E-Paper
Advertisement

8 ఏళ్ల వారెంటీతో.. జస్ట్ రూ. 49,999కే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్!

8 ఏళ్ల వారెంటీతో.. జస్ట్ రూ. 49,999కే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్!
Advertisement

Ola Electric Offer 2026: ఒకప్పుడు ఇండియాలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న ఓలా ఎలక్ట్రిక్, ప్రస్తుతం పెద్ద కంపెనీలతో పోటీ పడలేకపోతోంది. ఈ నేపథ్యంలో #EndICEAge ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ సంస్థకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. ఓలా S1 X, జెన్ 3, రోడ్‌ స్టర్ X మోడళ్లు ఇప్పుడు కేవలం రూ. 49,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇది సాధారణ పెట్రోల్ బైక్ ధరలతో పోల్చితే కేవలం సగం ధర మాత్రమే. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వినియోగదారులను టార్గెట్ గా చేసుకుని ఓలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏకంగా 8 ఏళ్ల వారెంటీతో..

ఓలా భారీగా తగ్గింపు ధర ఇవ్వడంతో పాటు.. వినియోగదారులకు 8 సంవత్సరాల ఎక్స్ టెండెడ్ వారెంటీని సైతం అందిస్తోంది. ఈ వారెంటీ బ్యాటరీ, మోటార్‌ పై వర్తిస్తుంది. దీని ద్వారా మున్ముందు వచ్చే ఖర్చులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. అదనంగా, 60% బైబ్యాక్ గ్యారెంటీ ఉంది. అంటే భవిష్యత్తులో కొత్త ఓలా వాహనం కొనుగోలుపై పాత వాహనానికి మంచి ధర లభిస్తుంది.

సర్వీస్ ట్రస్ట్ గ్యారెంటీ కూడా..

Advertisement

సర్వీస్ లో కూడా ఓలా ప్రత్యేకత చూపిస్తోంది. సర్వీస్ ట్రస్ట్ గ్యారెంటీ కింద, ఈవీ సర్వీస్ ఆలస్యమైతే, కంపెనీ ఉచితంగా ఓలా క్యాబ్ వోచర్ ఇస్తుంది. దీని ద్వారా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

పెట్రో ఇబ్బందుల నేపథ్యంలో మంచి ఆఫర్..

దేశంలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఓలా ఈ ఆఫర్ ద్వారా పెట్రోల్ రహిత భవిష్యత్తుకి మంచి దారి చూపిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. వినియోగదారులు సౌకర్యవంతమైన, తక్కువ నిర్వహణ అవసరమున్న, భవిష్యత్తు ప్రయాణాలకు అనుగుణమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఈజీగా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

మార్చి 31 వరకే ఈ క్రేజీ ఆఫర్!

Advertisement

ఓలా తాజా ఆఫర్ మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో  ఉంటుంది. సో, పాత పెట్రోల్ బైక్‌ను ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ తో మార్చాలని చూస్తున్నవారికి ఇది బెస్ట్ టైమ్ గా చెప్పుకోవచ్చు. ఓలా ద్వారా అందించే ఆధునిక సాంకేతికత, ఎక్స్ టెండెడ్ వారంటీ, బైబ్యాక్ గ్యారెంటీ, అద్భుతమైన సర్వీస్ ఈ ఆఫర్‌ ను మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ 2026 ఆఫర్ వినియోగదారుల కోసం ధర, ఫ్యూచర్ టెక్నాలజీ కలయికను అందిస్తూ, ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తెస్తుంది. ఇది కేవలం ఒక డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే కాదు, పెట్రోల్ రహిత, పర్యావరణానుకూలమైన భవిష్యత్తుకి అడుగుగా చెప్పవచ్చు.

Read Also: మిలటరీ తయారు చేసిన ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ఇది.. ఆఫ్ రోడ్‌లో రయ్ రయ్!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×