది కంపెనీ.

డిజైన్ గురించి..

డిజైన్ విషయానికి వస్తే, బ్రెజ్జా ప్రస్తుత లుక్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే, ముందు, వెనుక బంపర్లలో చిన్న చిన్న మార్పులు, కొత్త లైటింగ్ ఎలిమెంట్స్ లాంటి అప్‌ డేట్లు ఉండే అవకాశం ఉంది. మొత్తం సైజు మారకపోవడంతో, ప్రస్తుతం ఉన్న మోడల్‌ ను ఇష్టపడే వారికి ఇది పెద్దగా కొత్తగా అనిపంచకపోవచ్చు. కానీ, మారుతి సక్సెస్‌ ఫుల్ డిజైన్‌ ను అలాగే కొనసాగిస్తూ,  చిన్న మార్పులతోనే కొత్త మోడల్‌ ను తీసుకురావాలని చూస్తోంది.

ఇంటీరియర్ లో కీలక మార్పులు

Advertisement

ఇంటీరియర్‌లో మాత్రం ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పెద్ద అప్‌ గ్రేడ్‌ గా మారనుంది. ప్రస్తుత స్క్రీన్ స్థానంలో 10.25 అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్ వచ్చే అవకాశం ఉంది. అదనంగా, 360 డిగ్రీ కెమెరా కూడా ఇవ్వొచ్చని తెలుస్తోంది. పార్కింగ్ సమయంలో, ముఖ్యంగా ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ చేసే వారికి చాలా ఉపయోగపడుతుంది.

ఇంజిన్ గురించి..

ఇంజిన్ విషయంలో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కొనసాగుతుందని అంచనా.  సుమారు 103 PS పవర్, 137 Nm టార్క్ ఇస్తుంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ అలాగే ఉంటాయి. కొత్త హైబ్రిడ్, ఇతర ఇంజిన్ అప్‌ డేట్లపై ఇప్పటి వరకు పెద్దగా క్లారిటీ లేదు.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల పరంగా ఈ SUV మరింత అప్ డేట్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద టచ్‌ స్క్రీన్, 360 కెమెరాతో పాటు వైర్‌ లెస్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ లాంటి ఫీచర్లు కొనసాగుతాయి. భద్రత విషయంలో మల్టిపుల్ ఎయిర్‌ బ్యాగ్స్, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, ADAS లాంటి అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు రాకపోవచ్చని తెలుస్తుంది.

ధర ఎంత ఉంటుందంటే?

ధర విషయానికి వస్తే, ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఈ SUVని అదే కాంపాక్ట్ సెగ్మెంట్‌లో పోటీగా నిలబెట్టేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. 2026లో ఈ మోడల్ విడుదల కావొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: టైర్ పగిలినా నో టెన్షన్.. ఈ కారు మూడు చక్రాలతో పరుగులు తీస్తుంది!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×