E-Paper
Advertisement

Odisha Vigilance: గనుల శాఖలో అవినీతి ‘ఘనుడు’.. తనిఖీల్లో నోట్ల గుట్టలు

Odisha Vigilance: గనుల శాఖలో అవినీతి ‘ఘనుడు’.. తనిఖీల్లో నోట్ల గుట్టలు
Advertisement

Odisha Vigilance: ఒడిశా గనుల శాఖలో భారీ అవినీతి తిమింగలం పట్టుపడింది. కటక్ సర్కిల్‌లోని గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి గత రాత్రి బొగ్గు వ్యాపారి నుంచి రూ.30,000 లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో విజిలెన్స్ అధికారులు అతని ఇల్లు, మాతాసాహిలోని అతని తల్లిదండ్రుల ఇల్లు, కటక్‌లోని అతని ఆఫీసులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ట్రాలీ బ్యాగులు, అల్మారాల్లో దాచిన రూ.4 కోట్లకు పైగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక నగదు స్వాధీనం కేసుగా అధికారులు చెబుతున్నారు.

ఒడిశా విజిలెన్స్ కటక్ సర్కిల్ గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతిని అరెస్టు చేసింది. భువనేశ్వర్‌లోని ఆయన ఫ్లాట్, ఇతర ప్రదేశాలలో జరిపిన సోదాల్లో రూ.4 కోట్లకు పైగా నగదు సీజ్ చేసింది. అలాగే అతని ఆఫీస్ లో రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకుంది. భువనేశ్వర్‌లోని రెండోతస్తుల భవనం, సుమారు 130 గ్రాముల బంగారం వంటి ఇతర ఆస్తులు కూడా దొరికాయి. విజిలెన్స్ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న తనిఖీలు

Advertisement

గతంలో గంజాం జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ డివిజన్‌లోని అసిస్టెంట్ ఇంజినీర్ నివాసంలో విజిలెన్స్ అధికారులు అత్యధికంగా రూ.3.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రూ.4 కోట్ల నగదు దొరకడంతో ఇదే భారీగా మొత్తంగా రికార్డుకెక్కింది. అవినీతి నిరోధక సంస్థ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదేనని విజిలెన్స్ డైరెక్టర్ యశ్వంత్ జెత్వా తెలిపారు. ఇప్పటివరకు రూ.4.27 కోట్ల విలువైన నగదును లెక్కించినట్లు భువనేశ్వర్ డివిజన్ విజిలెన్స్ ఎస్పీ సరోజ్ కుమార్ సమల్ పేర్కొన్నారు. 2009లో మొహంతిపై ఇలాంటి అవినీతి కేసు నమోదైంది. మయూర్‌భంజ్ జిల్లాలోని కోర్టులో అతనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని ఎస్పీ అన్నారు.

అవినీతి అధికారి పట్టుబడడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ లో అవినీతి ఎంతగా పెరిగిందో ఈ ఘటన నిదర్శనమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ అధికార బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు.

Advertisement

Also Read:   రూ.50వేలు లంచం తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ, ఎక్కడో కాదు ఏకంగా పీఎస్‌లోనే..?

అవినీతి అధికారి ఆస్తులు

మొహంతి ఆస్తులలో భువనేశ్వర్‌లో రెండంతస్తుల ఇల్లు, దాదాపు 130 గ్రాముల బంగారం ఉన్నాయి. అంతేకాకుండా, అతని పేరు మీద 2,400 చదరపు అడుగుల స్థలం ఉంది. ఇక్కడ మరో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొహంతి పేరు మీద 10 బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్నాయి. వాటిని కూడా తనిఖీ చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు అతడిపై నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

మొహంతి 2004లో జూనియర్ మైనింగ్ ఆఫీసర్‌గా రూ. 8,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. ఆయన కటక్‌కు బదిలీ అయ్యే ముందు బోలంగీర్, బారిపడ, బెర్హంపూర్‌లలో పనిచేశారు.

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×