E-Paper
Advertisement

టాలీవుడ్‌లో ముదిరిన వివాదం.. ఎగ్జిబిటర్స్ వర్సెస్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్.. తగ్గడం లేదుగా..

టాలీవుడ్‌లో ముదిరిన వివాదం.. ఎగ్జిబిటర్స్ వర్సెస్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్.. తగ్గడం లేదుగా..
Advertisement

Tollywood Controversy: తెలుగు సినీ పరిశ్రమలో (టాలీవుడ్) నిర్మాతలు, థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్స్) మధ్య చాన్నాళ్లుగా నలుగుతున్న వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. ఓటీటీ రిలీజ్ విండో, థియేటర్ల అద్దె విధానాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు వ్యూహాత్మక ఘర్షణకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ‘యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ అత్యవసర మరియు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇండస్ట్రీ మనుగడను శాసించే కొన్ని ముఖ్యమైన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ సాగుతోంది.

Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి మరో బిగ్ అప్డేట్.. స్పెషల్ సాంగ్ వెన్యూ ఫిక్స్..

వివాదానికి కారణాలు

Advertisement

ఈ వివాదంలో ఇరు వర్గాల వాదనలు, డిమాండ్లు భిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా రెండు అంశాలు ఈ ఘర్షణకు కేంద్ర బిందువులుగా మారాయి. థియేటర్లను కేవలం ఫిక్స్‌డ్ అద్దె ప్రాతిపదికన నడపడం వల్ల తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్స్ వాదిస్తున్నారు. దీనికి బదులుగా, సినిమా కలెక్షన్లలో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేస్తుండటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారని ఎగ్జిబిటర్ల ఆందోళన. థియేటర్ రిలీజ్ తర్వాత కనీసం 6 నుండి 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని వారు కోరుతున్నారు.

తగ్గేదే లేదంటున్న నిర్మాతలు

ఎగ్జిబిటర్స్ డిమాండ్లపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాత పద్ధతిలోనే రెంటల్ బేసిస్ మీద మాత్రమే థియేటర్లు కొనసాగాలని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో, కలెక్షన్లలో వాటాలు ఇస్తే తాము కోలుకోలేమని వారు వాదిస్తున్నారు. ఓటీటీ ఒప్పందాలు అనేవి పూర్తిగా నిర్మాత వ్యక్తిగత, వ్యాపార నిర్ణయాలని, వాటిపై ఆంక్షలు విధించడం సరికాదనేది గిల్డ్ అభిప్రాయం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ ఇచ్చినప్పటికీ… టికెట్ ధరలు పెంచేది లేదని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేయడం గమనార్హం. ధరలు పెంచితే సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కు పూర్తిగా దూరమవుతాడని, దానికంటే తమకు లాభదాయకమైన ‘పర్సెంటేజ్ విధానం’ కావాలనేది వారి పట్టుదల.

Advertisement

Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి మరో బిగ్ అప్డేట్.. స్పెషల్ సాంగ్ వెన్యూ ఫిక్స్..

పరిశ్రమపై దీని ప్రభావం..

ఈ వివాదం త్వరగా సర్దుమణగకపోతే టాలీవుడ్ బాక్సాఫీస్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రాబోయే పెద్ద సినిమాల విడుదలకు థియేటర్ల కొరత ఏర్పడవచ్చు, లేదా ప్రదర్శనలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. నేడు జరుగుతున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో ఎగ్జిబిటర్లతో చర్చలకు ఒక మధ్యేమార్గ ఫార్ములాను రూపొందించే అవకాశం ఉంది. మరి ఈ సంక్షోభానికి నిర్మాతలు ఎలాంటి పరిష్కారాన్ని చూపుతారో, టాలీవుడ్ పెద్దలు ఈ వివాదానికి ఎలా శుభం కార్డు వేస్తారో వేచి చూడాలి.

Related News

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

Big Stories

Advertisement
×