E-Paper
Advertisement

టైర్ పగిలినా నో టెన్షన్.. ఈ కారు మూడు చక్రాలతో పరుగులు తీస్తుంది!

టైర్ పగిలినా నో టెన్షన్.. ఈ కారు మూడు చక్రాలతో పరుగులు తీస్తుంది!
Advertisement

YangWang U9 Hypercar: కార్ల తయారీ సంస్థలు అబ్బుర పరిచే టెక్నాలజీని ఉపయోగిస్తాయి. అందులో భాగంగానే చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తన లగ్జరీ బ్రాండ్ యాంగ్ వాంగ్ కింద ఒక అద్భుతమైన  ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. యాంగ్ వాంగ్ U9 పేరుతో తయారవుతున్న ఈ కారు క్రేజీ టెక్నాలజీతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ కార్లతో పోలిస్తే, ఇది పూర్తిగా భిన్నమైన సాంకేతికతతో అందుబాటులోకి రాబోతోంది.

ఆకట్టుకునే DiSus-X హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టమ్‌

ఈ కారులో అత్యాధునిక  DiSus-X హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టమ్‌ ను ఉపయోగించారు. ఈ సిస్టమ్ ప్రత్యేకత ఏమిటంటే, రోడ్డుపై ఎలాంటి పరిస్థితుల్లోనైనా కారు ఎదుర్కొంటుంది. మలుపులు, గుంతలు, అకస్మాత్తుగా ఎదురయ్యే పరిస్థితుల్లో కూడా కారు బ్యాలెన్స్ కోల్పోకుండా స్మూత్‌ గా నడుస్తుంది. సాధారణంగా కార్లలో ఉండే సస్పెన్షన్ సిస్టమ్‌ తో పోలిస్తే, ఇది మరింత అడ్వాన్స్ డ్ గా ఉంటుంది.

ఒక వీల్ పని చేయకపోయినా నో ప్రాబ్లం

Advertisement

ఈ కారులో మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏమిటంటే, ఒక వీల్ దెబ్బతిన్నా కారు ఆగిపోదు. ప్రమాదవశాత్తూ ఒక టైర్ పాడయితే, మిగిలిన మూడు చక్రాలపైనే కారు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఇందుకోసం అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ ను ఉపయోగించారు. ఇది కారు బరువును సమానంగా పంపిణీ చేస్తూ, డ్రైవర్‌ కు కంట్రోల్ కోల్పోకుండా సహాయపడుతుంది. ఈ ఫీచర్ అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Read Also: మీ టైర్ ఏజ్ ఎంత? సింపుల్ గా ఇలా తెలుసుకోండిలా!

జస్ట్ 2 సెకెన్లలో 100 కిలో మీటర్ల వేగం

Advertisement

యాంగ్‌ వాంగ్ U9 కారు హైపర్‌ కార్ రేంజ్ పనితీరు అందిస్తుంది. ఇందులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.  1100 బీహెచ్‌పీకి పైగా శక్తిని అందిస్తాయి. దీని వల్ల కారు అత్యంత వేగంగా స్పందిస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి కేవలం 2 సెకన్ల సమయం పడుతుంది. ఈ కారును అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందనుంది. ఈ కారులోని టెక్నాలజీ కేవలం వేగం, స్టైల్ కోసమే కాదు, భద్రతను కూడా అందిస్తుంది. ఒక చక్రం దెబ్బతిన్నా కూడా కారు కంట్రోల్‌లో ఉండటం వల్ల డ్రైవర్‌ కు అదనపు సేఫ్టీ లభిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీ సాధారణ కార్లలో కూడా అందుబాటులోకి రావచ్చు.  యాంగ్‌వాంగ్ U9 కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు కాదు, ఆధునిక ఇంజనీరింగ్‌కు ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. వేగం, పవర్, సేఫ్టీ కలిపి ఈ కారును ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో సరికొత్త దిశను చూపించే మోడల్‌ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్పై షాట్స్ లీక్, వారెవ్వా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×