E-Paper
Advertisement

టాటా కర్వ్ ఈవీ vs హ్యుందాయ్ క్రెటా ఈవీ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ SUV?

టాటా కర్వ్ ఈవీ vs హ్యుందాయ్ క్రెటా ఈవీ.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ SUV?
Advertisement

Tata Curvv EV vs Hyundai Creta EV: టాటా మోటార్స్ ఇటీవల దేశీ మార్కెట్లోకి కొత్త కర్వ్ ఈవీ సిరీస్ X ఎలక్ట్రిక్ కూపే SUVని పరిచయం చేసింది. మిడ్ రేంజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో మరింత పోటీని పెంచే ఉద్దేశంతో ఈ మోడల్‌ ను కొత్త వేరియంట్లతో తీసుకొచ్చారు. ధరను పెద్దగా పెంచకుండా, పెద్ద బ్యాటరీ ప్యాక్, మెరుగైన డ్రైవింగ్ రేంజ్ అందించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త కర్వ్ ఈవీ సిరీస్ Xను హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ తో పోల్చితే.. ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం..

ధర, వేరియంట్ల గురించి..

ఇక ఈ రెండు కార్లకు సంబంధించి ధరలు, వేరియంట్ల విషయానికి వస్తే, కర్వ్ ఈవీ సిరీస్ X మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు సుమారు రూ. 16.99 లక్షల నుంచిరూ. 19.49 లక్షల వరకు ఉంటాయి. అటు క్రెటా ఎలక్ట్రిక్ ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 18.02 లక్షల నుంచి రూ. 24.70 లక్షల వరకు ఉంటాయి. కర్వ్ EV ప్రారంభ ధర తక్కువగా ఉండగా, క్రెటా ఎలక్ట్రిక్ టాప్ వేరియంట్ కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్

Advertisement

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే, కర్వ్ EVలో 55 kWh సామర్థ్యంతో ఒకే బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ మోటార్‌ తో కలిసి సుమారు 167 హార్స్‌ పవర్, 215 Nm టార్క్‌ ను అందిస్తుంది. ఒకే ఛార్జ్ తో సుమారు 502 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. 7.2 kW AC ఛార్జర్‌ తో పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 7.6 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో 40 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఇక క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. చిన్న బ్యాటరీ 42 kWh సామర్థ్యంతో సుమారు 390 కి.మీ రేంజ్ ఇస్తుంది. పెద్ద బ్యాటరీ 51.4 kWh ఉండి సుమారు 473 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. పవర్ పరంగా చిన్న బ్యాటరీతో 135 PS, పెద్ద బ్యాటరీతో 171 PS వరకు ఉత్పత్తి చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుండి 80 శాతం ఛార్జ్ కావడానికి దాదాపు 58 నిమిషాలు పడుతుంది. అయితే 11 kW హోమ్ ఛార్జర్‌తో పూర్తి ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటలు మాత్రమే పడుతుంది.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల విషయంలో కర్వ్ EV మంచి ప్యాకేజీగా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ 12.3 అంగుళాల డిస్ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, లెదరెట్ సీటింగ్, వైర్‌ లెస్ కనెక్టివిటీ, పవర్డ్ డ్రైవర్ సీటు, ప్రీమియం సౌండ్ సిస్టమ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. లెవెల్ 2 ADAS, V2L వంటి టెక్నాలజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి కర్వ్ EV మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఎక్కువ వేరియంట్లు, బ్యాటరీ ఆప్షన్స్ కోరుకునే వారికి క్రెటా ఎలక్ట్రిక్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

Read Also: టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్టర్.. సిటీ డ్రైవింగ్‌కు ఏది బెస్ట్?

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×