Tata’s Upcoming EVs 2026: ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో టాటా మోటార్స్ దుమ్మురేపుతోంది. దేశీయ ఈవీ మార్కెట్ లో 36 శాతానికి పైగా వాటా కలిగిన ఈ కంపెనీ, తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది టాటా నుంచి నాలుగు సూపర్ ఈవీలు మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో సియెర్రా EV, సఫారీ EV, టియాగో EV ఫేస్‌లిఫ్ట్, అవిన్యా X ఉన్నాయి. ఇంతకీ వాటి ప్రత్యేకతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టాటా లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో సియెర్రా EV ఒకటి. ఈ SUV మే 22న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. డిజైన్ పరంగా చూస్తే, ఇది సాధారణ సియెర్రాను పోలి ఉన్నప్పటికీ, EVకి ప్రత్యేకమైన మార్పులు చేయనుంది. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కనెక్టెడ్ LED లైట్లు, స్టైలిష్ హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌లో పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయి. 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఒకే ఛార్జ్ తో సుమారు 500 కి.మీ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది.
టాటా నుంచి రానున్న మరో క్రేజీ మోడల్ సఫారీ EV. టాటా నుంచి తొలి ఎలక్ట్రిక్ 7-సీటర్ SUVగా వస్తుంది. డిజైన్ పరంగా ICE సఫారీ తరహాలోనే ఉన్నప్పటికీ, EV స్టైలింగ్‌తో మరింత ప్రీమియంగా కనిపించనుంది. ఈ SUVలో 540 డిగ్రీ కెమెరా, ఆటో పార్క్ అసిస్ట్, OTA అప్‌డేట్స్, అడ్వాన్స్ డ్ ADAS, ఆఫ్ రోడ్ మోడ్స్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. హారియర్ EVలో ఉన్నట్లే 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లు ఇందులో కూడా వచ్చే అవకాశం ఉంది. పెద్ద 80kWh బ్యాటరీ కూడా అందించే అవకాశం ఉంది. దీని ధర రూ.22.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండొచ్చు.
భారతదేశంలో అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లలో టియాగో EV ఒకటి. ఇప్పుడు దీనికి కొత్త ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తీసుకురానున్నారు. ఈ మోడల్‌లో పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్, మరిన్ని ఫీచర్లు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న చిన్న బ్యాటరీ స్థానంలో 24kWh బ్యాటరీని స్టాండర్డ్ గా ఇవ్వొచ్చని తెలుస్తోంది. కొత్తగా 30kWh బ్యాటరీ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా సుమారు 366 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందే అవకాశం ఉంటుంది. కొత్త డిజైన్, పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, 360 కెమెరా, సన్ రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండొచ్చు. ఈ నెలాఖరులోనే ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రీమియం మోడల్ గా అవిన్యా X అందుబాటులోకి రానుంది. ఈలగ్జరీ ఎలక్ట్రిక్ SUVని ఆటో ఎక్స్ పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. ఫ్యూచరిస్టిక్ లుక్ లో ఆకట్టుకుంటుంది. కూపే స్టైల్ SUV డిజైన్, T షేప్ LED లైట్లు, మినిమలిస్టిక్ క్యాబిన్, మసాజింగ్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్ లాంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఒకే ఛార్జ్ తో సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉంది. దీని ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
Read Also: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!