E-Paper
Advertisement

బలుపు మాట‌లు.. బ‌రితెగింపు చేష్ట‌లు ఎవ‌రు చేసినా ఇదే గ‌తి! సెల్ఫ్ డిఫెన్స్‌లో బీఆరెస్‌…ఇది కేటీఆర్ టీంకు గుణ‌పాఠం.. !

బలుపు మాట‌లు.. బ‌రితెగింపు చేష్ట‌లు ఎవ‌రు చేసినా ఇదే గ‌తి! సెల్ఫ్ డిఫెన్స్‌లో బీఆరెస్‌…ఇది కేటీఆర్ టీంకు గుణ‌పాఠం.. !
Advertisement

ఈ మ‌ధ్య ఓ చిన్న వీడియోను విడుద‌ల చేశారు సోష‌ల్ మీడియాలో. కేటీఆర్ అంటున్నాడు ఆ వీడియోలు.. ఎన్నికేసులు అయితే అంత పెద్ద లీడ‌ర్ అవుతార్రా బై..! అని. అంటే కేసులు పెట్టించుకోవ‌డం కోసం ఏమైనా చేయొచ్చు. ఏదైనా మాట్లాడొచ్చు. సోష‌ల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ అయినా చేయొచ్చు అనే విధంగా కేటీఆర్ వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్నారు. యథా రాజా త‌థా ప్ర‌జా అన్న‌ట్టు .. కేటీఆర్ అడుగుజాడల్లో ఆయ‌న టీం న‌డుస్తోంది. బాల్క‌సుమ‌న్, పాడె కౌషిక్‌, క్రిషాంక్‌.. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌.. ఇలా త‌న టీమ్‌ను త‌యారు చేసుకున్నాడు కేటీఆర్‌. దీనికి తోడు త‌న సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది.

దీంతో కొత్త రాజ‌కీయాల‌కు తెర‌లేపాడు చిన్న బాస్‌. త‌న న‌మ‌స్తే తెలంగాణ‌, టీన్యూస్‌ను వ‌దిలేశాడు. వాటినిఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని త‌నే ఇండైరెక్టుగా ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చాడు. అందుకే సోష‌ల్ మీడియాలో రెచ్చ‌గొట్టే కామెంట్లు.. వ్య‌క్తిత్వ హ‌న‌నాలు య‌థేచ్చ‌గా కొన‌సాగించడం, త‌న చుట్టూ ఉన్న భ‌జ‌న బ్యాచ్‌ను ఉసిగొల్పి .. వివాద‌స్ప‌ద కామెంట్లు చేయించ‌డం.. ఇవీ ఇప్పుడు బీఆరెస్ అనుస‌రిస్తున్న విధానాలు. కేసీఆర్ ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉన్న‌ట్టుగా… మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తాడు.. కానీ ఆయ‌న‌కూ ఇలాంటి వివాదాలే కావాలె. ఈయ‌న సీఎంగా ఉన్న‌నాటి సోష‌ల్ మీడియాను బాగా అబ్జ‌ర్స్ చేసేవాడు. ఎవ‌రైనా ప్ర‌తిప‌క్షం మీద దాడి చేసినా వారిని మెచ్చుకునేవాడు.

