E-Paper
Advertisement

Skoda Kylaq Discount: స్కోడా లవర్స్ కు గుడ్ న్యూస్, ఆ మోడల్ పై ఏకంగా రూ. 50 వేలు డిస్కౌంట్!

Skoda Kylaq  Discount: స్కోడా లవర్స్ కు గుడ్ న్యూస్, ఆ మోడల్ పై ఏకంగా రూ. 50 వేలు డిస్కౌంట్!
Advertisement

స్కోడా ఇండియా రీసెంట్ గా తన పాపులర్ SUV, కైలాక్ రెండు కొత్త వేరియంట్లను భారతీయ మార్కెట్ లోకి విడదల చేసింది. ఈ నేపథ్యంలోనే సదరు కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. స్కోడా కైలాక్ పై ఏకంగా రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. మోడల్ తయారీ సంవత్సరాన్ని బట్టి డిస్కౌంట్లను అందిస్తోంది.

2025 వెర్షన్లపై రూ. 50 వేల తగ్గింపు

తాజాగా సమాచారం ప్రకారం 2025 వెర్షన్లు గరిష్టంగా రూ. 50,000 వరకు డిస్కౌంట్లను పొందుతున్నాయి. 2026 వెర్షన్లు దాదాపు రూ. 30,000 వరకు డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. డీలర్‌ షిప్, స్టాక్ లభ్యతను బట్టి డిస్కౌంట్ మొత్తం మారే అవకాశం ఉంది. కచ్చితంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందనే విషయాన్ని సమీపంలోని డీలర్ దగ్గర తెలుసుకోవాలని సూచించింది.  స్కోడా కైలాక్ ప్రస్తుతం రూ. 7.59 లక్షల ప్రారంభ (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఈ SUV క్లాసిక్, క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్,  ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్లలో అందించబడుతుంది. టాప్ స్పెక్ వెర్షన్ ధర రూ. 12.99 లక్షలు(ఎక్స్ షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది.

స్కోడా కైలాక్ గురించి..

Advertisement

స్కోడా కైలాక్ అనేది స్కోడా ఆటో నుంచి వచ్చిన అత్యంత సరసమైన, కాంపాక్ట్ SUV. ఇది 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. అద్భుతమైన భద్రతా ఫీచర్లు, ఆధునిక డిజైన్‌ ను కలిగి ఉంది. ఈ కారు మైలేజ్ సుమారు 19 కిలో మీటర్లు ఇస్తుంది. అంతేకాదు, మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లుగా అందుబాటులో ఉంది. డిజైన విషయానికి వస్తే, 3,995 mm పొడవుతో, లేటెస్ట్ సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్, LED హెడ్‌ లైట్స్‌ తో వస్తుంది.  6 ఎయిర్‌ బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్,  హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్  లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆరు వేరియంట్లలో మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే, 446 లీటర్ల స్పేస్ ఉంటుంది. సీట్లు మడతపెడితే 1,265 లీటర్ల వరకు పెరుగుతుంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే 10.07-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌ రూఫ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. మస్కులర్ లుక్, 4-మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది.

Advertisement

Read Also: దేశీ మార్కెట్ లోకి 3 మారుతి సుజుకి కార్లు, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

సిటీ ప్రయాణాలకు అనుకూలం

ఇక స్కోడా కైలాక్ ముఖ్యంగా సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్లలో క్లాసిక్ AT వేరియంట్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. సుమారు రూ. 10 లక్షల్లో మంచి కారుగా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also:  నిస్సాన్ టెక్టన్ To స్కోడా కుషాక్ ఫేస్‌ లిఫ్ట్, మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ కార్లు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×