E-Paper
Advertisement

సింపుల్ అల్ట్రా vs ఏథర్ 450 అపెక్స్.. రెండు ఈవీలలో ఏది బెస్ట్?

సింపుల్ అల్ట్రా vs ఏథర్ 450 అపెక్స్.. రెండు ఈవీలలో ఏది బెస్ట్?
Advertisement

Simple Ultra vs Ather 450 Apex Comparison: ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ లో ఇటీవల పోటీ మరింత పెరిగింది. ముఖ్యంగా పనితీరు, వేగం, టెక్నాలజీ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మోడళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సింపుల్ వన్ అల్ట్రా విడుదల అయ్యింది. ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఏథర్   450 అపెక్స్ తో నేరుగా పోటీ పడుతోంది. ఈ రెండు స్కూటర్లు పవర్ ఫుల్ యాక్సిలరేషన్, ఎక్కువ టాప్ స్పీడ్ అందించినప్పటికీ, ధర, రేంజ్, ఫీచర్లలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ధర గురించి చూస్తే..

ధర విషయానికి వస్తే, సింపుల్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్‌ లో ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.2.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎక్కువ రేంజ్, పవర్‌పై దృష్టి పెట్టిన మోడల్ కావడంతో ధర కూడా ఎక్కువగానే ఉంది. మరోవైపు, ఏథర్ 450 అపెక్స్ ధర రూ.1.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా ప్రీమియం రేంజ్‌లో ఉన్నప్పటికీ, సింపుల్ అల్ట్రాతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ రెండు స్కూటర్లు కూడా ఒకే టాప్ వేరియంట్‌ లో లభిస్తున్నాయి.

రేంజ్ లో ఏది ఎక్కువ?

Advertisement

రేంజ్ విషయంలో సింపుల్ అల్ట్రా ముందు ఉంటుంది. ఇందులో 6.5 kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది.  ఇది ఒకే చార్జ్‌ పై 400 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ సెగ్మెంట్‌ లోనే అత్యధిక రేంజ్‌ అందించే స్కూటర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అటు ఏథర్ 450 అపెక్స్‌ లో 3.7 kWh బ్యాటరీ ఉంది. దీని రేంజ్ సుమారు 157 కిలోమీటర్లు. ఎక్కువ దూరం ప్రయాణం చేసే వారికి సింపుల్ అల్ట్రా బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తుంది.

పనితీరులో ఏది బెస్ట్?

పనితీరు పరంగా సింపుల్ అల్ట్రా ముందుంటుంది. ఇది 0 నుంచి 40 కి.మీ వేగాన్ని కేవలం 2.77 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 115 కి.మీ వరకు ఉంటుంది. ఇది స్పోర్టీ రైడింగ్ ఇష్టపడే వారికి అనుకూలంగా ఉంటుంది. ఏథర్ 450 అపెక్స్ కూడా మంచి పనితీరును అందించినప్పటికీ, ఈ విభాగంలో అల్ట్రా కాస్త ముందుంటుంది.

ఫీచర్లలో ఎలా ఉన్నాయి?

Advertisement

ఫీచర్ల విషయానికి వస్తే.. సింపుల్ అల్ట్రా ముఖ్యమైన ఫీచర్లపైనే దృష్టి పెట్టింది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్‌కు సంబంధించిన సమాచారం స్పష్టంగా చూపిస్తుంది. కానీ, ఏథర్ 450 అపెక్స్ టెక్నాలజీ విషయంలో మరింత ముందుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, TFT డిస్‌ ప్లే లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఆరు రైడింగ్ మోడ్‌లు ఉండటం వల్ల వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా పనితీరును మార్చుకోవచ్చు. మొత్తంగా సింపుల్ అల్ట్రా ఎక్కువ రేంజ్, పవర్ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. టెక్నాలజీ, కనెక్టివిటీ, తక్కువ ధరలో కావాలనుకుంటే ఏథర్ 450 అపెక్స్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఈవీ స్కూటర్లలో సంచలనం .. సింపుల్ వన్ అల్ట్రా కొనేందుకు టాప్ 5 రీజన్స్ ఇవే!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×