E-Paper
Advertisement

టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్టర్.. సిటీ డ్రైవింగ్‌కు ఏది బెస్ట్?

టాటా పంచ్ vs హ్యుందాయ్ ఎక్స్టర్.. సిటీ డ్రైవింగ్‌కు ఏది బెస్ట్?
Advertisement

Tata Punch vs Hyundai Exter Comparison: సిటీ ప్రయాణాల కోసం కారు కొనాలనుకునే వారికి టాటా పంచ్, హ్యుండాయ్ ఎక్స్టర్ బెస్ట్ ఆప్షన్స్ గా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో డ్రైవింగ్ సులభంగా ఉండే, తక్కువ ఖర్చుతో నడిచే, మంచి ఫీచర్లతో కూడిని ఈ కార్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రెండు కార్లలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ధరలు ఎలా ఉన్నాయంటే?

ధరల విషయంలో ఈ రెండు కార్ల మధ్య పెద్ద తేడా లేదు. టాటా పంచ్ ధర సుమారు రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభమై రూ. 10.60 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ మాత్రం రూ. 5.64 లక్షల నుంచి రూ. 9.57 లక్షల వరకు అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్‌ లో పంచ్ కొంచెం తక్కువ ధరలో లభిస్తుంది. కానీ, టాప్ వేరియంట్లకు వెళ్తే ఖర్చు పెరుగుతుంది.

ఇంజిన్ గురించి..

Advertisement

ఈ రెండు కార్లూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటాయి. పంచ్‌లో 1199cc ఇంజిన్ ఉండగా, ఎక్స్టర్‌లో 1197cc ఇంజిన్ ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ లో మాత్రం తేడా కనిపిస్తుంది. పంచ్ కొంచెం బలంగా అనిపిస్తుంది. రోడ్లపై స్ట్రాంగ్ గా నడుస్తుంది. ఎక్స్టర్ స్మూత్‌ గా ఉంటుంది. ట్రాఫిక్‌లో నెమ్మదిగా డ్రైవ్ చేయడానికి బాగా సూటవుతుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫీచర్ల పరంగా చూస్తే, ఎక్స్టర్ కొంచెం ముందుంది. ఇందులో సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జింగ్, డిజిటల్ డిస్‌ ప్లే, డాష్‌ క్యామ్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. పంచ్ కూడా 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఫీచర్లతో వస్తోంది. ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇవి చాలా యూజ్ అవుతాయి.

భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత విషయంలో మాత్రం పంచ్‌ కు మంచి పేరు ఉంది. ఇది గ్లోబల్ NCAP, భారత్ NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ కారు మరింత సురక్షితంగా ఉంటుంది. ఎక్స్టర్‌ లో కూడా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నాయి. క్రాష్ టెస్ట్ రికార్డ్ పరంగా పంచ్‌ కు స్థాయిలో లేదు.

సిటీ డ్రైవింగ్ కు ఏది బెస్ట్?

సిటీ డ్రైవింగ్ విషయానికి వస్తే, ఈ రెండు కార్లు కూడా చిన్న పరిమాణంలో ఉండటం వల్ల ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది.  పార్కింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఎక్స్టర్ స్మూత్ డ్రైవింగ్, కంఫర్ట్ కోసం బాగుంటే, పంచ్ కాస్త గట్టిగా ఉండి,  ఎలాంటి రోడ్లు అయినా చక్కగా నడుస్తుంది. మంచి సౌకర్యం, ఫీచర్లు, స్మూత్ డ్రైవింగ్ కోరుకుంటే ఎక్స్టర్ బెస్ట్ ఆప్షన్. భద్రత, బలమైన నిర్మాణం, రగ్గడ్ ఫీలింగ్ కావాలనుకుంటే పంచ్ తీసుకోవడం మంచిది.

Read Also: భారత సైన్యం కోసం స్పెషల్ వెహికల్, మహీంద్రా కీలక నిర్ణయం!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×