E-Paper
Advertisement

Full Face Helmet: SMK టైటాన్ ఫుల్ ఫేస్ హెల్మెట్, దీన్ని పెట్టుకుంటే యాక్సిడెంట్ అయినా..

Full Face Helmet: SMK టైటాన్ ఫుల్ ఫేస్ హెల్మెట్, దీన్ని పెట్టుకుంటే యాక్సిడెంట్ అయినా..
Advertisement

నచ్చిన బైక్ కొనుగోలు చేయడంతో పాటు రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ కొనుగోలు చేయాలి. అయితే, వాహనదారులకు మంచి సేఫ్టీతో పాటు కంఫర్ట్ అందించే హెల్మెట్లను తయారు చేయడంలో కొన్ని కంపెనీలు బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి వాటిలో SMK టైటాన్ (SMK Titan) కంపెనీ ఒకటి. ఈ సంస్థ తయారు చేసిన అద్భుతమైన హెల్మెట్లలో ప్రీమియం ఫుల్ ఫేస్ మోటార్‌ సైకిల్ హెల్మెట్ ఒకటి. ఇది టూరింగ్, స్పోర్ట్ రైడర్ల కోసం రూపొందించబడింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

⦿ SMK Titan (స్టాండర్డ్ / ఫైబర్ వెర్షన్)  

ప్రీమియం ఫైబర్ టెక్నాలజీ (PFT – Premium Fiber Technology)తో తయారు చేయబడిన ఔటర్ షెల్ ఉంటుంది. దీని MRP సాధారణంగా రూ.9,000 నుంచి రూ. 10,000 వరకు. ఆన్‌ లైన్ ఆఫర్ ధరలు రూ. 6,500 నుంచి రూ. 9,000 వరకు ఉంటుంది.

⦿ SMK Titan Carbon

Advertisement

ప్రీమియం కార్బన్ కంపోజిట్ ఫైబర్ టెక్నాలజీ (PCFT – Premium Carbon Composites Fiber Technology)తో తయారు చేసిన  ఔటర్ షెల్ ఉంటుంది. ఇది తేలికగా, మరింత ప్రీమియం లుక్ లో ఉంటుంది. దీని ధర సాధారణంగా రూ. 11,800 నుంచి రూ. 12,000 వరకు ఉంటుంది. కొన్ని సైట్స్‌ లో రూ. 7,200 నుంచి రూ. 14,500 వరకు కనిపిస్తుంది.

ఈ హెల్మెల్ ECE 22.06, DOT సర్టిఫికేషన్ పొందింది. అంటే అత్యధిక సేఫ్టీ స్టాండర్డ్స్‌ ను కలిగి ఉంటుంది.

SMK టైటాన్ హెల్మెట్ కీ ఫీచర్లు (Key Features) 

Advertisement

ఔటర్ షెల్: ప్రీమియం కంపోజిట్ ఫైబర్, కార్బన్ ఫైబర్తో ఉంటాయి.  బెటర్ ఫిట్ కోసం 2 షెల్ సైజెస్ ఉంటాయి.

విజర్ సిస్టమ్: పిన్‌లాక్ 70 యాంటీ ఫాగ్ లెన్స్ ఫిట్టెడ్ తో ఉంటుంది. ఇది ఫాగ్ హెల్మెట్ కు పట్టేసుకోకుండా కాపాడుతుంది.  డ్యూయల్ విజర్ (ఇంటిగ్రేటెడ్ సన్ విజర్ + క్లియర్ విజర్) ఉంటుంది. స్క్రాచ్ రెసిస్టెంట్, క్విక్ రిలీజ్ విజర్ మెకానిజం ఉంటుంది.

వెంటిలేషన్: టాప్ ఎయిర్ వెంట్స్, చిన్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి. హాట్ ఎయిర్ ఎగ్జాస్ట్, ఛానల్డ్ ఎయిర్ ఇంటేక్స్ ఉంటాయి. వీటి ద్వారా చాలా మంచి ఎయిర్ ఫ్లో ఉంటుంది.

ఇంటీరియర్: రిమూవబుల్, వాషబుల్ లైనర్ ఉంటుంది. బ్రీతబుల్, హైపోఅలర్జెనిక్, మాయిస్చర్ మేనేజ్‌మెంట్ ఫాబ్రిక్ ఉంటుంది. ఎమర్జెన్సీ రిమూవల్ చీక్ ప్యాడ్స్ ఉంటాయి. అత్యవసర సమయంలో వీటిని  సులభంగా తీసేయవచ్చు. స్పీకర్ పాకెట్స్ బ్లూటూత్ హెడ్‌ సెట్ ఫిట్ చేయడానికి ఉంటాయి. ఐ గ్లాసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి.

ఇతర ఫీచర్లు

ఈ హెల్మెట్ ఏరోడైనమిక్ స్పాయిలర్. బ్రీత్ డిఫ్లెక్టర్,  విండ్ ప్రొటెక్టర్ ఉంటుంది. క్విక్ రిలీజ్ స్ట్రాప్, మల్టీ డెన్సిటీ EPS ఉంటుంది. దీని బరువు సుమారు రూ. 1600 గ్రాములు ఉంటుంది. కార్బన్ వెర్షన్ కాస్త తేలికగా ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే అత్యధిక ఇంపాక్ట్ ప్రొటెక్షన్, క్వైట్ హెల్మెట్ అంటే విండ్ నాయిస్ తక్కువగా ఉంటుంది.

Read Also: ఇకపై ప్రతి మారుతీ కారుకు సన్‌రూఫ్.. ముఖ్యంగా ఈ కార్లకే, అవేంటో చూసేయండి!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×