E-Paper
Advertisement

బడ్జెట్ నిర్వాహణలో టాలీవుడ్ అంత పూరా?.. ఈ విషయాలు తెలిస్తే మతి పోతుంది..

బడ్జెట్ నిర్వాహణలో టాలీవుడ్ అంత పూరా?.. ఈ విషయాలు తెలిస్తే మతి పోతుంది..
Advertisement

Budget Planning: సినిమా పరిశ్రమలో ‘బడ్జెట్’ అనేది ఇప్పుడు ఒక మాయాజాలంగా మారింది. వందల కోట్లు ఖర్చు పెడితేనే అద్భుతాలు వస్తాయని నమ్మే కాలమిది. అయితే, కేవలం డబ్బు ఖర్చు పెడితే సరిపోదు, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామనే ‘ప్లానింగ్’ ముఖ్యం అని ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్ రవి (BVS Ravi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar The Revenge) చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఆయన చేసిన విశ్లేషణ ఆలోచింపజేసేలా ఉంది.

Read also-AA22XA6 మూవీ పోస్టర్‌పై ట్రోల్స్.. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఇదేం పని?

ప్లానింగ్ వర్సెస్ బడ్జెట్

Advertisement

బి.వి.ఎస్ రవి విశ్లేషణ ప్రకారం, ‘ధురంధర్’ చిత్రాన్ని రెండు భాగాలుగా కలిపి కేవలం రూ. 250 కోట్ల బడ్జెట్‌తో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. ఇదే తరహా ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌లో సరైన ప్లానింగ్ లేకుండా చేపడితే, కనీసం రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే, పక్కా ప్రణాళిక లేకపోవడం వల్ల సగం బడ్జెట్ వృథా అయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టాలీవుడ్‌లో లోటుపాట్లు

టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలను రవి ఎత్తిచూపారు. షూటింగ్ మొదలైన తర్వాత సీన్లు మార్చడం, రీ-షూట్లు చేయడం వల్ల ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. స్టార్ హీరోల డేట్స్, సాంకేతిక నిపుణుల సమన్వయం లేకపోవడం వల్ల షూటింగ్ రోజులు పెరిగిపోతాయి. దీనివల్ల ప్రొడక్షన్ ఖర్చులు మరియు తెచ్చిన పెట్టుబడిపై వడ్డీ భారం నిర్మాతను ముంచేస్తుంది. ప్లానింగ్ లేకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేసినా, చివరకు వచ్చే అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో ఉండదు. దీనివల్ల ప్రేక్షకులు అసంతృప్తికి లోనవుతారు.

Advertisement

Read also-అల్లు అర్జున్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ రివీల్ చేసేది అప్పుడే..

ధురంధర్ నేర్పిన పాఠం

‘ధురంధర్’ చిత్రం తక్కువ బడ్జెట్‌లో రెండు భాగాలను పూర్తి చేయగలిగిందంటే దానికి కారణం ‘ప్రీ-ప్రొడక్షన్’. సెట్స్ మీదకు వెళ్లకముందే ప్రతి సన్నివేశంపై స్పష్టమైన అవగాహన ఉండటం. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఎక్కడ అవసరమో, ఎక్కడ సెట్ అవసరమో ముందే నిర్ణయించుకోవడం వల్ల వృథా తగ్గింది. రెండు భాగాలను ఏకకాలంలో ప్లాన్ చేయడం వల్ల తారాగణం డేట్స్ సెట్టింగ్స్ ఖర్చు ఆదా అయ్యింది. బి.వి.ఎస్ రవి మాటలను బట్టి చూస్తే, ఒక సినిమా విజయం అనేది కేవలం అందులో ఉండే గ్రాఫిక్స్ లేదా స్టార్లు మీద మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక జరిగే కార్యనిర్వాహక దక్షత మీద కూడా ఆధారపడి ఉంటుంది. అనవసరమైన ఆడంబరాలకు పోకుండా, కథకు ఏం కావాలో అంతే ఖర్చు చేసే పద్ధతిని పాటిస్తే టాలీవుడ్ నిర్మాతలు మరింత సురక్షితంగా ఉంటారు. రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు ఏ మాత్రం ప్రభావం చూపుతాయో చూడాలి.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×