Advertisement

ఓడిపోయిన త‌రువాత ఇది మ‌రీ ఎక్కువైంది ఆయ‌న‌లో. ప్ర‌భుత్వాన్ని ఎంత పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తూ, దాడి చేస్తూ కామెంట్లు, పోస్టింగులు పెడుతున్నారో..వారిని మ‌రీ ఫామ్‌హౌజ్‌కు పిలిచి శ‌బ్బాష్ అని భుజం త‌ట్టే సంస్కృతిని కూడా తెర‌లేపాడు ఈ మ‌ధ్య‌. దీంతో ఆయ‌న న‌జ‌ర్‌లో ప‌డేందుకు బీఆరెస్ లీడ‌ర్లు, సోష‌ల్ మీడియా వర్క‌ర్లు.. పోటీలు ప‌డి మ‌రీ ప్ర‌భుత్వాన్ని, సీఎంను ఎంత వ‌ల్గ‌ర్గా తిడితే అంత పేరొస్తుంద‌నే విధంగా ముందుకు పోతున్నారు. దీనికి ఈ మ‌ధ్య అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంతో మ‌రింత రెచ్చిపోతున్నారు. తాజాగా బండి భ‌గీర‌థ్ కేసు విష‌యంలో కూడా దీన్ని చాలా ప‌ర్స‌న‌ల్ గా తీసుకున్నారు. బండి సంజయ్‌ను ఎంత బ‌ద్నాం చేద్దామ‌నుకున్నారో.. సీఎం రేవంత్ రెడ్డిని కూడా అంత‌లా బ‌ద్నాం చేయ‌డానికి వెనుకాడ‌లేదు. మ‌రీ ఓవ‌ర్ యాక్ష‌న్‌కు కూడా దిగ‌జారారు.

దీంతో త‌మ పార్టీ పంథా ఇక‌పై ఇలాగే ఉంటుంద‌నే సంకేతం ఇచ్చారు. ప్ర‌జాక్షేత్రంలో జ‌నం స‌మ‌స్య‌లు విని.. అక్క‌డ పోరాటాలు నిర్మించే పాత బీఆరెస్ లేదిప్పుడు. అంతా ఇలా సోష‌ల్ మీడియాలో, ప్రెస్‌మీట్ల‌లో రెచ్చ‌గొట్టే కామెంట్ల‌తో రాజ‌కీయ మైలేజీ కోసం చూస్తున్నారు. క్రిషాంక్ కూడా మ‌రీ దిగజారి మొన్నం సీఎం స‌తీమ‌ణి ప్ర‌స్తావ‌న కూడా తీసుకొచ్చేలా దిగ‌జారే కామెంట్ చేశాడు. జైలు పాల‌య్యాడు. దీన్ని కూడా వీరోచిత పోరాటం కింద చూసుకుని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారు బీఆరెస్ శ్రేణులు. కేటీఆర్ టీం. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్ సైతం హుందా రాజ‌కీయాల‌ను వ‌దిలేశాడు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో గ‌న్నీ బ్యాగులు త‌క్కువ ప‌డ‌టానికి కార‌ణం.. ఆ బ్యాగుల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకిపంపేందుకు డ‌బ్బుల సంచులుగా వాడుకుంటున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేశాడు.

Advertisement

ఇది స‌బ్జెక్టు వైస్‌గా, నిర్మాణాత్మ‌క విమ‌ర్శైతే కాదు. అంటే వైర‌ల్ కావ‌డానికి ఇలాంటి జిమ్మిక్కులు, మాట‌లు, దిగ‌జారుడు చేష్ట‌లు చేసి .. అరెస్ట‌యి.. జైలులో ఉండి వ‌స్తే.. అది త‌మ‌కు ఆపార్టీలో రాజ‌కీయ భ‌విష్య‌త్తును మ‌రింత బ‌లంగా చేస్తుంద‌ని ఆ పార్టీ సిగ్న‌ల్ ఇస్తున్న త‌రుణంలో ఇలా రెచ్చిపోతున్నారు. దీనికి ప్ర‌జామోదం ఉంద‌ని వారికి వారే కితాబిచ్చుకుంటున్నారు. బాల్క సుమ‌న్ ఉదంతంతోనైనా గుణ‌పాఠం నేర్చుకుంటారా? ఇలా చేస్తేనే మ‌రింత వైర‌ల్ అయి.. జ‌నం త‌మ గురించే ఆలోచించి.. ఇదే పోరాటం అనుకుని భ్ర‌మించి మ‌ళ్లీ తమ‌కు అధికారం అప్ప‌జెప్తార‌నే భ్ర‌మ‌లో మునిగితేలుతారా?

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×