Vastu Tips For Bedroom: నిద్ర బాగా పట్టకపోతే రోజంతా అలసట, చిరాకు తప్పదు. మన బెడ్‌రూమ్‌లో ఉన్న చిన్న చిన్న వస్తువులు కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మంచం దగ్గర ఉంచే కొన్ని వస్తువులు నెగటివ్ ఎనర్జీని పెంచి మనసును అస్థిరంగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు గమనించకపోయినా ఇవే మీ నిద్ర సమస్యలకు కారణం కావచ్చు. అందుకే.. మంచి నిద్ర కోసం బెడ్ దగ్గర ఏమి ఉంచకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వాస్తు శాస్త్రం ప్రకారం మంచం దగ్గర ఉంచకూడని వస్తువులు:
1. ఎలక్ట్రానిక్ పరికరాలు:
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మంచం దగ్గర ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి విడుదల చేసే.. ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు మన మెదడును యాక్టివ్‌గా ఉంచి నిద్రను అడ్డుకుంటాయి. అంతేకాకుండా.. రాత్రి సమయంలో ఫోన్ చూడటం అలవాటైతే నిద్ర సమయం కూడా తగ్గుతుంది.
2. అద్దం (మిర్రర్):
మంచం ఎదురుగా లేదా పక్కన అద్దం ఉండటం వాస్తు ప్రకారం నిషిద్ధంగా భావిస్తారు. అద్దం మన శక్తిని ప్రతిబింబించి నిద్రలో అంతరాయం కలిగించవచ్చు. ఇది మనసులో ఆందోళన, భయం పెంచే అవకాశం కూడా ఉంటుంది.
3.చెత్త:
మంచం కింద లేదా చుట్టూ చెత్త, అనవసర వస్తువులు ఉంచడం నెగటివ్ ఎనర్జీకి కారణమవుతుంది. అవ్యవస్థం ఉన్న ప్రదేశంలో మనసు ప్రశాంతంగా ఉండదు. ఇది నిద్రపై నేరుగా ప్రభావం చూపుతుంది.
4. పాత పుస్తకాలు, ఫైల్స్ :
చాలా మంది బెడ్ పక్కన పుస్తకాలు, ఆఫీస్ ఫైల్స్ ఉంచుతారు. ఇవి పని ఒత్తిడిని గుర్తు చేస్తూ మనసును రిలాక్స్ అవ్వనివ్వవు. నిద్రకు ముందు మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.
Also Read: అదృష్టం కోసం చూస్తున్నారా? అయితే.. ఈ 5 వస్తువులకు దూరంగా ఉండండి!
5. నీటి పాత్రలు:
మంచం దగ్గర నీటి గ్లాసులు లేదా బాటిల్స్ ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇది భావోద్వేగ అస్థిరతను పెంచుతుందని చెబుతారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
6. మొక్కలు:
ఇంటి అందం కోసం బెడ్‌రూమ్‌లో మొక్కలు పెట్టడం చాలా మంది చేస్తారు. కానీ వాస్తు ప్రకారం రాత్రి సమయంలో.. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. ఇది గాలి నాణ్యతను తగ్గించి నిద్రను ప్రభావితం చేస్తుంది.
7.గడియారం (లౌడ్ క్లాక్):
బెడ్ దగ్గర పెద్దగా శబ్దం చేసే గడియారం ఉంచడం నిద్రలో అంతరాయం కలిగిస్తుంది. టిక్-టిక్ శబ్దం మెదడును అలర్ట్‌గా ఉంచి లోతైన నిద్రను అడ్డుకుంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న మార్పులు కూడా.. మన జీవితంపై పెద్ద ప్రభావం చూపుతాయి. మంచం దగ్గర ఉన్న వస్తువులను సరిగ్గా ఎంచుకోవడం ద్వారా మీరు మంచి నిద్రను పొందవచ్చు. ప్రశాంతమైన నిద్ర కోసం మీ బెడ్‌రూమ్‌ను క్లియర్, శుభ్రంగా ఉంచడం చాలా అవసరం.