E-Paper
Advertisement

Suzuki Access 125: మూడు వేరియంట్లు, ఐదు రంగులు.. సుజుకి యాక్సెస్ 125 అదిరింది బ్రో!

Suzuki Access 125: మూడు వేరియంట్లు, ఐదు రంగులు.. సుజుకి యాక్సెస్ 125 అదిరింది బ్రో!
Advertisement

సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా రీసెంట్ గా ఆటో ఎక్స్‌ పో 2025లో  సరికొత్త యాక్సెస్ 125ని విడుదల చేసింది. ఈ స్కూటర్ ధరలు రూ. 81,700 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ జపనీస్ స్కూటర్ OBD-2B కంప్లైంట్ 125 సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 8.4PS పవర్, 10.2Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 2025 సుజుకి యాక్సెస్ 125 మూడు వేరియంట్లలో వస్తుంది. స్టాండర్డ్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఈ మూడు వేరియంట్ల ఫీచర్లు, బ్రేకింగ్ సెటప్, ధర పరంగా డిఫరెంట్ గా ఉంటాయి.

⦿ స్టాండర్డ్ ఎడిషన్

సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్  125 సీసీ స్కూటర్  బేస్ వేరియంట్. రూ. 81,700 ధరతో అందుబాటులో ఉంది.   యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం. 2లో వస్తుంది. పూర్తి LED లైటింగ్ సెటప్‌తో వస్తుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ప్యూయెల్ గేజ్, ట్రిప్ మీటర్, క్లాక్, ఇతర ప్రైమరీ టెల్‌టేల్ లైట్‌లను ప్రదర్శించే LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది.  బేస్ వేరియంట్ కావడంతో,  స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ లేదు. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. హజార్డ్ లైట్ ఫీచర్, USB ఛార్జింగ్ పోర్ట్,  ముందు భాగంలో 2 క్యూబీ హోల్స్ ఉంటాయి.

⦿ స్పెషల్ ఎడిషన్

Advertisement

సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్ మిడ్ స్పెక్ వేరియంట్. ఇది రూ. 88,200కి అందుబాటులో ఉంది. ఇది నాలుగు రంగుల్లో వస్తుంది. మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం. 2, సాలిడ్ ఐస్ గ్రీన్. స్టాండర్డ్ ఎడిషన్ లాగానే, స్పెషల్ ఎడిషన్‌లో కూడా LCD కన్సోల్, ఆల్ LED లైటింగ్ సెటప్, హజార్డ్ లైట్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. దీనికి కూడా స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా లేవు. స్పెషల్ ఎడిషన్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్, CBS ఉన్నాయి.

⦿ రైడ్ కనెక్ట్ ఎడిషన్

టాప్ ఆఫ్ లైన్ సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ. 93,300గా ఉంటుంది. ఇది మొత్తం 5 పెయింట్ స్కీమ్‌ లలో వస్తుంది. మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం 2, సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బీజ్ కలర్ ఆప్షన్స్ ను కలిగి ఉంది. రైడ్ కనెక్ట్ ఎడిషన్‌లో అన్ని ఫీచర్లు, స్పెషల్ ఎడిషన్‌లో ఉన్న బ్రేకింగ్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీతో LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్,  వెదర్ అప్ డేట్స్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్ కాపీలను సేవ్ చేసుకునే డిజిటల్ వాలెట్‌ను అందిస్తుంది.

Advertisement

ఇక సుజుకి ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌ పో 2025లో ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ-యాక్సెస్ కూడా సుజుకి యాక్సెస్ ఫ్యామిలీకి చెందినది అయినప్పటికీ, దీనిని ప్రత్యేక మోడల్‌గా లాంచ్ చేశారు.

Read Also: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ VS టాటా పంచ్ EV.. వీటిలో ఏది బెస్ట్? ఎందుకంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×