E-Paper
Advertisement

Nissan Solar Car: అదిరిపోయే నిస్సాన్ కారు, ఇది ఏకంగా ఎండ నుంచే ఛార్జింగ్ అవుతుంది!

Nissan Solar Car: అదిరిపోయే నిస్సాన్ కారు, ఇది ఏకంగా ఎండ నుంచే ఛార్జింగ్ అవుతుంది!
Advertisement

Nissan Reveals Solar-Powered Ariya EV Concept: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఈవీలను మరింత ఆధునికంగా తయారు చేసేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ పరిధిని అందించే ఈవీల తయారీపై ఫోకస్ పెట్టాయి. EV ఆటోమేకర్లు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్ కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. ఎండ నుంచి కారు ఛార్జింగ్ అయ్యేలా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. సౌరశక్తితో నడిచే EV కాన్సెప్ట్‌ ను తాజాగా ప్రదర్శించింది. నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు అరియా మీద ప్రయోగాలు చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థను అరియాను ఉపయోగించి డెవలప్ చేసింది.

సౌరశక్తితో నడిచే అరియా కాన్సెప్ట్‌

సౌరశక్తితో నడిచే అరియా కాన్సెప్ట్‌ ను దుబాయ్‌లోని నిస్సాన్ అడ్వాన్స్‌డ్ ప్రొడక్ట్ ప్లానింగ్ టీమ్ తో పాటు  బార్సిలోనాలోని పవర్‌ ట్రెయిన్ ప్లానింగ్ టీమ్ లోని ఇంజనీర్లు కొన్ని ముఖ్యమైన మార్పులతో డెవలప్ చేశారు. వీటిలో అధిక సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ కారు బానెట్, రూఫ్,  వెనుక విండోలో కలిసిపోయేలా ఫిక్స్ చేశారు. ఈ ప్యానెల్స్ సూర్య కాంతిని DC పవర్‌ గా మారుస్తాయి. ఆ విద్యుత్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఫలితంగా ఈ కారు అదనపు రేంజ్ ను పొందుతుంది.

సూర్యరశ్మితో అదనపు ప్రయాణం

Advertisement

నిస్సాన్ తాజాగా అరియా కాన్సెప్ట్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. సౌరశక్తితో నడిచే ఆరియా కాన్సెప్ట్ ఎక్కువగా ఎండ ఉన్న రోజు కారు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇది కారు బ్యాటరీ ఇచ్చే పరిధిని కాకుండా 23 కి.మీ వరకు అదనపు పరిధిని అందిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. వినియోగాన్ని బట్టి ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీని 65 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ప్రయాణ సమయంలో, ఎండలో పార్క్ చేయడం వల్ల కారు ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అవుతుంది. ఫలితంగా ఛార్జింగ్ ఖర్చుల నుంచి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.

500 కిమీతో పాటు అదనపు ప్రయాణం

నిజానికి నిస్సాన్ కంపెనీకి చెందిన ఆరియా అనేది ఎలక్ట్రిక్ SUV. ఇది ఒక ఫుల్ ఛార్జ్ మీద 500 కి.మీ వరకు ప్రయాణించే  రెండు బ్యాటరీ ప్యాక్‌ ల ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఇది AWDతో కూడా వస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న అరియా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ త్వరలోనే కంప్లీట్ గా అందుబాటులోకి రానుంది. నిస్సాన్ కంపెనీ నుంచి విడుదలయ్యే అన్ని ఎలక్ట్రిక్ కార్లలో ఈ వ్యవస్థను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం ప్రయోగాలను ముమ్మరం చేసింది. మరికొద్ది నెలల్లోనే ఈ విధానం పూర్తి అమలు కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisement

Read Also: ఓకేసారి 5 కార్లు లాంచ్.. వోక్స్‌ వ్యాగన్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×