E-Paper
Advertisement

టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.45 లక్షల తగ్గింపు!

టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.45 లక్షల తగ్గింపు!
Advertisement

Tata EV Discounts in May 2026: టాటా మోటార్స్ తన ఈవీ మోడళ్లపై భారీగా డిస్కౌంట్లు అందిస్తోంది. మే 2026కు సంబంధించి పెద్ద మొత్తంలో తగ్గింపు ప్రకటించింది పాత స్టాక్ ను క్లియర్ చేయడం, కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడం లక్ష్యంగా కంపెనీ  ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కొన్ని మోడళ్లపై మొత్తం ప్రయోజనాలు రూ.3.45 లక్షల వరకు ఇస్తోంది.  ఈ ఆఫర్లలో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, లాయల్టీ ఆఫర్, స్క్రాపేజ్ సపోర్ట్ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ నెలలో టాటా అందిస్తున్న డిస్కౌంట్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టాటా కర్వ్.ev

ప్రస్తుతం ఈ మోడల్ పై అత్యధిక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 2025 మోడల్ స్టాక్‌ పై కంపెనీ భారీ తగ్గింపులు ఇస్తోంది. ఈ కారుపై మొత్తం ప్రయోజనాలు రూ.3 లక్షల నుంచి రూ.3.45 లక్షల వరకు ఉన్నాయి. కొత్తగా వచ్చిన 2026 కర్వ్.ev మోడళ్ల ధరలు రూ.16.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటిపై సాధారణ సీజనల్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.

⦿ టాటా హారియర్ EV

Advertisement

ఈ SUVపై సుమారు రూ.1.5 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.1 లక్ష వరకు లాయల్టీ బోనస్, మరో రూ.50 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. ఇప్పటికే టాటా వాహనం ఉపయోగిస్తున్న వారు కొత్త EVకి మారితే అదనపు ప్రయోజనాలు అందిస్తోంది.

⦿ టాటా నెక్సాన్.ev

ఈ మోడల్ పైనా ప్రత్యేక ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈ కారుపై మొత్తం రూ.1.41 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్, గ్రీన్ బోనస్ లాంటి పలు ఆఫర్లు ఉన్నాయి. నెక్సాన్ ఇప్పటికీ మంచి డిమాండ్‌లో ఉన్న ఈవీ మోడల్‌ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ టాటా పంచ్.ev

Advertisement

ఈ కారుపై భారీ తగ్గింపులు అందిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌ లిఫ్ట్‌ కు ముందు వచ్చిన మోడళ్లపై రూ.1.55 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. కొత్త మోడళ్లపై కూడా రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.  కంపెనీ  బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే కొత్త ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ విధానంలో కారు ప్రారంభ ధర తక్కువగా ఉంటుంది. బ్యాటరీ కోసం వినియోగం ఆధారంగా కిలోమీటరుకు ఛార్జీలు చెల్లించాలి. కొనుగోలు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.

⦿ టాటా టియాగో.ev

ఎంట్రీ లెవల్ EV కొనాలనుకునే వారికి టాటా టియాగో.evపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై మొత్తం ప్రయోజనాలు రూ.1.30 లక్షల నుంచి రూ.1.35 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ సపోర్ట్ ఉన్నాయి. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునేవారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఏథర్ EL ప్లాట్‌ ఫారమ్ రెడీ.. ఇక చవక ధరలో కొత్త ఈ-స్కూటర్లు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×