E-Paper
Advertisement

షాంపూ వాడితే ఫాగ్ మాయం.. కానీ, ఈ తప్పు అస్సలు చేయొద్దు!

షాంపూ వాడితే ఫాగ్ మాయం.. కానీ, ఈ తప్పు అస్సలు చేయొద్దు!
Advertisement

Shampoo for Windshield: వర్షాకాలం, చలికాలంలో కారు నడిపే సమయంలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో విండ్‌ షీల్డ్‌ మీద పొగమంచు ఏర్పడటం ఒకటి. దీనివల్ల రోడ్డు క్లియర్ గా కనిపించక డ్రైవింగ్ ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో కొంతమంది షాంపూను ఉపయోగిస్తే తాత్కాలికంగా ఈ సమస్య తగ్గుతుందని చెబుతుంటారు. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే పొగమంచుకు షాంపూ పని చేస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

షాంపూతో పొగమంచు మాయం!

వాస్తవానికి షాంపూ పొగమంచును క్లియర్ చేయడంలో సాయపడుతుంది. షాంపూలోని సర్ఫ్యాక్టెంట్లు నీటి బిందువులను గ్లాస్ మీద నిలబడకుండా చేస్తాయి. సాధారణంగా గాజుపై తేమ చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడి పొగమంచులా కనిపిస్తుంది. కానీ, షాంపూ పలుచని పొరలా పూయడం వల్ల ఆ తేమ బిందువులుగా కాకుండా ఒకేలా సమానంగా వ్యాపిస్తుంది. దీంతో గాజు కొంతవరకు పారదర్శకంగా కనిపించి, ఫాగ్ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది.

ఏ షాంపూ వాడితే మంచిది?

Advertisement

సాధారణంగా విండ్ షీల్డ్ మీద అన్ని షాంపూలను వాడటం మంచిది కాదు. ముఖ్యంగా ఎక్కువ కండిషనర్లు, ఇతర రసాయనాలు కలిగిన షాంపూలు గాజుపై జిడ్డును క్రియేట్ చేస్తాయి. ఇది పగటిపూట పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, రాత్రి సమయంలో ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు గాజుపై రిఫ్లెక్ట్ అయి కళ్లకు మిరుమిట్లు గొలిపే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణ షాంపూ, బేబీ షాంపూ లాంటి మృదువైన ప్రొడక్ట్స్ మాత్రమే తక్కువ పరిమాణంలో ఉపయోగించడం మంచిది.

ఈ తప్పు అస్సలు చేయకండి!

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది షాంపూను నేరుగా కారు వాషర్ ఫ్లూయిడ్ ట్యాంక్‌ లో కలపాలని భావిస్తారు. కానీ, అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే, షాంపూ ఎక్కువ నురుగు తయారు చేస్తుంది. ఆ నురుగు వల్ల వాషర్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవచ్చు. అంతేకాకుండా నాజిల్‌లు మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల వాషర్ ట్యాంక్‌ లో ఎప్పుడూ కంపెనీ సూచించిన వాషర్ ఫ్లూయిడ్ మాత్రమే ఉపయోగించాలి.

షాంపూ ఎలా వాడాలి?

Advertisement

షాంపూను ఉపయోగించాలనుకుంటే సరైన విధానం పాటించడం అవసరం. ముందుగా విండ్‌ షీల్డ్ లోపలి భాగాన్ని పూర్తిగా శుభ్రంగా తుడవాలి. తర్వాత మైక్రోఫైబర్ గుడ్డపై ఒక చిన్న చుక్క షాంపూ వేయాలి. ఆ గుడ్డతో గాజుపై చాలా పలుచగా రాసి, మరో శుభ్రమైన గుడ్డతో బాగా తుడిచి ఎలాంటి జిడ్డు, మచ్చలు లేకుండా స్పష్టంగా కనిపించే వరకు బఫ్ చేయాలి. అయితే, ఇది శాశ్వత పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి. కొంతకాలం మాత్రమే ప్రభావం ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేసే వారు, చల్లని ప్రాంతాల్లో డ్రైవ్ చేసే వారు ప్రత్యేకంగా లభించే ఆటోమోటివ్ యాంటీ ఫాగ్ స్ప్రేలను ఉపయోగించడం మంచిది. అలాగే కారు డీఫాగర్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను సరిగ్గా ఉపయోగించడం ద్వారా కూడా విండ్‌ షీల్డ్‌ పై పొగమంచు ఏర్పడకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.

Read Also: ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×