E-Paper
Advertisement

టాటా To మహీంద్రా.. భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టాటా To మహీంద్రా.. భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Top Trending EV SUVs May 2026: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌ లో  కంపెనీలు కొత్త EV మోడళ్లను తీసుకొస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ రన్నింగ్ ఖర్చులతో చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 మే నాటికి భారత మార్కెట్‌లో కొన్ని EV SUVలు ప్రత్యేకంగా ట్రెండింగ్‌ లో నిలుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

⦿ టాటా పంచ్ EV

ప్రస్తుతం టాటా పంచ్ EV టాప్ ట్రెండింగ్ లో ఉంది. చిన్న కుటుంబాలకు అనువైన సైజ్, నగరాల్లో సులభమైన డ్రైవింగ్ అవకాశం, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్, సరసమైన ధరల కారణంగా మధ్యతరగతి వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. టాటా పంచ్ EV ధరలు రూ.8 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

⦿ మహీంద్రా BE 6e

Advertisement

మహీంద్రా కూడా కొత్త ఎలక్ట్రిక్ SUV BE 6eతో మార్కెట్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారు భవిష్యత్ తరహా డిజైన్‌ తో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం ఇంటీరియర్‌, పెద్ద డిజిటల్ స్క్రీన్లు, అత్యాధునిక ఫీచర్లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మోడల్ ధరలు ప్రీమియం సెగ్మెంట్‌ కు అనుగుణంగా ఉన్నాయి.

⦿ టాటా నెక్సాన్ EV

భారత రోడ్లపై ఎక్కువగా కనిపించే ఎలక్ట్రిక్ SUVలలో టాటా నెక్సాన్ EV ఒకటి. మంచి బ్యాటరీ రేంజ్, బలమైన నిర్మాణం, టాటా సర్వీస్ నెట్‌ వర్క్ కారణంగా వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతారు. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండటంతో పాటు, సిటీ, హైవే డ్రైవింగ్ రెండింటికీ ఈ మోడల్ సరిపోతుంది.

⦿ విండ్సర్ EV

Advertisement

MG మోటార్ తన విండ్సర్ EVతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రీమియం క్రాసోవర్ యుటిలిటీ వెహికల్‌గా మార్కెట్లోకి వచ్చింది. విశాలమైన క్యాబిన్‌, ప్రీమియం ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ కారణంగా కుటుంబాలకు బాగా నచ్చుతోంది. మిడ్ రేంజ్ ధరలో విలాసవంతమైన అనుభవాన్ని అందించడం దీనికి ప్లస్ పాయింట్‌ గా మారింది.

⦿ టాటా సియెర్రా EV

ప్రస్తుతం ఈవీ మార్కెట్‌ లో బాగా ఆసక్తిని కలిగిస్తోంది. ఇంకా అధికారికంగా విడుదల కాకపోయినా, ఈ మోడల్‌ పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు భారత మార్కెట్లో ప్రసిద్ధి చెందిన సియెర్రా పేరును మళ్లీ ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురావడం వల్ల ఆటో ప్రియుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పెద్ద సైజ్ SUV డిజైన్, విశాలమైన ఇంటీరియర్‌, మంచి ఫీచర్లతో  మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.

⦿ మారుతి సుజుకి e విటారా

ఇక దేశంలో అత్యంత పెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన మారుతి సుజుకి కూడా ఇప్పుడు EV మార్కెట్‌ లో అడుగుపెడుతోంది. కంపెనీ తీసుకొస్తున్న e Vitara మోడల్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, సర్వీస్ నె ట్‌వర్క్, పోటీ ధరల కారణంగా ఈ SUV మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది.

Read Also: తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×