E-Paper
Advertisement

Tata Punch EV Facelift: టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ చౌకైన వేరియంట్ వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?

Tata Punch EV Facelift: టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ చౌకైన వేరియంట్ వచ్చేసింది, దీని ధర ఎంతో తెలుసా?
Advertisement

Tata Punch EV Facelift’s Affordable Variant: టాటా మోటార్స్ రీసెంట్ గా భారతీయ మార్కెట్ లోకి టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసింది. ఈ అప్ డేటెడ్ పంచ్ EVని బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ కు సంబంధించి అత్యంత సరసమైన వేరియంట్ ను అనౌన్స్ చేసింది. ఈ కారు ధర రూ. 6.49 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. అయితే, బ్యాటరీతో కలిసి రూ. 9.69 లక్షలు(ఎక్స్ షోరూమ్)తో విడుదల చేసింది. ఈ మైక్రో ఎలక్ట్రిక్ SUV కోసం బుకింగ్స్ మొడలైన నేపథ్యంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్ వేరియంట్ వివరాలు బయటకు వచ్చాయి.

టాటా పంచ్ EV ఫేస్ లిఫ్ట్ చౌకైన వేరియంట్ గురించి..

టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్‌ లోని టాప్ వేరియంట్‌ తో పోల్చితే కీలక తేడా 15 అంగుళాల స్టీల్ వీల్స్. అదే సమయంలో టాప్ వేరియంట్ లో 16 అంగుళాల స్టీల్ వీల్స్ లభిస్తాయి. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ రంగుల ఎంపికలు సూపర్నోవా కాపర్, ప్యూర్ గ్రే, ప్రిస్టైన్ వైట్, బెంగాల్ రూజ్ లకు మాత్రమే పరిమితంగా ఉన్నాయి. కారామెల్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ఫియర్‌ లెస్ ఎల్లో లాంటి ఇతర కలర్స్ టాప్  ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే..

Advertisement

ఫీచర్ల గురించి పరిశీలిస్తే.. టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఎంట్రీ లెవల్ వెర్షన్‌లో కొత్త టచ్ సెన్సిటివ్ HVAC ప్యానెల్, రెండు డ్రైవింగ్ మోడ్‌లు.. సిటీ, స్పోర్ట్ మోడ్స్ తో వస్తుంది. iRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఫ్రంట్ పవర్ విండోస్, రియర్ సీట్ అడ్జస్టబుల్ హెడ్‌ రెస్ట్‌ లు, LED DRLలు, ఎత్తు సర్దుబాటు చేసే డ్రైవర్ సీటు, మల్టీ మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఎలక్ట్రిక్ టెయిల్‌ గేట్ తో కూడిన అప్ డేటెడ్ టు స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

భద్రతా ఫీచర్లు

టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఎంట్రీ లెవల్ లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, i-TPMS, ESP, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, హై బీమ్ అలర్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్ ప్యాకేజీతో వస్తుంది.

టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ ఎంట్రీ లెవల్ బ్యాటరీ, రేంజ్

Advertisement

2026 టాటా పంచ్ EV స్మార్ట్ వేరియంట్ 30 kWh బ్యాటరీ ప్యాక్‌ తో కలిపి ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఇది 87 bhp పవర్, 154 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ ట్రెయిన్ ఒకే ఛార్జ్‌ పై 375 కి.మీ ప్రయాణాన్ని అందిస్తుంది. అదే సమయంలో  స్మార్ట్ ప్లస్ నుంచి  బ్రాండ్ 40 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తుంది. ఇది ఒకే ఛార్జ్‌ తో 468 కి.మీ MIDC రేంజ్ ను అందిస్తుంది.

Read Also: బ్లాక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×