E-Paper
Advertisement

RE అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి బుల్లెట్ 650 ఎంట్రీ!

RE అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి బుల్లెట్ 650 ఎంట్రీ!
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బుల్లెట్ 650 ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. కంపెనీ ఈ కొత్త మోటార్‌ సైకిల్‌ ను రూ. 3.65 లక్షల ప్రారంభ(ఎక్స్ షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇప్పటి వరకు భారత్ లో విక్రయించిన బుల్లెట్ మోడళ్లలో ఇది అత్యంత పవర్ ఫుల్ వెర్షన్‌ గా నిలిచింది. క్లాసిక్ బుల్లెట్ లుక్‌ ను అలాగే కొనసాగిస్తూ, 650సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ తో దీనిని రూపొందించారు.

ఇటలీ EICMA మోటార్ షోలో ప్రదర్శన

బుల్లెట్ 650ను తొలిసారిగా 2025లో ఇటలీలో జరిగిన EICMA మోటార్ షోలో ప్రదర్శించారు. అనంతరం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటోవర్స్ ఈవెంట్‌ లో భారత మార్కెట్ కోసం పరిచయం చేసింది. ఈ మోడల్ రావడంతో కంపెనీ 650సీసీ బైక్‌ల శ్రేణి మరింత విస్తరించింది. ఇప్పటికే ఇంటర్‌ సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, సూపర్ మీటియోర్ 650, షాట్‌గన్ 650, బేర్ 650 వంటి బైక్‌ లు ఈ విభాగంలో ఉన్నాయి.

సంప్రదాయ బుల్లెట్ స్టైల్ కొనసాగిస్తూ..

Advertisement

కొత్త బుల్లెట్ 650 సంప్రదాయ బుల్లెట్ స్టైల్‌ ను కొనసాగిస్తుంది. ఐ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్‌ పై గోల్డ్ పిన్‌ స్ట్రైప్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ట్యాంక్‌ పై ఉన్న రెక్కల లోగో బైక్‌ కు మరింత ప్రీమియం లుక్‌ ను అందిస్తుంది. ముందు భాగంలో గుండ్రని LED హెడ్‌ ల్యాంప్‌ తో పాటు టైగర్ ఐ పైలట్ ల్యాంప్‌ లు ఉన్నాయి. క్రోమ్ ఫినిష్‌ తో కూడిన ఎగ్జాస్ట్‌లు, మిర్రర్లు, హ్యాండిల్‌బార్లు రెట్రో స్టైల్‌ను గుర్తు చేస్తాయి. బైక్‌లో పెద్ద రియర్ ఫెండర్, సింగిల్ పీస్ సీటు కూడా ఉన్నాయి. ఇది పాత బుల్లెట్ మోడళ్లను గుర్తు చేసేలా రూపొందించబడింది. కంపెనీ దీనిని కానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.

పవర్ ఫుల్ ఇంజిన్ తో..

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 647.95సీసీ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 46.4 bhp పవర్, 52.3 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ను జత చేశారు. అలాగే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల గేర్ మార్పులు మరింత ఈజీగా ఉంటాయి.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగా కూడా బుల్లెట్ 650 ఆకట్టుకుంటుంది. అనలాగ్ స్పీడోమీటర్‌ తో పాటు డిజిటల్ డిస్‌ ప్లేను అందించారు. ఇందులో ఫ్యూయల్ లెవెల్, గేర్ పొజిషన్, సర్వీస్ రిమైండర్ లాంటి వివరాలు కనిపిస్తాయి. ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా రైడర్లు టర్న్ బై టర్న్ నావిగేషన్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS కూడా స్టాండర్డ్‌ గా అందించారు. క్లాసిక్ బుల్లెట్ స్టైల్‌ను ఇష్టపడే వారికి ఆధునిక సాంకేతికత, శక్తివంతమైన ఇంజిన్ కలయికతో బుల్లెట్ 650 మంచి ఆప్షన్ గా నిలువనుంది.

Read Also: డెలివరీ బాయ్స్ కోసం ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×