E-Paper
Advertisement

ఏథర్ EL ప్లాట్‌ ఫారమ్ రెడీ.. ఇక చవక ధరలో కొత్త ఈ-స్కూటర్లు!

ఏథర్ EL ప్లాట్‌ ఫారమ్ రెడీ.. ఇక చవక ధరలో కొత్త ఈ-స్కూటర్లు!
Advertisement

Ather New EL Platform: ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో సరికొత్త సంచలనాన్ని నమోదు చేయనుంది. తన నెక్ట్స్ జెనరేషన్ స్కూటర్ ప్లాట్‌ ఫారమ్‌ ను ప్రకటించింది. EL పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ పై పని చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ ప్లాట్‌ ఫారమ్‌ కు సంబంధించిన ధర, బ్యాటరీ సామర్థ్యం, విడుదల తేదీ, వేరియంట్ల వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ, కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే, EL ప్లాట్‌ ఫారమ్‌ ను పెద్ద స్థాయిలో మార్కెట్‌ ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

ఇప్పటికే ఏథర్ 450 సిరీస్, రిజ్టా అనే రెండు పాపులర్ మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. 450 సిరీస్ ఎక్కువ పనితీరు, స్పోర్టీ డిజైన్ కోరుకునే యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. మరోవైపు రిజ్టా కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ స్థలం, సౌకర్యం, రోజువారీ వినియోగానికి అనువుగా తయారు చేసింది. ప్రస్తుతం ఈ రెండు సిరీస్‌ లలో కలిపి తొమ్మిది వేరియంట్లు మార్కెట్లో ఉన్నాయి.

మాస్ మార్కెట్ లక్ష్యంగా EL ప్లాట్‌ ఫారమ్  

Advertisement

రాబోయే EL ప్లాట్‌ ఫారమ్ ద్వారా కంపెనీ మరింత పెద్ద సంఖ్యలో వినియోగదారులను చేరుకోవాలని చూస్తోంది. అంటే, పలు అవసరాలు అనుగుణంగా ఉండే మరిన్ని స్కూటర్లను తీసుకురావడానికి ఈ ప్లాట్‌ ఫారమ్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఏథర్

కంపెనీ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. FY26లో ఏథర్ మొత్తం 2.62 లక్షలకు పైగా స్కూటర్లను అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 69 శాతం వృద్ధి సాధించింది. నాల్గవ త్రైమాసికంలో ఏకంగా 83 వేలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో రిజ్టా స్కూటర్ కీలక పాత్ర పోషించింది. అలాగే కంపెనీ దేశ వ్యాప్తంగా తన రిటైల్ నెట్‌ వర్క్‌ ను కూడా వేగంగా విస్తరిస్తోంది.  FY25 చివర్లో 351 ఎక్స్‌ పీరియన్స్ సెంటర్లు ఉండగా, FY26 ముగిసే సమయానికి వాటి సంఖ్య 700కు చేరింది. కేవలం ఏడాదిలోనే కంపెనీ తన షోరూమ్ నెట్‌ వర్క్‌ ను దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ విస్తరణ కొత్త EL ప్లాట్‌ ఫారమ్ స్కూటర్లను దేశ వ్యాప్తంగా త్వరగా వినియోగదారులకు చేరవేయడంలో సాయపడనుంది.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారీ పెట్టుబడులు

Advertisement

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ మహారాష్ట్రలోని ఆరిక్ ప్రాంతంలో కొత్త ఫ్యాక్టరీపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. IPO ద్వారా వచ్చిన నిధులను ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మొత్తం రూ.927 కోట్ల ప్రణాళికలో ఇప్పటికే కొంత మొత్తం ఖర్చు చేయగా, ఇంకా పెద్ద మొత్తంలో పెట్టుబడి మిగిలి ఉంది. దీని ద్వారా భవిష్యత్తులో భారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. సాఫ్ట్‌ వేర్, కనెక్టెడ్ ఫీచర్లపై కూడా ఏథర్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఛార్జింగ్ సేవలు, యాక్సెసరీలు, సర్వీస్, సాఫ్ట్‌ వేర్ సబ్‌ స్క్రిప్షన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా కంపెనీకి పెరుగుతోంది.  ప్రస్తుతం 6,000కు పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also: 125 స్పీడ్.. 320 కి.మీ రేంజ్.. ఓలా నుంచి దుమ్మురేపే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×