E-Paper
Advertisement

Simple Energy Electric Scooter: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్ల రేంజ్, సింపుల్ ఎనర్జీ నుంచి అదిరిపోయే ఈవీ!

Simple Energy Electric Scooter: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్ల రేంజ్, సింపుల్ ఎనర్జీ నుంచి అదిరిపోయే ఈవీ!
Advertisement

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ..  తన ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ ఫోలియోను సింపుల్ వన్, సింపుల్ వన్ జెన్ 2 వెర్షన్లుగా విస్తరించింది. ఇందులో భాగంగానే సింపుల్ అల్ట్రాను ప్రవేశపెట్టడంతో పాటు, ఇప్పటి వరకు దేశంలో  ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వనంత రేంజ్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. సింపుల్ అల్ట్రా.. IDC సర్టిఫైడ్ 400 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. ఇది దేశంలోనే అత్యధిక రేంజ్ ను ఇచ్చే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. కొత్త అప్ డేట్స్ తో, సింపుల్ ఎనర్జీ లైనప్‌ లో భాగంగా నాలుగు విభిన్న మోడళ్లు విడుదల అయ్యాయి.

సింపుల్ అల్ట్రా ప్రత్యేకత ఏంటంటే?

సింపుల్ అల్ట్రా 6.5kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఫిక్స్ చేసిన అతిపెద్ద బ్యాటరీ ప్యాక్. ఈ స్కూటర్ 115kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. కేవలం 2.77 సెకన్లలో 0-40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రస్తుతం అమ్మకానికి ఉన్న అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.  ఈ స్కూటర్ కు సంబంధించిన ధర వివరాలు ఇంకా ప్రకటించలేదు. అయితే, సింపుల్ అల్ట్రా సింపుల్ ఎనర్జీ డీలర్‌ షిప్‌ లలో ప్రీ బుకింగ్ ప్రారంభం అయ్యాయి. త్వరలోనే డెలివరీలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు బ్యాటరీ ఎంపికలతో

Advertisement

సింపుల్ వన్ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 4.5kWh వేరియంట్ 236km IDC రేంజ్ ను అదిస్తుంది.  దీని ధర రూ. 1,69,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది 8.7bhp పవర్, 52Nm టార్క్‌ ను  ప్రొడ్యూస్ చేస్తుంది. 90 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇది 3.3 సెకన్లలో 0-40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక 5kWh వేరియంట్ 265 కిలో మీటర్ల IDC రేంజ్ ను అందిస్తుంది. దీని ధర రూ. 1,77,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ వెర్షన్ 12bhp పవర్, 72Nm టార్క్‌ ను అందిస్తుంది. 115 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ 2.55 సెకన్లలో 0-40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు వేరియంట్లలో ఆరు రైడింగ్ మోడ్‌లు, 35 లీటర్లల అండర్ సీట్ స్టోరేజ్, రెండు వీల్స్ కు CBS డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

జెన్ 2 మోడళ్ల డిజైన్, ఫీచర్లు   

జెన్ 2 స్కూటర్లు ఫంక్షనల్, ఫీచర్ అప్‌ గ్రేడ్‌ లను పొందాయి. వీటిలో రిఫ్రెష్ డిజైన్, కొత్త 1 లీటర్ గ్లోవ్ బాక్స్, డెడికేటెడ్ ఛార్జింగ్ పోర్ట్, రీ మోడల్ డాష్‌ బోర్డ్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్,  నాలుగు రేంజ్ ల రీజెనరేటివ్ బ్రేకింగ్ లాంటి కొత్త అప్ గ్రేడ్స్ ఉన్నాయి. ఇక సింపుల్ ఎనర్జీ దాని పోర్ట్‌ ఫోలియో అంతటా మోటార్, బ్యాటరీపై లైఫ్ టైమ్ వారంటీని అందిస్తోంది.

Advertisement

Read Also:  బజాజ్ To హోండా.. 2026 ట్రెండింగ్స్ బైక్స్ ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×