E-Paper
Advertisement

ఒకే చోట టైర్ కొనుగోలు, సర్వీస్.. రైస్ కొత్త కాన్సెప్ట్ భలే ఉంది భయ్యా!

ఒకే చోట టైర్ కొనుగోలు, సర్వీస్.. రైస్ కొత్త కాన్సెప్ట్ భలే ఉంది భయ్యా!
Advertisement

Reise Pit Stop Franchise Model: రైస్ సంస్థ ఇండియన్ టూవీలర్ యజమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పిట్ స్టాప్ అనే టైర్ రిటైల్,  సర్వీస్ కాన్సెప్ట్‌ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ లో భాగంగా తొలి అవుట్‌ లెట్ బెంగళూరులోని శివాజీ నగర్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కేవలం స్టోర్ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా విస్తరించబోయే పెద్ద నెట్‌ వర్క్‌ కు ఫస్ట్ స్టెప్ గా కంపెనీ వెల్లడించింది.

ఏంటీ పిట్ స్టాప్ ప్రత్యేకత?

ఈ కొత్త పిట్ స్టాప్ ద్వారా టైర్ కొనుగోలు, సర్వీసింగ్‌ ను ఒకే చోట ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు టైర్ మార్పులు, బ్యాలెన్సింగ్ లాంటి పనుల కోసం వేర్వేరు చోట్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు వాహనదారులు ఒకే  సెంటర్ లో  అన్ని సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. స్కూటర్లు, సాధారణ కమ్యూటర్ బైక్‌లు, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ మోటార్‌ సైకిళ్లకు అనువైన టైర్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం వరకు ఆయా  రేంజ్‌ లలో టైర్లు అందుబాటులో ఉంటాయి.

పిట్ స్టాప్‌ లో బోలెడు సర్వీసులు

Advertisement

ఇక ఈ సర్వీస్ సెంటర్ లో బోలెడు సేవలు అందుబాటులో ఉంటాయి. టైర్ మార్చడం, వీల్ బ్యాలెన్సింగ్, గాలి నింపడం లాంటి ప్రైమరీ సర్వీసులతో పాటు ఆధునిక పరికరాలతో సర్వీసులు అందిస్తారు. టైర్ ఛేంజర్లు, డిజిటల్ వీల్ బ్యాలెన్సర్లు, నైట్రోజన్ గాలి నింపే మెషీన్లు, ఎయిర్ కంప్రెసర్లు లాంటి ఆధునిక మెకానికల్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఈ పరికరాల వల్ల టైర్ ఫిట్‌ మెంట్ కచ్చితంగా ఉంటుంది. దీని వల్ల బైక్ నడిచే విధానం మెరుగుపడటంతో పాటు టైర్ల లైఫ్ టైమ్ కూడా పెరుగుతుంది.

సిబ్బందికి ప్రత్యేకం ట్రైనింగ్  

ఇక్కడ పని చేసే సిబ్బంది కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. రైస్ సంస్థ వారి మెకానిక్‌ లకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చి, నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం పని చేయేలా పర్యవేక్షిస్తుంది. ప్రతి పిట్ స్టాప్‌ లో ఒకే విధమైన సేవా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రీమియం బైక్‌ల విషయంలో మరింత జాగ్రత్తగా పని చేస్తారు. సురక్షితమైన టైర్ ఫిట్‌మెంట్, వెహికల్  హ్యాండ్లింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రీమియం కస్టమర్ల కోసం అదనంగా బ్రాండెడ్, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు.  ఒకే చోట టైర్లు మాత్రమే కాకుండా అవసరమైన ఇతర భాగాలను కూడా పొందే సౌకర్యం ఉంటుంది. ఇది రైడర్లకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుంది.

ఫ్రాంచైజీ మోడల్ లో విస్తరించే అవకాశం

Advertisement

రైస్ సంస్థ ఈ పిట్ స్టాప్ నెట్‌ వర్క్‌ ను ఫ్రాంచైజీ మోడల్ ద్వారా విస్తరించాలనే ప్రణాళికలో ఉంది. స్థానిక వ్యాపారులు ఈ స్టోర్లను నడుపుతారు. వారికి కంపెనీ నుంచి ఫుల్ సపోర్టు ఉంటుంది. మెకానిక్ ట్రైనింగ్,  బ్రాండింగ్, మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్ లాంటి అంశాల్లో కంపెనీ సహాయం చేస్తుంది. కొంతవరకు యంత్రాల ఖర్చు కూడా కంపెనీ భరిస్తుంది.

Read Also: ఫస్ట్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న ఎలక్ట్రిక్ బైక్, ఓబెన్ న్యూ మోడల్ లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×