E-Paper
Advertisement

Renault Duster 2026: సరికొత్తగా రెనాల్ట్ డస్టర్ రీఎంట్రీ, లాంచింగ్ ఎప్పుడంటే?

Renault Duster 2026: సరికొత్తగా రెనాల్ట్ డస్టర్ రీఎంట్రీ, లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

Renault Duster 2026: రెనాల్ట్ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ లో డస్టర్ ఒకటి. ఇప్పుడు రెనాల్ట్ డస్టర్ (Renault Duster) 2026 పేరుతో సరికొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది.  థర్డ్ జెనరేషన్ మోడల్ గా, ఇండియా స్పెసిఫిక్ డిజైన్ మార్పులతో లాంచ్ కాబోతోంది. ఈ మోడల్ రెనాల్ట్-నిసాన్ అలయన్స్ CMF-B మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది. హై లోకలైజేషన్‌తో తమిళనాడు ప్లాంట్‌లో తయారవుతుంది. పాత మోడల్ (2012లో లాంచ్ అయినది) భారతదేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌కు మంచి పునాది వేసింది. ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ క్రెటా, సెల్టోస్ లాంటి కార్లతో పోటీ పడబోతోంది. అఫీషియల్ డెబ్యూ జనవరి 26, 2026 (రిపబ్లిక్ డే) రోజున ఇవ్వబోతోంది. ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన ధరలు, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Renault Duster 2026 డిజైన్, ఎక్స్‌ టీరియర్

పాత మోడల్‌తో పోల్చితే ఈ కొత్త డస్టర్ మరింత రగ్డ్, బాక్సీ లుక్‌తో వస్తుంది. గ్లోబల్ మోడల్ (Dacia Duster)తో పోల్చితే ఇండియా వెర్షన్‌లో యూనిక్ మార్పులు ఉండబోతున్నాయి. ఫ్రంట్  ఐబ్రో షేప్డ్ LED DRLs, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, స్లీక్ LED హెడ్‌లైట్లు, వైడ్ గ్రిల్, ఫ్లాట్ బానెట్ ఉంటుంది. సైడ్ స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లు, హెవీ క్లాడింగ్, 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, C పిల్లర్‌లో హిడెన్ రియర్ డోర్ హ్యాండిల్స్ తో రానుంది. రియర్ కనెక్టెడ్ LED టైల్ లైట్స్ విత్ సెంట్రల్ లైట్ బార్, స్కల్ప్టెడ్ టైల్‌గేట్, రియర్ వైపర్ ఉంటాయి. డైమెన్షన్లు పాత వెర్షన్ కంటే 9mm వైడ్, 2mm లాంగ్, గ్రౌండ్ క్లియరెన్స్ 217mm వరకు ఉంటాయి. మల్టిపుల్ టెర్రైన్ మోడ్స్ స్నో, శాండ్, ఆఫ్-రోడ్, ఎకో, ఆటో ఉంటాయి.

టీజర్, రెండర్ ఇమేజెస్ ఆధారంగా ఫీచర్లు

Advertisement

క్యాబిన్ మరింత ప్రీమియం, టెక్ హెవీగా ఉంటుంది.  పాత మోడల్ యుటిలిటేరియన్ స్టైల్ నుంచి అప్‌గ్రేడ్ అయ్యింది. 10.1-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కన్సోల్  Y షేప్డ్ AC వెంట్స్, డ్రైవర్ ఓరియెంటెడ్ సెంటర్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆర్కామిస్ 3D సౌండ్ సిస్టమ్ ఉంటుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం మెటీరియల్స్, స్పేషియస్ 7-సీటర్ ఆప్షన్ తో వస్తుంది. లెవెల్-2 ADAS (అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్), 360° కెమెరా ఉంటుంది.

Renault Duster 2026 ఇంజన్, పెర్ఫార్మెన్స్

Renault Duster 2026లో డీజిల్ ఆప్షన్ లేదు. పూర్తిగా పెట్రోల్, హైబ్రిడ్ మీద ఫోకస్ పెట్టింది. ఇండియా స్పెసిఫిక్ స్పెక్స్ ఆధారంగా..

Advertisement

⦿ 1.0L టర్బో పెట్రోల్: ఎంట్రీ-లెవల్.

⦿ 1.3L టర్బో పెట్రోల్: 156 hp, హై పెర్ఫార్మెన్స్.

⦿ 1.2L మైల్డ్ హైబ్రిడ్: ఫ్యూయల్ ఎఫిషియెంట్.

⦿ స్ట్రాంగ్ హైబ్రిడ్: 1.6L పెట్రోల్ + రెండు ఎలక్ట్రిక్ మోటార్లు.

⦿ ట్రాన్స్‌ మిషన్: మాన్యువల్/ఆటోమేటిక్

⦿ మైలేజ్: హైబ్రిడ్‌లో హై ఎఫిషియెన్సీ ఎక్స్‌ పెక్ట్ చేస్తున్నారు. స్పెసిఫిక్ ఫిగర్స్ ఇంకా తెలియదు.

Renault Duster 2026లో సేఫ్టీ ఫీచర్లు

Renault Duster 2026లో  6 ఎయిర్‌బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.  హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఉంటాయి.  గ్లోబల్ మోడల్ 3-స్టార్ Euro NCAP (69% అడల్ట్, 85% చైల్డ్ ప్రొటెక్షన్) ను కలిగి ఉంది.

Renault Duster 2026లో ధర, వేరియంట్లు

Renault Duster 2026లో ఎక్స్‌ పెక్టెడ్ ధర రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. ఎంట్రీ-లెవల్ రూ. 10-12 లక్షలు, హైబ్రిడ్ రూ. 18-20 లక్షలు ఉండవచ్చు. ఈ SUV సిటీ డ్రైవింగ్, ఆఫ్ రోడ్‌కు సూట్ అవుతుంది.

Read Also:  వినియోగదారులకు షాక్, జనవరి 2026 నుంచి కార్ల ధరలు పెంపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×