E-Paper
Advertisement

Maruti Suzuki Cars: ఇకపై ప్రతి మారుతీ కారుకు సన్‌రూఫ్.. ముఖ్యంగా ఈ కార్లకే, అవేంటో చూసేయండి!

Maruti Suzuki Cars: ఇకపై ప్రతి మారుతీ కారుకు సన్‌రూఫ్.. ముఖ్యంగా ఈ కార్లకే, అవేంటో చూసేయండి!
Advertisement

Maruti Suzuki Sunroof Cars: భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి తనకంటూ ఓ బేస్ క్రియేట్ చేసుకుంది. చౌకైన కార్ల నుంచి లగ్జరీ కార్ల వరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని తరగతుల వినియోగదారులకు అనుగుణంగా కార్లను విడుదల చేస్తోంది. ఈ ఏడాది అద్భుతమైన కార్లను తీసుకురాగా, 2026లో అదిరిపోయే లైనప్ ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. వచ్చే కార్లు అన్నింటికీ సన్ రూఫ్ తీసుకురావాలని భావిస్తోది. అయితే, ప్రస్తుతం మారుతి సుజుకి నుంచి అందుబాటులో ఉన్న సన్‌ రూఫ్ ఉన్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి 5 మోడల్స్‌ లో సన్‌ రూఫ్ ఫీచర్ అందిస్తోంది. ముఖ్యంగా టాప్ వేరియంట్లలో ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఇవి సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లేదంటే పనోరమిక్ సన్‌ రూఫ్ తో వస్తున్నాయి.

⦿ మారుతి డిజైర్ (Dzire) – కాంపాక్ట్ సెడాన్

సన్‌రూఫ్: టాప్ ZXi+ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

Advertisement

ధర: సన్‌రూఫ్ వేరియంట్ రూ. 9.3 లక్షలు ఉంటుంది.

ఇతర వివరాలు: 1.2L పెట్రోల్ ఇంజన్, 23-24 kmpl మైలేజ్, 6 ఎయిర్‌ బ్యాగ్స్, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ తో వస్తుంది.

⦿ మారుతి బ్రెజ్జా (Brezza) – సబ్ కాంపాక్ట్ SUV

Advertisement

సన్‌రూఫ్: ZXi,  ZXi+ వేరియంట్లలో లభిస్తుంది.

ధర: సన్‌రూఫ్ వేరియంట్లు రూ. 11 – 13 లక్షల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇతర వివరాలు: 1.5L పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్, 360° కెమెరా, హెడ్స్ అప్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది.

⦿ మారుతి ఫ్రాంక్స్ (Fronx) – క్రాస్‌ఓవర్ SUV

సన్‌ రూఫ్: టాప్ టర్బో వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

ధర: సన్‌ రూఫ్ వేరియంట్లు రూ. 11 – 12 లక్షల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇతర వివరాలు: 1.0L టర్బో, 1.2L పెట్రోల్, HUD, వైర్‌ లెస్ చార్జింగ్, 9 ఇంచ్ టచ్‌ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది.

⦿ మారుతి గ్రాండ్ విటారా (Grand Vitara) – కాంపాక్ట్ SUV

సన్‌రూఫ్: టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది. రియర్ పేన్ కూడా ఓపెన్ అవుతుంది.

ధర: సన్‌రూఫ్ వేరియంట్లు రూ. 15 – 20 లక్షల్లో అందుబాటులో ఉంది.

ఇతర వివరాలు: స్ట్రాంగ్ హైబ్రిడ్ (27+ kmpl), AWD ఆప్షన్, వెంటిలేటెడ్ సీట్స్ తో వస్తుంది.

⦿ మారుతి విక్టోరిస్ (Victoris), ఇన్విక్టో (Invicto) – మిడ్‌సైజ్ SUV/MPV

సన్‌రూఫ్: టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది.

ధర: విక్టోరిస్ రూ. 15 – 20 లక్షలు, ఇన్విక్టో రూ. 25 – 29 లక్షల్లో అందుబాటులో ఉంటుంది.

ఇతర వివరాలు: హైబ్రిడ్ టెక్, ప్రీమియం ఫీచర్లు, వెంటిలేటెడ్ సీట్స్, ADAS ఉంటాయి.

Read Also: మారుతి సుజుకి అదిరిపోయే ఆఫర్లు, హైబ్రిడ్ కార్లపై ఏకంగా..

ఈ ధరలు డిసెంబర్ 2025కు సంబంధించి కంపెనీ అధికారిక వివరాల ప్రకారం తీసుకోబడింది. సగటు ఎక్స్-షోరూమ్, ఆఫర్లు, టాక్స్ ను బట్టి మారే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం దగ్గర లోని మారుతి సుజుకి షో రూమ్ ను సంప్రదించడం మంచిది.

Read Also: భలే కారు.. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు.. ఛార్జింగ్ గోల లేదు.. ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×