E-Paper
Advertisement

సాధారణ ఎయిర్ కలిగిన కార్ టైర్లలో నైట్రోజన్ గాలి కొట్టించవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది?

సాధారణ ఎయిర్ కలిగిన కార్ టైర్లలో నైట్రోజన్ గాలి కొట్టించవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది?
Advertisement

Nitrogen or Regular Air: టైర్లలో ఎయిర్ ప్రెజర్ సరిగా ఉంటేనే, వాహనం చక్కగా ప్రయాణిస్తుంది. అందుకే, చాలా మంది నిర్ణీత పరిధిలో గాలి ఉండేలా చూసుకుంటారు. అయితే, ఇప్పుడు చాలా మంది సాధారణ గాలి బదులు నైట్రోజన్ వాడుతున్నారు. పెట్రోల్ బంక్‌ల దగ్గర కూడా నైట్రోజన్ ఫిల్లింగ్  బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మందికి ఓ డౌట్ వస్తుంది. నిజంగా టైర్లలో నార్మల్ ఎయిర్ నింపించడం మంచిదా? లేక, నైట్రోజన్ మంచిదా? అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ సమ్మర్ లో ఏది వాడితే బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ టైర్లలోనైనా నైట్రోజన్ నింపవచ్చా?

సాధారణంగా మనం టైర్లలో నింపే గాలిలో ఎక్కువ భాగం కూడా నైట్రోజనే ఉంటుంది. కానీ, అందులో ఆక్సిజన్, తేమ కలిసి ఉంటాయి. ప్రత్యేకంగా నింపే నైట్రోజన్ మాత్రం ఫ్యూర్ నైట్రోజన్ ఉంటుంది. ఇప్పటికే సాధారణ గాలి ఉన్న టైర్లలో నైట్రోజన్ నింపవచ్చా? అనే అనుమానం కలుగుతుంది. ఏ టైర్‌ కైనా నైట్రోజన్ నింపవచ్చు. టైర్లలో ఎలాంటి ప్రత్యేక మార్పులు అవసరం ఉండవు. గాలి బదులు నైట్రోజన్ గ్యాస్ మాత్రమే నిప్పుతారు.

నైట్రోజన్ నింపడం వల్ల కలిగే లాభాలేంటి?

Advertisement

నైట్రోజన్‌ను ఎక్కువ మంది ఇష్టపడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా టైర్ ప్రెజర్‌ ను ఎక్కువకాలం స్థిరంగా ఉంచుతుంది. సాధారణ గాలిలోని ఆక్సిజన్ చిన్న రంధ్రాల ద్వారా త్వరగా బయటకు లీక్ అవుతుంది. కానీ, నైట్రోజన్ అణువులు పెద్దవిగా ఉండటంతో అవి అంత త్వరగా బయటకు రావు. అందుకే టైర్‌ లో ఎయిర్ ప్రెజర్ ఎక్కువకాలం అలాగే ఉంటుంది.

సమ్మర్ లో ప్రమాదాల నివారణ

వేసవిలో హైవేపై ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు టైర్లు చాలా వేడెక్కుతాయి. సాధారణ గాలి వేడికి త్వరగా విస్తరిస్తుంది. దీంతో టైర్ ప్రెజర్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు టైర్ పేలేందుకు కూడా కారణం అవుతుంది. నైట్రోజన్ మాత్రం వేడి పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉంటుంది. అందుకే దీర్ఘ ప్రయాణాలు చేసే వాళ్లు నైట్రోజన్ ను నింపించుకునేందుకు ఇష్టపడుతారు.

తుప్పు సమస్య నుంచి పరిష్కారం

Advertisement

సాధారణ గాలిలో తేమ ఉంటుంది. ఈ తేమ వల్ల చాలా సంవత్సరాల తర్వాత టైర్ లోపలి రిమ్‌ తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. నైట్రోజన్‌ లో తేమ చాలా తక్కువగా ఉండటంతో ఈ సమస్య తగ్గుతుంది.

నైట్రోజన్ ఉందా? లేదా? అని ఎలా తెలుసుకోవాలి?

నైట్రోజన్‌ కు మారాలంటే టైర్‌ లో ఉన్న పాత గాలిని పూర్తిగా బయటకు తీస్తారు. తర్వాత ప్రత్యేక యంత్రంతో టైర్‌ ను శుభ్రపరిచి, స్వచ్ఛమైన నైట్రోజన్ నింపుతారు. సాధారణంగా నైట్రోజన్ టైర్లకు ఆకుపచ్చ రంగు వాల్వ్ క్యాప్స్ పెడతారు. అవి చూసి టైర్‌ లో నైట్రోజన్ ఉందని గుర్తించవచ్చు. నైట్రోజన్ ఉన్న టైర్‌లో తర్వాత సాధారణ గాలి నింపితే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, నైట్రోజన్ వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయి. అంటే, మళ్లీ సాధారణ గాలి టైర్‌లా మారిపోతుంది.

నైట్రోజన్ నింపినా ప్రెజర్ చెక్ చేయాల్సిందే!

నైట్రోజన్ ఉంటే టైర్ ప్రెజర్ చెక్ చేయాల్సిన అవసరం లేదని కొంతమంది భావిస్తారు. కానీ, నైట్రోజన్ కూడా కొంతకాలానికి తగ్గుతుంది. కాబట్టి నెలకు కనీసం ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేయడం చాలా ముఖ్యం. ఎక్కువగా సిటీలోనే తక్కువ దూరాలు ప్రయాణిస్తే సాధారణ గాలి సరిపోతుంది. కానీ, హైవేల మీద ఎక్కువగా తిరిగే వారు, ఎక్కువ వేడి ప్రాంతాల్లో ఉండే వారు నైట్రోజన్‌ నింపించుకోవడం మంచిది.

Read Also: ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ సేఫ్ గా ఉండాలంటే, ఈ తప్పులు అస్సలు చేయకండి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×