E-Paper
Advertisement

Pawan Kalyan Big Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి భోగి రోజు.. బిగ్ అప్డేట్..

Pawan Kalyan Big Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి భోగి రోజు.. బిగ్ అప్డేట్..
Advertisement

Pawan Kalyan Big Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల వైపు వెళ్లిన కానీ సినిమాలకు ఏమాత్రం దూరం అవ్వకుండా.. వరుస పెట్టి షూటింగ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. అయితే ఈసారి నటుడిగా.. కాకుండా నిర్మాతగా కూడా బిజీ అవుతూ పవన్ కళ్యాణ్ మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. చాలా కాలంగా సినిమాల నుంచి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నిర్మాణ సంస్థ Pawan Kalyan Creative Works ద్వారా మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

భోగి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్‌ను కలవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ భేటీలో రాబోయే ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇది కేవలం నటనకే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలో కూడా కలిసి పని చేయాలనే ఆలోచనతోనే ఈ సమావేశం జరిగినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

జనసేన పనుల్లో స్టార్ నిర్మాత..

Advertisement

ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటుడిగా ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్.స బ్యానర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ అధినేత రామ్ తాళ్లూరి, జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్‌కు ఇది మంచి సపోర్ట్‌గా మారే అవకాశం ఉంది.

ఇదే సమయంలో కెవిఎన్ ప్రొడక్షన్స్.. కూడా పవన్ డేట్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కూడా.. పవన్ కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ కొత్త ఆరంభం..

Advertisement

పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా పోస్ట్‌లో “భోగి అనే శుభ సందర్భంలో కొత్త ఆరంభాలకు నాంది పలుకుతూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ మాటలు చూస్తే పవన్ ఇకపై నిర్మాతగా ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారన్న అర్థం వస్తోంది.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ స్వయంగా కొన్ని కథలపై చర్చలు జరుపుతున్నారు. రాజకీయ, పరిపాలనా బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో ఎక్కువ సినిమాలు చేయడం కష్టమని భావిస్తూ, తనకు దగ్గరైన నిర్మాతలతో కలిసి సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేస్తే సినిమాలపై తన ముద్ర ఉండడంతో పాటు..రాజకీయ బాధ్యతలకూ సమతుల్యం సాధించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమే కానీ ఈసారి నటుడిగా కాకుండా నిర్మాతగా అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది టాలీవుడ్‌కు కొత్త దిశ చూపించే అడుగుగా మారుతుందేమో చూడాలి.

Also Read: Pawan Kalyan: RCBకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార్నింగ్‌..మీ అంతు చూస్తాను రా అంటూ !

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×