E-Paper
Advertisement

యమహా XSR155 vs హంటర్ 350.. వీటిలో ఏది బెస్ట్ బైక్?

యమహా XSR155 vs హంటర్ 350.. వీటిలో ఏది బెస్ట్ బైక్?
Advertisement

 Hunter 350 vs XSR 155 Comparison: కొత్త బైక్ కొనాలనుకునే బోలెడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయల్ ఎన్‌ ఫీల్డ్ హంటర్ 350లో బేస్ ప్రీమియం అనే కొత్త వేరియంట్‌ ను తీసుకురాగా, దానికి దగ్గరగా ఉన్న ధరలో యమహా XSR155 కూడా మంచి ఆప్షన్‌ గా కొనసాగుతోంది. ఈ రెండు బైక్‌లు ధరలో దగ్గరగా ఉన్నప్పటికీ, ఎక్స్ పీరియెన్స్ లో డిఫరెంట్ గా ఉంటాయి. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డిజైన్ గురించి..

హంటర్ 350 పూర్తిగా క్లాసిక్ రెట్రో స్టైల్‌ ను కలిగి ఉంటుంది. రౌండ్ హెడ్‌ లైట్, సింపుల్ ట్యాంక్ డిజైన్, చిన్న ఎగ్జాస్ట్ తో  పాత కాలపు బైక్ ఫీల్ ఇస్తుంది. టార్మాక్ బ్లాక్ కలర్‌ లో మాత్రమే లభించడం వల్ల ఇది చాలా క్లీన్ గా, సింఫుల్ గా కనిపిస్తుంది.  మరోవైపు, యమహా XSR155 మాత్రం కాస్త మోడర్న్ టచ్‌ తో రెట్రో స్టైల్‌ ను కలిపినట్లు ఉంటుంది. గోల్డ్ కలర్ ఫోర్కులు, ఆకట్టుకునే కలర్ స్కీమ్ తో కాస్త ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

పర్ఫార్మెన్స్ గురించి..

Advertisement

హంటర్ 350లో 349cc ఇంజన్ ఉండి మంచి టార్క్ ఇస్తుంది. ఇది సిటీ రైడింగ్‌లో సాఫ్ట్‌ గా, రిలాక్స్‌ గా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కువ స్పీడ్‌ లో కూడా మంచి పవర్ ఇస్తుంది. ఇక XSR155లో 155cc ఇంజన్ ఉన్నప్పటికీ, ఇది హై రెవ్స్‌ లో మంచి పనితీరును కనబరుస్తుంది. వేగంగా, స్పోర్టీగా రైడ్ చేయాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది. సింపుల్‌ గా చెప్పాలంటే, హంటర్ సాఫ్ట్ రైడింగ్ కోసం, XSR స్పోర్టీ ఫీల్ కోసం బాగుంటుంది.

బిల్డ్, హార్డ్‌ వేర్ విషయానికి వస్తే, హంటర్ 350లో ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌ తో సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. ఇది సాధారణ వినియోగానికి సరిపోతుంది.  XSR155లో ముందు, వెనుక రెండింటికీ డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ABS ఉండటం వల్ల బ్రేకింగ్ బాగుంటుంది. అలాగే XSRలో ఇన్వర్టెడ్ ఫోర్క్‌ లు ఉండటం వల్ల రైడింగ్ మరింత స్టేబుల్‌ గా ఉంటుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Advertisement

ఫీచర్ల పరంగా చూస్తే, హంటర్ 350 సింపుల్‌గా ఉంటుంది. అనలాగ్ మీటర్‌ తో పాటు చిన్న డిజిటల్ డిస్‌ ప్లే ఉంటుంది. అవసరమైతే ట్రిప్పర్ నావిగేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క XSR155లో ఫుల్ డిజిటల్ కన్సోల్ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్‌ డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో నావిగేషన్ సపోర్ట్ లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు.  హంటర్ 350 ధర సుమారు రూ.1.38 లక్షల నుంచి రూ.1.67 లక్షల వరకు ఉంటుంది. యమహా XSR 155 ధర సుమారు రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.59 లక్షలు ఉంటుంది.

Read Also: తక్కువ బరువు, మరింత పవర్.. కొత్త ఎలక్ట్రిక్ KTM వచ్చేసింది!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×