E-Paper
Advertisement

చైనా రైలు టికెట్ ధరలు చూస్తే, ఇండియన్ రైల్వేకు సెల్యూట్ చేయడం పక్కా.. ఎందుకంటే!

చైనా రైలు టికెట్ ధరలు చూస్తే, ఇండియన్ రైల్వేకు సెల్యూట్ చేయడం పక్కా.. ఎందుకంటే!
Advertisement

India vs China Train Ticket Prices: భారత్ లో పోల్చితే, ఇతర దేశాల్లో రైలు టికెట్ ఛార్జీలు చాలా ఎక్కువ. పొరుగు దేశం చైనాలో మనతో పోల్చితే రెట్టింపు ధరలు ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ రైళ్లు, హైస్పీడ్ రైళ్ల ఛార్జీలను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. భారత్‌ లో సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైల్వే శాఖ టికెట్ ధరలను చాలా తక్కువగా ఉంచుతోంది. అందుకే భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యంత చౌకైన రైలు రవాణా వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఇండియాలో ధరలు చాలా తక్కువ!

భారత్‌లో సాధారణ నాన్ ఏసీ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తోంది. దీంతో తక్కువ ఖర్చుతోనే లక్షలాది మంది ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అలాగే వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లలో కూడా ఛార్జీలు ఇతర దేశాలతో పోలిస్తే అందుబాటులోనే ఉంటాయి. వందే భారత్ ఏసీ చైర్ కార్‌లో కిలోమీటరుకు సుమారు రూ.2.19 మాత్రమే ఛార్జీ పడుతుంది. అందుకే వేగం, సౌకర్యం రెండూ కోరుకునే ప్రయాణికులకు ఈ రైళ్లు మంచి ఎంపికగా మారాయి.

చైనాలో టికెట్ ధరలు రెట్టింపు!

Advertisement

మరోవైపు చైనాలో సాధారణ రైళ్లు, హైస్పీడ్ రైళ్ల టికెట్ ధరలు భారత్‌ తో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అక్కడ ప్రయాణికులకు సీటర్, స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి పలు తరగతులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సీట్లు పూర్తిగా నిండిపోయినా స్టాండింగ్ టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది. చైనాలో సుమారు 1,400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఒక సాధారణ రైలు సర్వీస్‌కు దాదాపు 13 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రయాణానికి టికెట్ ధర సుమారు రూ.9,500 వరకు ఉంటుంది. అదే దూరాన్ని మన దేశంలో ప్రయాణించాలంటే రైలు రకాన్ని బట్టి సాధారణంగా 17 నుంచి 22 గంటల వరకు సమయం పడుతుంది. అయితే, ఫస్ట్ ఏసీ టికెట్ తీసుకున్నా దాదాపు రూ.5,000 లోపే ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఈ రెండు దేశాల మధ్య ప్రయాణ సమయాన్ని పోలిస్తే చైనా రైళ్లు వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాయి. కానీ, ఆ వేగానికి తగినట్టుగానే టికెట్ ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు భారతీయ రైల్వే ప్రయాణ సమయం కొంత ఎక్కువైనా, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. అందుకే సాధారణ ప్రజలకు భారతీయ రైల్వే అత్యంత అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థగా నిలుస్తోంది.  భారత్‌ లో ప్రభుత్వ సబ్సిడీ కారణంగా సాధారణ రైళ్లు మాత్రమే కాదు, వందే భారత్ వంటి ఆధునిక సెమీ హైస్పీడ్ రైళ్లలో కూడా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభిస్తోంది. అందువల్ల వేగం పరంగా చైనా ముందంజలో ఉన్నా, చౌకైన రైలు ప్రయాణం విషయంలో భారత్‌ కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.

Advertisement

Read Also: ఒకే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. భారత్‌ లోని అత్యంత విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇదే!

Related News

కొమురవెల్లి భక్తుల నిరీక్షణకు తెర.. కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం!

ఒకే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. భారత్‌ లోని అత్యంత విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇదే!

వెయ్యేళ్లుగా శివలింగంపై చెదరని ఛాయ.. ఆశ్చర్యపరుస్తున్న పానగల్లు ఆలయం మిస్టరీ!

భారత్ లో ఎడమ వైపు, అమెరికాలో కుడివైపు.. వాహనాలు నడిపే విధానంలో ఎందుకీ తేడా?

ఆకుపచ్చ నగరంగా మారిన కాంక్రీట్ జంగిల్‌.. ఇది కదా నిజమైన గ్రీన్ రివల్యూషన్ అంటే!

నల్లగొండ జిల్లాలో వజ్రాలు, బంగారు గనులు, వామ్మో.. అన్ని చోట్ల ఉన్నాయా?

విదేశాల్లో యుపిఐ హవా.. ఈ 10 దేశాల్లో భారతీయులు యుపిఐతో పేమెంట్స్ చేయవచ్చు

Big Stories

Advertisement
×