E-Paper
Advertisement

తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. పెట్రోల్, డీజిల్, CNGలో ఏది బెస్ట్ ఫ్యూయెల్!

తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. పెట్రోల్, డీజిల్, CNGలో ఏది బెస్ట్ ఫ్యూయెల్!
Advertisement

Fuel Cost Comparison 2026: ఈ రోజుల్లో కార్లు పలు పవర్ ట్రెయిన్ ఆప్షన్ తో అందుబాటులోకి వస్తున్నాయి. కారుకు సరైన ఫ్యూయెల్ సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, CNG రకాల ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. వీటిలో ఏది బెస్ట్ అనేది డ్రైవింగ్ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ పెరగడం, ఇంధన ధరలు మారడం వల్ల ఇప్పుడు  ఫ్యూయెల్ సెలెక్షన్ అనేది చాలా కీలకంగా మారింది. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉన్న ఫ్యూయెల్ ఏది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

CNG గురించి…  

ఖర్చు విషయానికి వస్తే.. కిలోమీటరుకు చూస్తే CNG అత్యంత చౌకైనది. సాధారణంగా ఇది రూ. 2.5 నుంచి రూ. 4.5 మధ్య ఖర్చవుతుంది. డీజిల్ కిలోమీటరుకు రూ. 4 నుంచి రూ. 6 వరకు ఉంటుంది. పెట్రోల్ మాత్రం ఇంకా ఖరీదైనది. రూ. 6 నుంచి రూ. 8 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కలు చూసినప్పుడు, ఎక్కువగా ప్రయాణించే వారికి CNG స్పష్టంగా ఆదా కలిగిస్తుంది.

Advertisement

సిటీలో రోజూ ఎక్కువ దూరం వెళ్లేవారికి CNG మంచి ఆప్షన్. నెలకు 1,200 కిలోమీటర్లకు పైగా డ్రైవ్ చేస్తే, పెట్రోల్‌తో పోలిస్తే సగానికి పైగా డబ్బు సేవ్ అవుతుంది. కానీ CNG కార్లు కొంచెం ఖరీదుగా ఉంటాయి. బూట్ స్పేస్ తగ్గుతుంది, సిలిండర్ మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. అయినా, లాంగ్ టర్మ్‌ లో ఇది లాభదాయకమే.

హైవే ప్రయాణాలకు డీజిల్ కార్లు బెస్ట్!

డీజిల్ కార్లు ఇప్పుడంత పాపులర్ కాదు. కానీ, హైవేల్లో ఎక్కువగా ప్రయాణించే వారికి ఇవి ఇంకా బాగానే పని చేస్తాయి. నెలకు 2,000 కిలోమీటర్లకు పైగా డ్రైవ్ చేస్తే డీజిల్ మంచి ఆప్షన్. మంచి మైలేజ్, బలమైన ఇంజిన్  ప్లస్ పాయింట్స్. అయితే మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నగర ట్రాఫిక్‌ లో DPF లాంటి సమస్యలు కూడా రావచ్చు.

తక్కువగా వాడే వారికి పెట్రోల్ కార్లు బెస్ట్!

Advertisement

పెట్రోల్ కార్లు సింపుల్, తక్కువ ఖర్చుతో కొనుగోలు చెయ్యొచ్చు. తక్కువగా వాడేవారికి ఇవే బెస్ట్. నెలకు 800 కిలోమీటర్ల లోపు డ్రైవ్ చేస్తే, పెట్రోల్ సరైన ఎంపిక. మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. మొదటిసారి కార్ కొనేవారికి ఇది సేఫ్ ఆప్షన్.

ఎలక్ట్రిక్ కార్ల గురించి..

ఇక ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉంటే, కిలోమీటరుకు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొనుగోలు ధర ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. హైబ్రిడ్ కార్లు కూడా మంచి బ్యాలెన్స్ ఇస్తాయి. ఇంధన ఆదా, సౌకర్యం రెండూ ఉంటాయి. మొత్తంగా తక్కువ వాడితే పెట్రోల్, మధ్యస్థంగా వాడితే CNG, ఎక్కువగా వాడితే డీజిల్, EV కార్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: లక్ష కిలోమీటర్ల తర్వాత కూడా కొత్త కారులా నడవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×