E-Paper
Advertisement

ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది.. నిహారిక కొణిదెల షాకింగ్ కామెంట్స్!

ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది.. నిహారిక కొణిదెల షాకింగ్ కామెంట్స్!
Advertisement

Niharika Konidela: ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది.. అని అనగానే, ఒంటరిగా ఉండటంపై నిహారిక ఈ కామెంట్స్ చేసిందని అనుకుంటారేమో. అలా ఏం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా మారి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో సక్సెస్, అవార్డులను అందుకున్న నిహారిక (Niharika Konidela).. తన బ్యానర్‌లో రెండో ప్రాజెక్ట్‌గా ‘రాకాస’ చేస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే, మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. తన అన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) బ్యానర్ పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘బరి’ (Bhari). ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Also Read- Harish Shankar: పవర్ స్టార్‌ని ముంచేసి.. ఇప్పుడు మెగాస్టార్‌పై పడ్డ హరీష్

ఫ్యామిలీ మెంబర్స్‌తో సినిమాలు

Advertisement

ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అప్పట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో సినిమాలు తీశారు. వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్లతో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకిప్పుడు తెలుస్తుంది. మా అన్న వరుణ్‌తో మూవీని ఈ రోజు ప్రారంభించడం నాకు చాలా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మా మూవీ ప్రారంభోత్సవానికి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాం. విలేజ్ డ్రామాగా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వంశీ ఈ సారి మరో అద్భుతమైన స్టోరీని ప్రేక్షకులకు చెప్పబోతున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ టీంతో మళ్లీ ఇలా సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.

Also Read- Aditya dhar:ధురంధర్ ఎఫెక్ట్.. పాకిస్థానీయుల నుండీ డైరెక్టర్ కి వింత డిమాండ్?

3 నెలల్లో కథ పూర్తి చేశా..

Advertisement

దర్శకుడు యదు వంశీ (Director Yadu Vamsi) మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత ఓ కథను పట్టుకుని ఏడాది పాటు తిరిగా. అది వర్కౌట్ కాలేదు. మధ్యలో నాకు వాలీబాల్ బ్యాక్ డ్రాప్‌తో ఓ ఐడియా వచ్చింది. కొంత కథ రెడీ చేసుకున్నాను. వాలీబాల్ అని అనుకోవడంతోనే నాకు వరుణ్ తేజ్ మైండ్‌లోకి వచ్చారు. అలా కొంత కథ అయ్యాక మళ్లీ తిరిగి నిహారిక వద్దకే వెళ్లాను. ఆమెకు ఈ కథ చెప్పి, వరుణ్ తేజ్ కావాలని అడిగాను. పూర్తి కథ సిద్ధం చేసిన తరువాత వరుణ్ అన్న దగ్గరకు వెళ్దామని ఆమె అన్నారు. అలా మూడు నెలల్లో పూర్తి కథను రెడీ చేసి వినిపించాం. ఆయనకి కథ చాలా నచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. షూటింగ్ కూడా త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంక్రాంతికి మా ‘బరి’ మూవీని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Also Read- Peddi Movie: పహిల్వాన్ గా రామ్ చరణ్.. ఆయన ఇన్స్పిరేషన్ తోనే?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×