E-Paper
Advertisement

ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ సేఫ్ గా ఉండాలంటే, ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ సేఫ్ గా ఉండాలంటే, ఈ తప్పులు అస్సలు చేయకండి!
Advertisement

Car Care Tips: ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్  కార్లను వాడుతున్నారు. ట్రాఫిక్‌ లో డ్రైవింగ్ సులభంగా ఉండటం, క్లచ్ సమస్య లేకపోవడం వల్ల వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ చాలా సున్నితమైన వ్యవస్థ. చిన్న చిన్న పొరపాట్లు దీని పనితీరుపై పెద్ద ప్రభావం చూపుతాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్దమొత్తంలో ఖర్చులు తప్పవు. చాలా మంది తెలియక చేసే కొన్ని తప్పులు ట్రాన్స్‌ మిషన్ లైఫ్ టైమ్  తగ్గిస్తాయి. ఇంతకీ ఆ తప్పులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ట్రాన్స్‌ మిషన్ వేడెక్కడం

చాలామంది పట్టించుకోని విషయం ట్రాన్స్‌ మిషన్ వేడెక్కడం. ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ సాధారణంగా నిర్దిష్ట ఉష్ణోగ్రతలో పని చేయడానికి రూపొందించబడుతుంది. కానీ, ఎక్కువసేపు వేడి వాతావరణంలో డ్రైవింగ్ చేయడం, హైస్పీడ్‌ లో నడపడం వల్ల ఎక్కువ వేడికి గురవుతుంది. ఇలా జరిగితే ట్రాన్స్‌ మిషన్ ఫ్లూయిడ్ తన ప్రభావాన్ని కోల్పోయి లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. చివరకు గేర్లు, బేరింగ్‌ లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

⦿ తక్కువ ఫ్లూయిడ్‌ తో కారు నడపడం

Advertisement

తక్కువ ట్రాన్స్‌ మిషన్ ఫ్లూయిడ్‌ తో కారు నడపడం ప్రమాదకరం. ఈ ఫ్లూయిడ్ గేర్‌బాక్స్‌ ను చల్లగా ఉంచడంలో, లోపలి భాగాలకు కందెనలా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్లూయిడ్ స్థాయి తగ్గితే భాగాలు వేడెక్కి అరిగిపోతాయి. దీంతో గేర్ మార్పులు సరిగ్గా జరగకపోవచ్చు. అందుకే తరచూ ఫ్లూయిడ్ లెవెల్ ను తనిఖీ చేయడం అవసరం.

⦿ ఫ్లూయిడ్ మార్పులలో నిర్లక్ష్యం

చాలామంది ఫ్లూయిడ్ మార్పులను కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. పాత ఫ్లూయిడ్ ఎక్కువకాలం ఉపయోగిస్తే పనితీరును కోల్పోతుంది. ఫలితంగా ట్రాన్స్‌ మిషన్ లోపలి భాగాలు వేడి, ఘర్షణకు గురవుతాయి. గేర్లు స్లిప్ కావడం, షిఫ్ట్ ఆలస్యం కావడం, సీల్స్ పాడవడం లాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా కంపెనీ సూచించిన వ్యవధిలో ఫ్లూయిడ్ మార్చడం మంచిది.

⦿ వేరే రకం ట్రాన్స్‌ మిషన్ ఫ్లూయిడ్ వాడటం

Advertisement

ఇంకొంతమంది తప్పుగా వేరే రకం ట్రాన్స్‌ మిషన్ ఫ్లూయిడ్ ఉపయోగిస్తారు. ప్రతి కారు ట్రాన్స్‌ మిషన్‌కు ప్రత్యేక ఫ్లూయిడ్ ఉంటుంది. సరైనది కాకుండా వాడితే లోపలి క్లచ్‌లు, సీల్స్ దెబ్బతింటాయి. దీని వల్ల గేర్ మార్పులు సరిగా జరగకపోవచ్చు.  అందుకే, ఎప్పుడూ ఓనర్స్ మాన్యువల్‌ లో సూచించిన ఫ్లూయిడ్ మాత్రమే ఉపయోగించాలి.

 ⦿ ఆగకముందే డ్రైవ్ కు మార్చడం

ఇంకో ప్రమాదకరమైన అలవాటు కారు పూర్తిగా ఆగకముందే రివర్స్ నుంచి డ్రైవ్‌ కు, డ్రైవ్ నుంచి రివర్స్‌కు మార్చడం. చాలామంది తొందరలో ఇలా చేస్తుంటారు. కానీ, దీని వల్ల గేర్‌బాక్స్‌పై భారీ ఒత్తిడి పడుతుంది.క్లచ్‌ లు, గేర్ భాగాలు అరిగిపోతాయి. ఈ పొరపాట్లు చేయకపోవడం వల్ల ట్రాన్స్‌ మిషన్ లైఫ్ టైమ్ పెంచుకోవచ్చు. సమయానికి సర్వీసింగ్ చేయడం, సరైన ఫ్లూయిడ్ వాడడం, సాఫీగా డ్రైవ్ చేయడం వల్ల పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు.

Read Also: టాటా డబుల్ బ్లాస్ట్.. మే 22న సియెర్రా EV, సఫారీ EV లాంచ్!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×