E-Paper
Advertisement

Renault Duster 2026 vs Tata Sierra: రెనాల్ట్ డస్టర్ 2026 vs టాటా సియెర్రా. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

Renault Duster 2026 vs Tata Sierra: రెనాల్ట్ డస్టర్ 2026 vs టాటా సియెర్రా. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Renault Duster 2026 Vs Tata Sierra: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న  సరికొత్త రెనాల్ట్ డస్టర్ లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ కారు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. డస్టర్ తొలిసారి ఇండియన్ మార్కెట్ లో 2012లో విడుదల అయ్యింది. ఆ తర్వాత 2022లో డిస్ కంటిన్యూ చేశారు. ఇక గత ఏడాది నవంబర్ 25న టాటా సియెర్రాను విడుదల చేశారు. ఈ కారుతో రెనాల్ట్ డస్టర్ ప్రస్తుతం గట్టి పోటీ ఎదుర్కొంటుంది. ఇంతకీ ఈ రెండు కార్లలో ఏది బెస్ట్? ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పరంగా రెనాల్ట్ డస్టర్ 2026, టాటా సియెర్రా మధ్య పోలికలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రెనాల్ట్ డస్టర్ vs టాటా సియెర్రా ఫీచర్లు

రెనాల్ట్ డస్టర్ 2026, టాటా సియెర్రా అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.  డస్టర్ క్యాబిన్ లోపల డ్యూయల్-స్క్రీన్ సెటప్‌ ను కలిగి ఉండగా, సియెర్రా ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ తో వస్తుంది. ప్రతి స్క్రీన్ 12.3 అంగుళాల సైజు కలిగి ఉంటుంది.  ఈ రెండు SUVల మధ్య  కంప్లీట్ ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం..  లక్షణాల పరంగా తేడాలను క్రింది పట్టికలో తనిఖీ చేయవచ్చు.

Advertisement

ఇన్పోటైన్ మెంట్ స్క్రీన్ రెనాల్ట్ డస్టర్ లో 10.1 ఇంచుల టచ్ స్క్రీన్ ఉంటుంది. టాటా సియెర్రాలో 12.3 ఇంచుల ట్రిఫుల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. డ్రైవర్ డిస్ ప్లే రెనాల్ట్ డస్టర్ లో 10.25 ఇంచుల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. సియెర్రాలో 100.20 ఇంచుల డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది. ADAS విషయానికి వస్తే రెండింటిలోనూ లెవల్ 2 ఉంటుంది. బూట్ స్పేస్ రెనాల్ట్ లో 700 లీటర్లు, సియెర్రాలో 622 లీటర్లు ఉంటుంది. రెండింటిలోనూ పనోరమిక్ సన్ రూఫ్ ఉంటుంది.

Read Also: ఫిబ్రవరిలో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చూస్తే మతిపోతోంది బ్రో!

రెనాల్ట్ డస్టర్ 2026 Vs టాటా సియెర్రా ఇంజిన్

Advertisement

రెనాల్ట్ డస్టర్ 2026, టాటా సియెర్రా మొత్తం 3 పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్నాయి. డస్టర్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్  ఆప్షన్స్ తో వస్తుంది. సియెర్రా 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ క్రియోజెట్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది.

Read Also: ఈ కార్లకు కోపం వస్తుంది, నిజమండీ బాబూ!

రెనాల్ట్ డస్టర్ 2026లో 1.3 లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 163 పీఎస్ పవర్ ను పొందుతుంది. మాక్సిమం టార్క్ 280 Nm ప్రొడ్యూస్ చేస్తుంది. అటు టాటా సియెర్రాలో 1.5 లీటర్ హైప్రైన్ TGDi పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మాక్సిమం 160 పీఎస్ మాగ్జిమం పవర్ ను అందిస్తుంది. 280 Nm మాగ్జిమం టార్క్ అందిస్తుంది.

Read Also: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ మరింత పెరగాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×