E-Paper
Advertisement

Volkswagen New Cars Launch 2026: ఓకేసారి 5 కార్లు లాంచ్.. వోక్స్‌ వ్యాగన్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Volkswagen New Cars Launch 2026: ఓకేసారి 5 కార్లు లాంచ్.. వోక్స్‌ వ్యాగన్  స్పీడ్ మామూలుగా లేదుగా!
Advertisement

వోక్స్‌ వ్యాగన్ ఇండియా 2026 తన సత్తా చాటుకునేందుకు అదిరిపోయే ప్లాన్స్ చేస్తోంది. ఈ జర్మన్ ఆటోమేకర్ ఈ ఏడాది పొడవునా ఏకంగా 5 కీలక SUVలు, సెడాన్లు, హ్యాచ్‌ బ్యాక్‌ లను విడుదల చేయాలని భావిస్తోంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్

ఈ ఏడాది తొలి మోడల్ గా వోక్స్‌ వ్యాగన్ టేరాన్ R-లైన్ ను లాంచ్ చేయనుంది. మార్చిలో ఈ కారు లాంచ్ కానుంది. దేశంలో వోక్స్‌ వ్యాగన్ ఫ్లాగ్‌ షిప్ SUV అయిన టేరాన్ R-లైన్ ఏడు సీట్ల లే అవుట్‌ ను కలిగి ఉంటుంది. 4,770mm పొడవుతో బ్రాండ్ లో అతిపెద్ద SUVలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ నుంచి పవర్ ను పొందుతుంది. ఇది 7 స్పీడ్ DSG ట్రాన్స్‌ మిషన్, అందుబాటులో ఉన్న ఆల్ వీల్ డ్రైవ్ తో యాడ్ చేసి ఉంటుంది. ఇది 204bhp పవర్, 320Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా కోడియాక్, ఎంజి గ్లోస్టర్, జీప్ మెరిడియన్‌ కు పోటీగా, రూ. 45 లక్షల అంచనా ధరతో రానున్నట్లు తెలుస్తోంది.

⦿ వోక్స్‌ వ్యాగన్ టెయ్రాన్

Advertisement

ఈ కారును 2026 సెకెండాఫ్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది.  ఇందులో 150bhp పవర్, 250Nm టార్క్ ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 7-స్పీడ్ DSGతో యాడ్ చేయబడి ఉంటుంది. ఈ వేరియంట్ ప్రీమియం మూడు వరుసల SUV విభాగానికి ఎంట్రీ పాయింట్‌ గా ఉంటుంది.

⦿ వోక్స్‌ వ్యాగన్ టైగన్ ఫేస్‌ లిఫ్ట్

టైగన్ ఫేస్‌ లిఫ్ట్ 2026 Q2లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. రిఫ్రెష్ చేయబడిన సాఫ్ట్ టచ్ ఎలిమెంట్స్,  పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి ఫీచర్లు అనదంగా రానున్నాయి. ఇటీవల ప్రారంభించబడిన స్కోడా కుషాక్‌లో కనిపించే విధంగా, వోక్స్‌ వ్యాగన్ 1.0-లీటర్ TSI ఇంజిన్‌ను కొత్త 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో  అప్‌ గ్రేడ్ చేసే అవకాశం కనిపిస్తుంది.

⦿ వోక్స్‌ వ్యాగన్ వర్టస్ ఫేస్‌ లిఫ్ట్

Advertisement

వర్టస్ 2026 మిడ్ ఇయర్ లో రిఫ్రెష్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో అప్ డేట్ చేయబడిన ముందు, వెనుక స్టైలింగ్, కొత్త అల్లాయ్ డిజైన్స్, అదనపు టెక్ ఆఫర్లు ఉంటాయి. వీటిలో ADAS కూడా ఉంటుందని భావిస్తున్నారు. 1.5-లీటర్ TSI పెట్రోల్ 7 స్పీడ్ DSG లేదంటే 6 స్పీడ్ మాన్యువల్‌ తో జతచేయబడి ఉండే, 1.0 లీటర్ TSI ఆటోమేటిక్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అప్‌ డేట్‌ ను కలిగి ఉండవచ్చు. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 19 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

⦿ వోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్ GTI సెకెండ్ బ్యాచ్

ఈ ఏడాది చివరిలో, వోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్ GTI సెకెండ్ బ్యాచ్‌ ను ఇండియాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్‌తో కూడిన 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో నడిచే ఈ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌ బ్యాక్ బాగా పాపులర్ అయ్యింది.  మొదటి 150 యూనిట్లు ధరలు ప్రకటించక ముందే ప్రీ బుకింగ్ పూర్తి కావడం విశేషం.

Read Also: అద్దెకు లగ్జరీ వ్యాన్లు.. మీకూ రెంట్ కు కావాలా?

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×