E-Paper
Advertisement

Nissan Cars Price Hike: వినియోగదారులకు షాక్, జనవరి 2026 నుంచి కార్ల ధరలు పెంపు!

Nissan Cars Price Hike: వినియోగదారులకు షాక్, జనవరి 2026 నుంచి కార్ల ధరలు పెంపు!

నిస్సాన్ ఇండియా ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2026 నుంచి తమ కార్ల ధరలను అప్ టు 3%  పెంచనున్నట్లు తెలిపింది. ముడి సరుకుల ధరలు, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్, లాజిస్టిక్స్ కాస్ట్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాలో నిస్సాన్ మాగ్నైట్ (Magnite) సబ్-కాంపాక్ట్ SUVను అమ్ముతోంది X-Trail కూడా అమ్ముడవుతున్నా, పరిమిత సేల్స్ ఉన్నాయి.

ప్రస్తుత ధరలు vs అంచనా కొత్త ధరలు  

 

⦿ Nissan Magnite (అన్ని వేరియంట్లు)

Nissan Magniteకు సంబంధించి అన్ని వేరియంట్ల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.62-రూ.10.76 లక్షలు ఉంది. అంచనా పెంపు రూ.17,000 – రూ.32,000 వరకు ఉంటుంది. పెంచిన ధరతో కలిపి రూ. 5.79 – రూ.11.08 లక్షలు ఉండనున్నట్లు తెలిసింది.

⦿Nissan X-Trail (సింగిల్ వేరియంట్)

ఈ కారుకు సంబంధించి ప్రస్తుత ధర (ఎక్స్-షోరూమ్) రూ. 49.92 లక్షలుగా ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 1.50 లక్షలు పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగిన ధర తర్వాత ఈ కారు ధర సుమారు రూ. 51.42 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా నిస్సాన్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను జనవరి 1, 2026 నుండి 3% వరకు హైక్ చేయబోతోంది.

ధరల పెంపుకు ముఖ్యమైన కారణాలు

కార్ల ధరల పెంపుకు సంబంధించి నిస్సాన్ ఇండియా కీలక విషయాలు వెల్లడించింది. ఏ కారణాలతో ధరలు పెంచాల్సి వస్తుందో చెప్పింది. రైజింగ్ ఇన్‌పుట్ కాస్ట్స్ అంటే ముడి సరుకుల ధరలు పెరగడం, కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అంటే, రూపాయి విలువ తగ్గడంతో పాటు ఏటా ధరల సవరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన ఇతర కంపెనీలు   

కార్ల ధరల పెంపు గురించి నిన్సాన్ తో పాటు ఇతర కంపెనీలు కూడా ప్రకటన చేశాయి. మెర్సిడెస్-బెంజ్, JSW MG మోటార్, BYD వంటి కంపెనీలు కూడా 2026 జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది ఆటో ఇండస్ట్రీలో సాధారణ ట్రెండ్ గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: టాటా హారియర్ పెట్రోల్ vs డీజిల్.. ఏది బెస్ట్? ఎందుకు?

నిస్సాన్ ఫ్యూచర్ ప్లాన్స్ (2026-2027)

ధరల పెంపు ఉన్నప్పటికీ, నిస్సాన్ ఇండియాలో బిగ్ కమ్‌ బ్యాక్ కోసం ప్లాన్ చేస్తోంది. Gravite MPV (రెనాల్ట్ ట్రైబర్ బేస్డ్) ను  జనవరి 2026లో అన్‌వీల్ చేయనుంది. మార్చి నుంచి సేల్ ప్రారంభించనుంది. Tekton SUV (క్రెటా రైవల్)ను ఫిబ్రవరి 2026లో అన్‌వీల్ చేయనుంది. మరో 7-సీటర్ SUV 2027లో లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కచ్చితమైన వేరియంట్ వైజ్ పెంపు నిస్సాన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇది మోడల్, వేరియంట్,  స్పెసిఫికేషన్స్ పై ఆధారపడి మారవచ్చు. మాగ్నైట్ కొనాలనుకుంటే డిసెంబర్ 2025లోనే బుక్ చేస్తే పాత ధరలకు పొందే అవకాశం ఉంటుంది. కచ్చితమైన లేటెస్ట్ ధరలు, ఆఫర్స్ కోసం nissan.in లేదంటే దగ్గరలోని నిస్సాన్ డీలర్‌ను కాంటాక్ట్ కావడం మంచిది.

Read Also: జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×